Cell Phone Addicts: బాల్యాన్ని ఎంజాయ్ చేయనీయండి... సెల్‌ఫోన్ బానిసలుగా మార్చకండి
ఏకాగ్రత లోపిస్తోంది. టీచర్లతో దురుసుగా మాట్లాడడం.. తల్లితండ్రుల్ని ఎదురించడం ఎక్కువయ్యింది. ర్యాగింగ్, బుల్లీయింగ్, ఘర్షణలు ఇటీవల ఎక్కువయ్యాయి.
ఒక్కోసారి మనం ఫ్లో లో వెళ్లిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాం. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకుంటాం. అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం. నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు. వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్ లో పనిచేస్తున్న వారే. కరోనా ముందుతో పోలిస్తే, ఇప్పుడు పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూశారా? అయితే ఏంటది? అని ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగా.
చదవండి: ఆ 91 మంది డీబార్... వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులే...?
వారిలో ఏ ఒక్కరూ పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు. సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు. కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసులు అని చెప్పారు. మొబైల్‌కు వ్యసనం మయ్యారని సమాధానం చెప్పారు. ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్లా? అని తల్లిదండ్రులే అంటున్నారు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వంలో చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అనుకునే వారు.. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకుని మురిసిపోతున్నారు.
చదవండి: చదివింది డిగ్రీ.. రూ.50 లక్షల జీతం.. ఎలా అంటే..?
తల్లిదండ్రుల మురిపెంను తల్లకిందులు చేస్తూ యునెస్కో తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పింది. కమిషన్‌లపై ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్‌తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. పాఠశాలల్లో మొబైల్స్‌ను నిషేధించాలని యునెస్కో కుంబబద్ధలు కొడుతూ తన నివేదికను వెల్లడించింది.
కరోనా కాలం లో అందరూ ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తే.. అప్పట్లో నేను దీన్ని సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు? అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ చేశారు. దీనికి సమాధానంగా నేను వారు కట్టిన ఫీజు ఇచ్చేయండి.. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్లోనే మీ అబ్బాయిని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేస్తామని చెప్పేశా. చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు.
చదవండి: School Holidays: ఈ నెలలో ఏకంగా 8 సెలవులు.. తేదీలు ఇవే..!
పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి . సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు.
అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము. ఒక్కోరూ కనీసం అయిదు మందికి ఇలా ఒక వారం రోజుల వానల వల్ల వచ్చిన సెలవుల్లో కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సెల్ ఫోన్ వద్దు... కావాలంటే ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు.. ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు.
చదవండి: Future With Education: చదువుతో బంగారు భవిష్యత్
అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ముందు మనం పాటించినప్పుడే పక్కవారికి చెప్పే హక్కు ఉంటుంది. కాబట్టి మన పిల్లలు సెట్ అయితే మిగిలిన పిల్లలు.. మన పిల్లలను చూసి మంచి విషయాలు నేర్చుకుంటారు. మార్పు మనింటినుంచే మొదలు కావాలి .
- వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త