Skip to main content

AP History: ప్రముఖులు- ఆంధ్రకు చేసిన సేవలు

AP History Important Persons Study Material and Practice Questions useful for all competitive exams of APPSC group1, group2, group3 , group 4 and AP police exams.
AP History

Preparation‌ Guidance‌: ఒకే సమయంలో.. ప‌లు ఉద్యోగ పరీక్షలకు ప్రిపరేషన్ ఇలా..

  • మనిషి సాధించిన ప్రగతిపథానికి అద్దం పట్టేది చరిత్ర. చరిత్రలో సామాజిక, సాంస్కృతిక కోణం నుంచి ఆలోచన చేస్తే అనేక సంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు వ్యక్తీకరించబడతాయి. లిఖిత, పురావస్తు ఆధారాల ద్వారా కొన్ని విషయాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్రకు కూడా అనేక మంది మేథావులు కృషి చేశారు. తాము తమ జీవితాలను త్యాగంచేసి మన సంస్కృతిని కాపాడుకోవడానికి సాంస్కృతిక సంపదను వారసత్వంగా అందించారు.
  • ‘సంస్కృతి అనేది దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకుందాం’ అని బ్రిటన్ దేశంలో తన సన్నిహితులతో సర్ థామస్ మన్రో అన్నారు. ప్రకృతి-మానవుల సమ్మేళనం సంస్కృతి. తెలుగు ప్రాంత సంస్కృతిలో సంక్రాంతి సంబరాలు, కోడిపందేలుతో పాటు, హరికథా గానాలు, బుర్ర కథలు కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు ‘ఉత్తర భారతదేశ సంస్కృతికి దక్షిణ భారత సంస్కృతికి పుట్టిన బిడ్డే భారతదేశ సంస్కృతి’. ఆ దక్షిణ భారతదేశ సంస్కృతిలో మనం కూడా భాగస్వాములైనందుకు గర్వించాలి. ధనం నష్టపోతేతిరిగి సంపాదించుకోవచ్చు. భూభాగాలు పోయినా తిరిగి దక్కించుకోవచ్చు కానీ సంస్కృతిని గాని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే సాంస్కృతిక వారసత్వ సంపద ఎంతో విలువైంది.
  • ఆంధ్రులే కాకుండా, విదేశీయులు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వేనోళ్ల కొనియాడారు. సంగీతం, సాహిత్యం, కట్టడాల నిర్మాణం మొదలగు సేవా ప్రక్రియలతో వారు నేటికీ వివిధ ప్రాంతాలలో ఆరాధనా మూర్తులుగా పూజించబడతారు. రాయలసీమ ప్రాంతంలో తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రోలమ్మి అనే పేర్లు థామస్ మన్రో మీద ప్రేమను వ్యక్తీకరించుటకు గల కారణం.
  • వివిధ గ్రంథాలు, శాసనాలు, కైఫియత్‌లు ఆధారంగా వార్తా పత్రికల కథనాల ప్రకారం ఈ కింది మేథావులైన ఆంధ్రులు, విదేశీయులు ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతికి శక్తి వంచన లేకుండా సేవ చేశారు. అటువంటి వారిలో ఈ కింది ప్రముఖుల సేవ మరువలేనిది, చిరస్మరణీయమైంది. సువర్ణాక్షరాలతో లిఖించదగింది.

Reforms in Recruitments: గ్రూప్‌–1 మినహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ రద్దు

ప్రముఖులు- ఆంధ్రకు చేసిన సేవలు..
రాబర్ట్ బ్రూస్‌పుట్:
చారిత్రక పూర్వ యుగాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి వివరించారు. ఈయనను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రి హిస్టరీ’ అంటారు.
 
ప్లీనీ: ‘నాచురల్ హిస్టరీ’ అనే గ్రంథాన్ని రాశారు. రోమ్ సంపద బంగారం రూపంలో భారతదేశానికి తరలిపోతుంది అని వాపోయారు.
 
టాలమీ: ై‘గెడ్ టు జాగ్రఫీ’ అనే గ్రంథాన్ని రాశారు. ‘ట్రిలింగాన్’ అనే పదాన్ని వాడారు.
 
మెగస్తనీస్: ఆంధ్రులకు 30 దుర్గాలు (కోటలు) ఉన్నాయి అని తన ‘ఇండికా’ గ్రంథంలో రాశారు.
ఇండికా గ్రీక్ భాషా గ్రంథం.
 
మార్కోపోలో: ‘ది ట్రావెల్స్’ అనే గ్రంథాన్ని రాశారు.
‘పయనీర్ అమాంగ్ ట్రావెలర్స్’ అని ఈయనకు పేరు.
 మోటుపల్లి ఓడరేవు ప్రత్యేకతను వివరించారు.
 
హుయాన్‌త్సాంగ్: వేంగీ చాళుక్య రాజ్యాన్ని గురించి తన గ్రంథం ‘సి-యూ-కీ’లో రాశారు
ఈయన వేంగి రాజు కుబ్జ విష్ణువర్థునునికి సమకాలీనుడు
 
ఇత్సింగ్: క్రీ.శ. 7వ శతాబ్ధంలో భారత్ వచ్చాడు. నాగార్జున కొండలో ‘స్ఫుహ్రుల్లేఖ’ గ్రంథాన్ని విద్యార్థులు వల్లెవేస్తూండేవారు అని రాశారు
 
ఎ.రామమూర్తి: ‘కలియుగార్జున’ అనే బిరుదు పొందారు
 
హెచ్.ఎం.రెడ్డి: తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్తప్రహ్లాద’కు దర్శకత్వం వహించారు
‘భక్తప్రహ్లాద’ను 1931 సంవత్సరంలో నిర్మించారు. 
 
గూడవల్లి రామబ్రహ్మం: ‘మాలపిల’్ల, ‘రైతుబిడ్డ’ లాంటి చిత్రాలను నిర్మించారు. 
ఈయన ‘సారథి ఫిలిమ్స్’ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. 
 
భానుమతీ రామకృష్ణ: గొప్ప విదుషీ మణి.
  సినీ నటి, గాయని, నిర్మాత, దర్శకురాలు
  అత్తగారి కథలు, హాస్య కథలు రాశారు.
 
 బాపు: ఈయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీ నారాయణ
  చిత్రకారుడు, సినీ దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి
  ఈయన కార్టూన్‌‌స ద్వారా ప్రాచుర్యాన్ని పొందారు.
  బాపు-రమణతో కలిసి సినీ లోకాన్ని ఏలారు.
 
 జిడ్డు కృష్ణమూర్తి: ఈయన ప్రముఖ తత్వవేత్త
  ‘ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్’ అనే గొప్ప గ్రంథాన్ని రాశారు.
  ప్రాకృతిక విద్యా తత్వవేత్త.
  రుషి వ్యాలీ పాఠశాలను స్థాపించారు.
 
 యోగి వేమన: కడప జిల్లావాసి
  వేమన శతకం రాశారు.
  మూఢ నమ్మకాలను రూపుమాపడానికి ప్రయత్నించారు.
  ఆటవెలది ఛందస్సులో పద్యాలను రాశారు.
 
 షేక్ నాజర్:
బుర్రకథా పితామహుడు
  కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తి
  నిజాం ఆంధ్ర మహాసభల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యపరిచారు.
 
 కోడి రామమూర్తి: ఇండియన్ హెర్క్యూలస్, అపరభీముడు బిరుదాంకితుడు.
  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం వాసి.
  బాల గంగాధర తిలక్ ఈయనకు మల్ల మార్తాండ అనే బిరుదు ఇచ్చారు.
  లార్డ్ మింటో (వైశ్రాయి) ప్రశంసలందుకొన్నారు.
 
 సర్ ఆర్థర్ కాటన్: ఆంగ్లేయుడు
  ధవళేశ్వరం ఆనకట్ట, కృష్ణా నదికి ఆనకట్టలు నిర్మించారు.
  ఈయనకు ధవళేశ్వర ఆనకట్ట నిర్మాణంలో సహకరించింది వీసం వీరన్న

Government Jobs: ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ఇవే.. ఈ నిబంధనలు తొలగింపు
 
 పింగళి వెంకయ్య: త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా రూపొందించారు.
  ఈ పతాక రూపకల్పన 1921 విజయవాడ ఐఎన్‌సీ ప్రత్యేక సమావేశంలో జరిగింది.
 
 సి.పి.బ్రౌన్: తెలుగు భాషాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారు.
  కడపలో ఈయన స్మారక గ్రంథాలయం ఉంది.
  తెలుగు-ఇంగ్లీష్, ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీలు రూపొందించారు.
  వేమన పద్యాలను ఆంగ్లీకరించారు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని తెలుగును కీర్తించారు.
 
 త్యాగయ్య: తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు.
  తమిళనాడులో తంజావూరులో స్థిరపడ్డారు.
  త్యాగరాజ కృతులు ప్రవచించారు.
  ‘ఎందరో మహానుభావులు...’ కృతి ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.
 
 వేటూరి ప్రభాకర శాస్త్రి: ‘నాగబు’ అనే పదం తొలి తెలుగు పదం అని తెలియజేశారు.
 అమరావతి శాసనాన్ని పరిశోధించారు.
 
 అగస్త్యుడు: ఆర్య సంస్కృతిని దక్షిణాదికి వ్యాప్తిచేశారు.
  ఈయన భార్య లోపాముద్ర
  ఈయనను ‘ప్రాచీన కాలపు వాస్కోడిగామా’ అంటారు.
 
 విశ్వామిత్రుడు: యజ్ఞ పశువుగా తీసుకువెళ్తున్న పునశ్శేనుడిని దత్త కుమారునిగా స్వీకరించారు.
  దత్తత నిరాకరించిన తన సొంత కుమారులను మూతిబ, పుళింద జాతులతో కలిసిపొమ్మని శపించాడు.
  ఈయన శపించిన కుమారులు దక్షిణాదికి వచ్చి స్థిరపడ్డారు.

Success Story: ఒకే సంవత్సరంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా.. కానీ చివ‌రికి
 
 చిలుకూరి వీరభద్రరావు: ‘ఆంధ్రుల చరిత్ర’ అనే గ్రంథాన్ని రాశారు.
 
 ఎల్లాప్రగడ సుబ్బారావు: భీమవరం వాసి
  వైద్య శాస్త్రానికి చెందినవారు.
  టెట్రాసైక్లిన్ (ఆరియోమైసిన్)ను కనుగొన్నాడు.
  టైఫాయిడ్, బోదకాలు, పాండు రోగం మొదలగు వ్యాధులకు పూర్తి నిర్మూలన కోసం కృషి చేశారు.
 
 విశ్వనాథ సత్యన్నారాయణ: జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు కవి (1970)
  ‘శ్రీ మద్ రామాయణ కల్పవృక్షం’ రాశారు.
  వేయి పడగలు రాశారు.
 
 సి.వై.చింతామణి: చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి
  విజయనగరం వాసి
  లిబరల్ పార్టీ తరపున లండన్ వెళ్లి ‘రౌండ్ టేబుల్ సమావేశం’లో పాల్గొన్నారు.
  ఈయన ప్రముఖ జర్నలిస్ట్
  ‘లీడర్’ అనే పత్రికలో గొప్ప వ్యాసాలు రాశారు.
 
 కట్టమంచిరామలింగారెడ్డి
: సి.ఆర్. రెడ్డిగా సుపరిచితులు
  ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సులర్
  ‘ముసలమ్మ మరణం’, ‘కవిత్వ తత్వ విచారం’ అనే గ్రంథాలను రాశారు.

Economy: వివిధ దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు త‌క్కువ‌గా ఉండ‌టానికి కార‌ణాలు ఏమిటి..?
 
 గిడుగు రామమూర్తి: వ్యవహారిక భాషోద్యమ పిత
  ‘తెలుగు’ మాసపత్రికను నడిపారు.
  ‘సవర-ఇంగ్లిష్’, ‘ఇంగ్లిష్- సవర’ నిఘంటువును రూపొందించారు.
  ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదును బ్రిటిష్ వారి నుంచి పొందారు.
 
 కరణం మల్లీశ్వరి: శ్రీకాకుళం జిల్లావాసి
  ఒలంపిక్స్ కాంస్య పతకాన్ని 2000 సంవత్సరం సిడ్నీలో 69 కేజీల విభాగంలో సాధించింది.
 
పి.ఆనందాచార్యులు: భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వ హించిన తొలి తెలుగువాడు.
1891 నాగ్‌పూర్ ఐఎన్‌సీకి అధ్యక్షత వహించారు.
 
టంగటూరిసూర్యకుమారి: రాజమండ్రిలో జన్మించారు.
మిస్ మద్రాస్ (1952)గా గెలుపొందారు.
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాడటంతో కీర్తిగాంచారు.
 
యల్లా వెంకటేశ్వరరావు: మృదంగం వాయిద్యం ద్వారా గిన్నీస్ బుక్‌లో కూడా చోటు సంపాదించిన మేథావి.
 
సుబ్బారావు పాణిగ్రాహి: జముకుల కథ చెప్పడంలో దిట్ట
‘ఓ అరుణ పతాకమా....చేగొనుమా రెడ్ శెల్యూట్’ గీతం రాసి కీర్తి పొందారు.
కమ్యూనిస్ట్ భావాలు వ్యాప్తిచేస్తూ అతి పిన్న వయసులో ‘ఎండమావులు’, ‘రిక్షావాలా’, ‘విముక్తి’ నాటికలు రాశారు.

DSP Yegireddi Prasad Rao : ఆయ‌న కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..
 
 కొంగరజగ్గయ్య: ‘కళావాచస్పతి’ బిరుదాంకితుడు
  లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడు ఈయనే కావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. (1967 ఎన్నికలు, ఒంగోలు నియోజక వర్గం నుంచి గెలిచాడు).
  రవీంద్రనాధ్ ఠాగూర్ ‘సాక్రిపైస్’ను ‘బలిదానం’గా రాశారు.
  ‘రవీంద్ర గీత’ అనే గ్రంథాన్ని రాశారు. ఇది రవీంద్ర నాథ్ ఠాగూర్ గీతాంజలికి తొలి అనువాద తెలుగు గ్రంథం.
 
 వెంపటి సత్యం: కృష్ణా జిల్లా కూచిపూడి వాసి. కూచిపూడి నాట్యంలో దిట్ట.
  కిరాతార్జునీయం, హరవిలాసం నృత్య రూపకాలను రూపొందించారు.
 
 బలిజేపల్లి లక్ష్మీకాంతం: గుంటూరు జిల్లావాసి
  ‘సత్యహరిశ్చంద్ర’ నాటకాన్ని రాశారు.
  ‘...దేవీ కష్టములెట్లుండినను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడు...’ పద్యాలతో కీర్తి పొందారు.
  నాటక రంగ రచనకు వన్నె తెచ్చారు.
 
 కాళ్ళకూరి నారాయణరావు: ‘వరవిక్రయం’ ‘చింతామణి’ నాటకాలను రాశారు.
  నాటక రంగం ద్వారా సమాజ రుగ్మతలను రూపుమాపే ప్రయత్నం చేశారు.
 
 కొలకలూరి ఇనాక్: గుంటూరు జిల్లావాసి. మునివాహనుడు (నాటకం)
  తలలేనోడు, ఊరబావి రచనలు రాశారు.
  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్‌గా పనిచేశారు.
  ‘విమర్శిని’ అనే గ్రంథాన్ని రాశారు.

APPSC & TSPSC : గ్రూప్ - 1&2లో ఉద్యోగం సాధించడం ఎలా?

 జాలాది: జాలాది రాజారావు ప్రముఖ కవి, సినీ రచయిత
  ‘పుణ్యభూమి నా దేశం నమో నమావి’ అనే పాట మేజర్ చంద్రకాంత్ సినిమాకు రాసి శాశ్వత కీర్తి పొందారు.
  దేశభక్తి, తాత్విక గీతాల రాయడంలో దిట్ట.
 
 తల్లాప్రగడ సుబ్బారావు: దివ్యజ్ఞాన సమాజ ఉద్యమ వ్యాప్తికి కృషిచేశారు
  కల్నల్ ఆల్కాట్‌ను ఆంధ్రకు ఆహ్వానించి సమాజాభివృద్ధికి కృషి చేశారు.
 
 కోదండరామ పంతులు: సర్ ఛార్లెస్ సి.పి. బ్రౌన్‌కు తెలుగు భాషను నేర్పించిన మేథావి.
 
 ఈమని శంకర శాస్త్రి: తూర్పు గోదావరి జిల్లావాసి
  వీణ విద్వాంసులు
  జుగల్‌బందీ చేయడంలో దిట్ట
  ఈయన శిష్యుడే చిట్టిబాబు
 
 స్థానం నరసింహారావు: గుంటూరు జిల్లావాసి
  ‘నటస్థానం’ అనే గ్రంథాన్ని రచించారు
  ప్రముఖ రంగస్థల నటుడు
  పద్మశ్రీ బిరుదును 1956 సంవత్సరంలో పొందారు
  పద్మశ్రీ బహుమతి పొందిన తొలి ఆంధ్రుడు, తొలి కళాకారుడు.

గ్రూప్స్ పరీక్షల కోసం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధం కావాలి?
 
మాదిరి ప్రశ్నలు :

Published date : 17 Feb 2022 12:38PM

Photo Stories