Skip to main content

Department of Education: స్పౌజ్‌ టీచర్ల దరఖాస్తుల పరిశీలన

ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్కూల్‌ అసిస్టెంట్లు స్పౌజ్‌ కేటగిరీలో చేసుకున్న దరఖాస్తులను విద్యాశాఖ అక్టోబ‌ర్ 1న‌ అధికారులు పరిశీలించారు.
Department of Education
స్పౌజ్‌ టీచర్ల దరఖాస్తుల పరిశీలన

ఈ కేటగిరీలో 36 మంది ఎస్‌ఏ లు, పీఎస్‌హెచ్‌ఎంలు దరఖాస్తుచేసుకున్నారు. పది పాయింట్లు కేటాయించడంతో బదిలీల్లో వీరు ముందు వరుసలో ఉండనున్నారు. అయి తే భార్య పనిచేస్తున్న సమీపంలోని పాఠశాలకు భర్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా గే భర్త పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో బది లీల్లో దరఖాస్తు చేసుకున్నారా.. లేక మరో పా ఠశాలకు దరఖాస్తు చేసుకున్నారా అనే విషయాలను పరిశీలించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా స్పౌజ్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవా లని ఇటీవల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Amzath Basha: ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలి

ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి పై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తె లుస్తోంది. కాగా అక్టోబ‌ర్ 1న‌రాత్రి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీల్లో ఎడిట్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. సోమవారం బదిలీలఉత్తర్వులు వెలు వడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ప్రక్రియను డీఈవో ప్రణీత, విద్యాశాఖ ఉద్యోగులు శ్రీహరిబాబు, పూర్ణచందర్‌, మహేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, తదితరులున్నారు.

Published date : 02 Oct 2023 03:34PM

Photo Stories