AP TET Notification 2024 : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా!
పేపర్–1 ఏ ఎస్‌జీటీ టీచర్లకు, పేపర్–1 బీ ప్రత్యేక విద్య ఎస్‌జీటీ టీచర్లకు,పేపర్–2 ఏ స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్–2 బీ ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు పరీక్ష నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 1 నుంచి 5వ తరగతుల బోధనకు పేపర్–1(ఎ, బి), 6 నుంచి 8వ తరగతుల బోధనకు పేపర్–2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
» అర్హత: పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు అర్హులే.
» పరీక్ష విధానం: పేపర్–1 ఏ, పేపర్–1 బీ ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్–2 ఏ, పేపర్–2 బీ నాలుగు విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలకు–150 మార్కులకు పరీక్ష నిర్వస్తారు.
» పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ఉంటుంది. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 03.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.08.2024.
» హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేది: 22.09.2024 నుంచి ప్రారంభం
» పరీక్షల తేదీలు: 03.10.2024 నుంచి 20.08.2024 వరకు
» వెబ్‌సైట్: https://aptet.apcfss.in
Tags
- TET Exam
- AP TET 2024 Notification
- Teacher Eligibility Test
- Exam notification
- online applications
- hall ticket download for ap tet 2024
- exam process for ap tet
- eligibile candidates for tet exam
- DSC
- TET
- Teachers Jobs
- Govt and Private Schools
- Education News
- Sakshi Education News
- TeacherEligibilityTest
- AndhraPradeshEducation
- APGovernmentNotification
- DSCWeightage
- APTET2024