చదువుతో బంగారు భవిష్యత్
Sakshi Education
కంచికచర్ల(నందిగామ): విద్యార్థులు బంగారు భవిష్యత్ కోసం చదువును ఆయుధంగా మలచుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ డాక్టర్ జె.రాజేంద్రప్రసాద్ సూచించారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల మనోగతాన్ని తెలుసుకుని ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. ఆరో తరగతి నుంచే శ్రద్ధగా చదివితే పదో తరగతిలో 600 మార్కులు సాధించొచ్చని సూచించారు. అనంతరం మన బడి నాడు– నేడు పథకం పనులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం అమలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని వారితో కలసి భోజనం చేశారు. ఎంఈఓ బి.బాలాజీ, హెచ్‌ఎం పి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Published date : 04 Aug 2023 03:32PM