Amzath Basha: ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలి
ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (ఐటా) జిల్లాశాఖ తరపున ఆదివారం కడప బెల్లంమండి వీధిలోని మదరసా జెవారాలోని కాన్ఫరెన్స్ హాలులో 13 మంది ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులను ఆశించకుండా ఆదర్శవంతంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఐటాయే ఎంపిక చేసి సన్మానించడం అభినందనీయమన్నారు.
చదవండి: School Bags: బడి బ్యాగు బరువు తగ్గించాలి!
అవార్డులు తీసుకున్న ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పనిచేసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఐటా జాతీయ ప్రధాన కార్యదర్శి మీర్ ముంతాజ్ అలీ మాట్లాడుతూ ఈ సంఘం కేవలం ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా ఆదర్శ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తుందన్నారు. ఐటా జాతీయ కార్యదర్శి షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఐటా ఉపాధ్యాయులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ చాటిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటా జిల్లా అధ్యక్షుడు నజీర్‌బాషా, జిల్లా గౌరవాధ్యక్షులు మౌలానా గౌస్ అహ్మద్, నిజామ్, జిల్లా కార్యదర్శి ఆబ్బాస్‌అలీ, రాష్ట్ర ట్రెజరర్ ఫయాజుల్ రెహమాన్, జేఐహెచ్ అధ్యక్షుడు ఖాదర్‌వలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.