Exam Preparation: ఈ 14 టిప్స్ ఫాలో అయితే... పరీక్ష ఏదయినా... విజయం మీదే!!
ఇంటర్ సీబీఎస్‌ఈ పరీక్షల కోసం విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు.. ముఖ్యంగా ఫిజిక్స్ బోర్డు పరీక్షల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటారు. అందులో ఉండే సిలబస్, వాటిని అర్థం చేసుకునే తీరు విధానం వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలతో.. ప్రణాళికలను సిద్ధం చేసుకోండి చదవండి మీ పరీక్షకు సిద్ధమవ్వండి..
సిలబస్‌ని అర్థం చేసుకునే విధానం:
సిలబస్‌లో ఉన్న పాఠాలను, అధ్యాయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పాత ప్రశ్నా పత్రాలను దృష్టిలో పెట్టుకొని, మీకు అనుకూలంగా చదవాలి.
అర్థం చేసుకోవాలి:
సిలబస్‌లో ఉన్న వివరాలను పరిశీలించి అర్థం చేసుకొని రాయాలేకాని, దానిని గుర్తుపెట్టుకొని రాయోద్దు.
నేర్చుకునే పద్దతి:
ఫిజిక్స్‌లో మనం చదువుకోవాల్సిన ప్రశ్నలతోపాటు నేర్చుకోవలసిన లెక్కలను కూడా గ్రహించాలి. వాటిని రోజూ రాత రూపంలో సాధన చేస్తేనే అర్థం అవుతుంది. రోజూ రకరకాల ప్రశ్నలను నేర్చుకోవాలి. దీంతో మీకు రాయడంతోపాటు లెక్కలు పూర్తి చేసే విధానం తెలుస్తుంది.
OU Diploma Admission Notification 2024-విదేశీ భాషల్లో డిప్లొమా కోర్సులకు ఆహ్వానం
సమయ పాలన:
ప్రతి ఒక్క పాఠానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయానికల్లా చదవడం లేదా నేర్చుకోవడం పూర్తి చేయాలి. మీ సమయం వృధా కాకుండా చూసుకోవాలి.
రివిజన్:
పరీక్షల సమయంలో ఎంత చదువుకున్న రివిజన్ చేయడం కీలకం. దీని అర్థం మళ్ళీ చదవాలని కాదు. పాఠాలన్నింటినీ ఒక్కసారి క్రమంగా పరిశీలించుకోవాలి.
Intelligence Bureau Recruitment 2024: ఐబీలో 226 పోస్ట్‌లు.. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
పాత పత్రాల పరిశీలన:
గతేడాది ప్రశ్న పత్రాలను సేకరించి, వాటితో సాధన చేయాలి. ఫిజిక్స్‌లో వ్యాసాలు లెక్కలు రెండూ ఉంటాయి. వాటిని రోజువారిగా సాధన చేసుకోవాలి.
సందేహాల నివృత్తి:
మీకు ఎటువంటి సందేహాలున్న వాటిని తప్పనిసరిగా మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.
ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలు:
ఈ పుస్తకాలను కూడా పరిశీలిస్తూ ఉండాలి. ఇవి సీబీఎస్‌సీ పరీక్షలకు పునాది. అందులో ఉండే ముఖ్యాంశాలను సేకరించి చదవాలి.
Gandhi Medical College: ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత.. కారణం ఇదే..
రోజువారీ వార్తలు:
మన పరీక్షల సమయంలో మనం వార్తలను క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. ముఖ్యంగా ఫిజిక్స్ కి సంబందించిన కరెంట్ అఫైర్స్‌ను అనుసరించాలి.
ఆరోగ్యం:
మార్కులకు చదువెంత ముఖ్యమో పరీక్ష రాసేందుకు మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పరీక్షకు చదువుకే సమయం మధ్యలో విరామం తీసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు చదువులో ధ్యాస పెరిగేందుకు నిద్ర కూడా ముఖ్యమే.
స్వయం పరీక్షలు:
మీకు మీరుగా కొన్ని పరీక్షలను నిర్వహించుకోవాలి. ఇలా చేస్తే మీరు చదివే అంశాలేంటో, చేసే తప్పులేంటో తెలుస్తాయి. ఈ పరీక్షలతో మీ చదువును మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనేది అర్థం అవుతుంది.
ICAI CA Intermediate Final Results Out- CA ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
సమయ పాలన:
చదివేందుకు ఒక సమయాలన్ని పాటించాల్సి ఉంటుంది. ఆ సమయంలోపే మీరు చదివే పాఠాన్ని పూర్తి చేసుకోవాలి. మీరు నిర్వహించుకున్న పరీక్షలకు కూడా ఒక సమయం సిద్ధం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం.
నమ్మకంగా ఉండండి:
పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో మిమ్మల్ని మీరే పూర్తిగా నమ్మాలి. ఈ సమయంలోనే నిస్సందేహంగా మెలగాలి. ఎటువంటి ఆలోచనలతోనూ మీ ఆరోగ్యాన్ని కానీ, మీ పరీక్షకు గానీ ఇబ్బందులు తెచ్చుకోవద్దు. పరీక్ష సమయంలో ఎంత హాయిగా ఉంటే అంత మంచిది.
Collector Sikta Patnaik: సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
పైవాటితో మీరు మీ ఫిజిక్స్ మాత్రమే కాకుండా ఎటువంటి పరీక్షలోనైనా రాణించవచ్చు.
Tags
- intermediate exams
- Board Exams
- preparations
- students preparation
- physics exams
- Intermediate subjects
- sources for preparations
- tips for students exams
- Academic Exams
- intermediate board exams 2024
- students struggle
- exams results
- intermediate exams 2023
- TimeManagement
- SupportSystem
- exampreparation
- StressManagement
- Sakshi Education Latest News