Skip to main content

Group Exams Material and Questions : గ్రూప్స్‌ పరీక్షల్లో అత్యంత కీలకం.. ఇళ్లలో వాడే విద్యుచ్ఛక్తి వినియోగానికి ప్రమాణాలు?

భూమి ఒక పెద్ద సహజ అయస్కాంతం. సహజ అయస్కాంతాలకు మరోపేరు లోడ్‌స్టోన్స్‌. కృత్రిమ అయస్కాంతాలను ఘర్షణ ద్వారా లేదా విద్యుత్‌ పద్ధతి ద్వారా తయారు చేస్తారు.
Appsc, tspsc and police jobs group exams in physics and chemistry   competitive exams study materials

అయస్కాంతత్వం, విద్యుత్‌

భూమి ఒక పెద్ద సహజ అయస్కాంతం. సహజ అయస్కాంతాలకు మరోపేరు లోడ్‌స్టోన్స్‌. కృత్రిమ అయస్కాంతాలను ఘర్షణ ద్వారా లేదా విద్యుత్‌ పద్ధతి ద్వారా తయారు చేస్తారు.
    అయస్కాంతాలు – రకాలు
    1) దండాయస్కాంతం
    2) స్తూపాకార అయస్కాంతం
    3) గోళీలు చివరలు ఉన్న అయస్కాంతం
    4) గుర్రపు నాడ అయస్కాంతం
    5) వలయాకార అయస్కాంతం
    అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ: ఇనుము, ఉక్కు, నికెల్‌.
    అనయస్కాంత పదార్థాలకు ఉదాహరణ: కాగితం, రబ్బరు, ప్లాస్టిక్‌.
     అయస్కాంతాలు దిశా ధర్మాన్ని కలిగి ఉంటాయి. వాటిని వేలాడదీస్తే ఉత్తర, దక్షిణ దిశలను సూచిస్తూ నిశ్చల స్థితికి వస్తాయి.
     సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. దీన్నే అయస్కాంత ధ్రువాల సూత్రం అంటారు.
     అయస్కాంతాలు ఏక ధ్రువాలు. ఇవి విడిగా ఉండలేవు. జతలుగా మాత్రమే ఉంటాయి. 
     కృత్రిమ అయస్కాంతాలను ఏక స్పర్శా, ద్వి స్పర్శా, విద్యుత్, ప్రేరణ పద్ధతుల్లో తయారు చేస్తారు.
     శాశ్వత అయస్కాంతాల తయారీకి ఆల్నికోను ఉపయోగిస్తారు.
     ఎలక్ట్రిసిటీ అనే పదం క్రీ.పూ. 600 సంవత్సరంలో గ్రీకు శాస్త్రవేత్త థేల్స్‌ ప్రయోగించడంతో వాడుకలోకి వచ్చింది.
     సీమ గుగ్గిలాన్ని గ్రీకు భాషలో ఎలక్ట్రాన్‌ అంటారు.
     విద్యుదావేశం వస్తువులపై స్థిరంగా ఉండ టం వల్ల ఈ భాగాన్ని స్థిర విద్యుత్‌ శాస్త్రం అంటారు.
     మేఘాల్లోకి గాలి పటాలను ఎగరేసి అవి విద్యుదావేశం కలిగి ఉంటాయని నిరూపించినవారు – బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌.
     ్ర΄ాథమిక ఘటాన్ని నిర్మించినవారు వోల్టా.
     వోల్టా ఘటంలో సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని విద్యుత్‌ విశ్లేష్యంగా, జింక్‌ను కాథోడ్‌గా, కాపర్‌ను ఆనోడ్‌గా ఉపయోగిస్తారు.

Join our Telegram Channel (Click Here)

     వోల్టా ఘటంలో రసాయన శక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది.
     వోల్టా ఘటంలోని లో΄ాలు.
    1) స్థానిక చర్య    2) ధ్రువీకరణం
     వోల్టా ఘటంలోని లో΄ాన్ని సవరిస్తూ నిర్మించిన ఘటం లెక్లాంచి ఘటం.
     లెక్లాంచి ఘటంలో జింక్‌ను కాథోడ్‌గా, కార్బన్‌ కడ్డీని ఆనోడ్‌గా, NH4Cl ను విద్యుద్విశ్లేష్యంగా ఉపయోగిస్తారు.
     బైక్రోమేట్‌ ఘటంలో K2Cr2O7+­H2­SO4 మిశ్రమాన్ని విద్యుద్విశ్లేష్యంగా ఉపయోగిస్తారు.
     అనార్థ్ర ఘటం లెక్లాంచి ఘటానికి మరో రూపం.
     అనార్థ్ర ఘటంలో జింక్‌ను రుణ  ఎలక్ట్రోడ్‌గా, కార్బన్‌ +MnO2ల మిశ్రమాన్ని ధన ఎలక్ట్రోడ్‌గా ఉపయోగిస్తారు.
     రేడియో, టార్చ్‌లైట్, టేప్‌ రికార్డ్‌లలో ఉపయోగించే ఘటం అనార్థ్ర ఘటం.
     వలయం ద్వారా విద్యుత్‌ను ప్రవహింప చేసేందుకు ఘటం చేయగలిగే పనినే దాని ‘విద్యుచ్ఛాలక బలం’ అంటారు.
     విద్యుచ్ఛాలక బలాన్ని వోల్టుల్లో కొలుస్తారు.
     విద్యుచ్ఛాలక బలంతో రసాయన శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చవచ్చు.
     వలయాన్ని పూర్తి చేయడానికి, తెరవడానికి స్విచ్‌ను ఉపయోగిస్తారు.
     విద్యుత్‌ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత క్షేత్రాన్ని ఆంపియర్‌ స్విమ్మింగ్‌ నిబంధన ద్వారా పరిశీలించవచ్చు.
     విద్యుత్‌ ప్రవహించే తీగ అయస్కాంతంలా ప్రవర్తించి అయస్కాంత క్షేత్రాన్ని 
ఏర్పరుస్తుంది.
     పొడవైన విద్యుత్‌ బంధక స్తూ΄ాకార గొట్టాన్ని తీసుకొని దాని చుట్టూ విద్యుత్‌ బంధక పూత ఉన్న రాగి తీగను ఖాళీ లేకుండా దగ్గరగా చుడితే దాన్ని సోలినాయిడ్‌ అంటారు.
    విద్యుత్‌ ప్రవహించే సోలినాయిడ్‌ దండాయస్కాంతంలాæ పనిచేస్తుంది.
    విద్యుత్‌ ప్రవాహాన్ని సూచించడానికి గాల్వనో స్కోప్‌ను ఉపయోగిస్తారు.
eligibility exams
     విద్యుత్‌ ఘటంలో గుర్రపు నాడ 
అయస్కాంతాన్ని ఉపయోగిస్తారు.
     దూర ప్రదేశాలకు తక్కువ కాల వ్యవధిలో 
వార్తలను పంపే ఆధునిక సాధనాల్లో మొదటిది టెలిగ్రాఫ్‌.

Join our WhatsApp Channel (Click Here)

     మోర్స్‌కోడ్‌ను ఉపయోగించడం వల్ల టెలిగ్రాఫ్‌ మరింత సమర్థంగా పనిచేస్తుంది.
     మోర్స్‌కోడ్‌లో ప్రతి అక్షరానికి చుక్కలు, గీతలతో కూడిన గుర్తులను ఇస్తారు.
     మోర్స్‌ కీ.. ఓ ని కొంచెం ఎక్కువ నొక్కి ఉంచితే దాన్ని (–) గీతతో సూచిస్తారు.
     మోర్స్‌ కీ.. ఓ ని కొంచెం తక్కువ నొక్కి ఉంచితే దాన్ని (.) చుక్కతో సూచిస్తారు.
     విద్యుత్‌ విశ్లేష్యం ద్వారా విద్యుత్‌ ప్రవహించడం వల్ల జరిగే ముఖ్య రసాయన చర్య విద్యుత్‌ విశ్లేషణం.
    H2O → 2H++ O2–
     కాపర్‌ సల్ఫేట్‌ ద్రావణ విద్యుత్‌ విశ్లేషణం CuSO4 → Cu2+ + SO42–
    విద్యుద్విశ్లేషణం అనువర్తనాలు:
    1) ఎలక్ట్రోప్లేటింగ్‌ 
    2) గిల్టు నగల తయారీ
    3) లోహ సంగ్రహణం
    4) ఎలక్ట్రిక్‌ ప్రింటింగ్, గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ల తయారీ.
     విద్యుత్‌ ప్రవాహానికి కలిగే అవరోధాన్ని ఆ వాహక నిరోధం అంటారు.
     లోహపు తీగల ద్వారా జరిగే ప్రవాహం ఎలక్ట్రాన్‌ల వల్ల ఏర్పడుతుంది.
     వాహక విద్యుత్‌ నిరోధం దాని ΄÷డవుకు అనులోమాను΄ాతంలో, మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమాను΄ాతంలో ఉంటుంది.
     విద్యుచ్ఛక్తి ఉష్ణశక్తిగా మారడానికి కారణం విద్యుత్‌ నిరోధం.
     విద్యుత్‌ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితాలు ఏర్పడతాయి అనే సూత్రం ఆధారంగా ఎలక్ట్రిక్‌  బల్బు, ఎలక్ట్రిక్‌ ఇస్త్రీపెట్టే, సోల్డరింగ్‌ గన్‌ మొదలైన పరికరాలు పనిచేస్తాయి.
     విద్యుదయస్కాంతాన్ని మెత్తని ఇనుముతో తయారు చేస్తారు.
     ఘటాలను శ్రేణిలో కలిపితే మొత్తం విద్యుచ్ఛాలక బలం పెరుగుతుంది.
     ఘటాలను సమాంతరంగా కలిపితే మొ త్తం విద్యుచ్ఛాలక బలం విడిగా ఉన్న విద్యుచ్ఛాలక బలం కంటే ఎక్కువ ఉండదు.

Follow our Instagram Page (Click Here)

     విద్యుత్‌ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త: థామస్‌ ఆల్వా ఎడిసన్‌.
       విశిష్ట నిరోధానికి ప్రమాణం..
    ఓమ్‌ – మీటర్‌
     నిరోధానికి ప్రమాణం: ఓమ్‌
     విద్యుత్‌ విశ్లేషణ నియమాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త: ఫారడే.
     విద్యుత్‌ ప్రవాహానికి ప్రమాణం: ఆంపియర్‌.
     విద్యుత్‌ ప్రవాహాన్ని కొలిచే పరికరం: అమ్మీటర్‌.
     విద్యుత్‌ పొటెన్షియల్‌కు ప్రమాణం: ఓల్ట్‌.
     విద్యుత్‌ పొటెన్షియల్‌ను కొలిచే పరికరం: ఓల్ట్‌మీటర్‌.

ఘటం రుణ ఎలక్ట్రోడ్‌ ధన ఎలక్ట్రోడ్‌ ఎలక్ట్రోలైట్‌ EMF
వోల్టా జింక్‌ కాపర్‌ H2SO4 1.08
లెక్లాంచి జింక్‌ కార్బన్‌ NH4Cl 1.5
బైక్రోమేట్‌ జింక్‌ కార్బన్‌ K2Cr2O7+ H2SO4 2
అనార్ధ్ర జింక్‌ కార్బన్‌ NH4Cl (Paste) 1.5

గతంలో అడిగిన ప్రశ్నలు
1.    అయస్కాంతం అనయస్కాంతీకరణం జరిగే విధానం?
    1) నిర్లక్ష్యంగా వినియోగించడం
    2) వేడి చేయడం
    3) వ్యతిరేక దిశలో అయస్కాంతీకరించడం
    4) పైవన్నీ
2.    వాహకం ద్వారా విద్యుత్‌ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రవహించడాన్ని ఏమంటారు?
    1) స్థిర విద్యుత్‌    2) ప్రవాహ విద్యుత్‌
    3) రెండూ    4) ఏదీకాదు
3.    సంకేతం సూచించే విద్యుత్‌ పరికరం?
    1) నిరోధం    2) రియోస్టాట్‌
    3) ప్లగ్‌–కీ    4) ఘటం
4.    ఇళ్లలో వాడే విద్యుచ్ఛక్తి వినియోగానికి ప్రమాణాలు?
    1) WH    2) కెల్విన్‌
    3) KWH    4) వోల్ట్స్‌
5.    బైక్రోమేట్‌ ఘటంలో రుణ ధ్రువంగా
    పనిచేసేది?
    1) రాగి పలక    2) జింక్‌
    3) కార్బన్‌ కడ్డీ    4) ఏదీకాదు

సమాధానాలు
    1) 4;    2) 2;    3) 1;    4) 3;    5) 2.

Follow our YouTube Channel (Click Here)

మాదిరి ప్రశ్నలు
1.    శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?
    1) కాపర్‌    2) ఇనుము
    3) ఆల్నికో    4) ఇత్తడి
2.    సీమ గుగ్గిలాన్ని గ్రీకులో ఏమంటారు?
    1) ఎలక్ట్రాన్‌      2) ప్రోటాన్‌
    3) న్యూట్రాన్‌    4) పాజిట్రాన్‌
3.    వోల్టా ఘటంలో విద్యుత్‌ విశ్లేష్యం?
    1) HNO3     2) H2SO4
    3) HCl       4) NH4Cl
4.    బైక్రోమేట్‌ ఘటం విద్యుచ్ఛాలక బలం?
    1) 1.08    2) 1.5    3) 2    4) 1.6

సమాధానాలు
    1) 3; 2) 1;     3) 2;  4) 3. 

Published date : 24 Sep 2024 02:54PM

Photo Stories