Polytechnic Admissions: పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
ఈ మేరకు ఏపీ పాలిసెట్–2023 కన్వీనర్ పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అక్టోబర్ మూడో తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 5న స్పాట్ అడ్మిషన్ల వివరాలు వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
6న ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్ల జాబితాలను 9వ తేదీలోగా కన్వీనర్, పాలిసెట్–2023 అడ్మిషన్ల పేరిట ఇన్ పర్సన్ అందజేయాలి. జిల్లా వ్యాప్తంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో సుమారు వివిధ కోర్సుల్లో 2 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
చదవండి: Scholarships in NMMS: ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల.. రూ.12వేల స్కాలర్‌షిప్
పాలిసెట్ రాయని వారు, రాసిన వారు, అర్హత ఉండి, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే పాలిసెట్ అడ్మిషన్లు పొందాలని పాలిసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్.రామారావు తెలిపారు. ఇతర వివరాలకు 94401 24846 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.