Social Methodology Bit Bank: టెట్/డీఎస్సీ- ప్రత్యేకం సోషల్ మెథడాలజీ TOP 30 Bits
1. ‘ఒక పరిశోధకుడు ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వారిలో నైతిక విలువలు ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ ఉన్న వారిలో నైతిక విలువలు తక్కువ అని పేర్కొన్నాడు’ పై పరిశోధనలో ప్రజ్ఞ?
ఎ) స్వతంత్ర చరాన్ని ప్రభావితం చేసే మధ్యస్థ చరం
బి) పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం
సి) మధ్యస్థ చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం
డి) పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే మధ్యస్థ చరం
- View Answer
- Answer: బి
2. బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడు?
ఎ) సంవేదన చాలక దశ
బి) పూర్వ ప్రచాలక దశ
సి) మూర్త ప్రచాలక దశ
డి) నియత ప్రచాలక దశ
- View Answer
- Answer: డి
3. ఒక ఉపాధ్యాయుడు ముందు లేఖనం తర్వాత పఠనం తర్వాత భాషణం ఆ తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం?
ఎ) వికాసం క్రమానుగతమైంది
బి) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు దారితీస్తుంది
సి) వికాసం సంచితమైంది
డి) వికాసం ఏకీకృత మొత్తం
- View Answer
- Answer: ఎ
4. రాము బొమ్మలకు స్నానం చేయిస్తాడు. ఆ బొమ్మకు సీసాతో పాలు తాగిస్తాడు. జోలపాడి నిద్రపుచ్చుతాడు. రాము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు?
ఎ) జ్ఞానేంద్రియ చాలక దశ
బి) పూర్వ ప్రచాలక దశ
సి) మూర్త ప్రచాలక దశ
డి) అమూర్త ప్రచాలక దశ
- View Answer
- Answer: బి
5. రాజు ఒక సగటు విద్యార్థి. తాను పాఠశాల్లో బంగారు పతకం సాధించుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. రాజు దశ?
ఎ) శైవ దశ
బి) బాల్య దశ
సి) కౌమార దశ
డి) వయోజన దశ
- View Answer
- Answer: సి
6. కింది వాటిలో శాబ్ది కేతర సామూహిక పరీక్ష?
ఎ) బీనేసైమన్ పరీక్ష
బి) ఆర్మీ అల్ఫా పరీక్ష
సి) ఆర్మీ బీటా పరీక్ష
డి) బాలియా నిష్పాదన పరీక్ష
- View Answer
- Answer: సి
7. కింది వాటిలో అంతర వ్యక్తిగత విభేదాలను సూచించేది?
ఎ) రాజు శారీరకంగా బలవంతుడు, ఉద్వేగంగా అస్థిరుడు
బి) రాజు స్నేహితులకంటే వ్యవహారిక దక్షత గలవాడు
సి) రాజు చదవడం, రాయడం రెండూ ఇష్టపడతాడు
డి) రాజు గణితం కంటే, సాంఘిక శాస్త్రాన్ని ఇష్టపడతాడు
- View Answer
- Answer: బి
8. మానసిక ఆరోగ్యం ఉండే ఉపాధ్యా యుడిలో ఉండని లక్షణం?
ఎ) విషయ యోజనం
బి) ఉద్వేగ స్థిరత్వం
సి) సర్దుబాటు తత్వం
డి) అనుకూల దృక్పథం
- View Answer
- Answer: ఎ
9. ప్రతిభావంతుడికి అనుసరించవలసిన పద్ధతి?
ఎ) అంతఃపరీక్ష
బి) కేస్ స్టడీ
సి) పరిశీలనా పద్ధతి
డి) ప్రయోగ పద్ధతి
- View Answer
- Answer: బి
10. ఏ రకమైన రక్షక తంత్రంలో వ్యక్తి తన కంట్లో దూలము నుంచి ఎదుటి వ్యక్తి కంట్లో నలుసును ఎత్తి చూపుతాడు?
ఎ) హేతుకి కారణం
బి) విస్థాపనం
సి) ప్రక్షేపణం
డి) ప్రతిగమనం
- View Answer
- Answer: సి
11 రాజు కంప్యూటర్ కోర్సులో చేరి విజయ వంతంగా పూర్తి చేశాడు. కోర్సు సమయంలో అతని నిష్పాదనలో ఎన్నో మార్పులు జరిగాయి. ఈ నిష్పాదనను గ్రాఫ్ రూపంలో చూపించే అభ్యసన రేఖ?
ఎ) పుటాకార వక్ర రేఖ
బి) కుంభాకార వక్ర రేఖ
సి) లాక్షణిక అభ్యసన రేఖ
డి) అవరోహణ వక్ర రేఖ
- View Answer
- Answer: సి
12. థారన్‌డైక్ ప్రాథమిక నియమాల ప్రకారం కింది అంశాల్లో ముఖ్యమైంది?
ఎ) అవధానం కొనసాగేలా ప్రశ్నలు వేయడం
బి) అభ్యసన ప్రక్రియలో ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండడం
సి) అభ్యసనాంశంపై మౌఖికంగా ప్రశ్నలు అడగడం
డి) చదివే అలవాటును పెంపొందించడం
- View Answer
- Answer: బి
13. వాట్సన్ ప్రయోగంలో అల్బర్డ్ అనే బాలుడు పునర్భలనం (ఊచశబ్దం) చెందిన ఎలుకకు మాత్రమే స్పందించి తెల్లని కుక్కపిల్లకు, పక్షి ఈకకు ప్రతిస్పందించక పోవడం ఏ నియమం?
ఎ) ఉద్దీపన సామాన్యీకరణం
బి) ఉద్దీపన విచక్షణ
సి) ఉన్నత స్థాయి నిబంధనం
డి) విలుప్తీకరణం
- View Answer
- Answer: బి
14. పెన్ అనే పదానికి పెన్స్ అని నేర్చుకున్న విద్యార్థి బుక్ అనే పదానికి బుక్స్ అని రాయడం ఏ రకమైన బదలాయింపు?
ఎ) అనుకూల బదలాయింపు
బి) ప్రతికూల బదలాయింపు
సి) శూన్య బదలాయింపు
డి) ద్విపార్శ్వ బదలాయింపు
- View Answer
- Answer: ఎ
15. రాజు తరగతిలో తెలివైన విద్యార్థి. కానీ రాజుకు స్టేజ్‌ఫియర్ ఎక్కువ ఈ బలహీనతను తగ్గించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే నియమం?
ఎ) పునర్భలన నియమం
బి) ఆయత్న సిద్ధస్వాస్థ్యం
సి) విరమణ నియమం
డి) విచక్షణా నియమం
- View Answer
- Answer: సి
16. బహిర్గత ప్రేరణకు సంబంధించనిది?
ఎ) గుంజీలు తీయించడం
బి) పొగడ్త
సి) దండన
డి) అభిరుచి
- View Answer
- Answer: డి
17. ఆహా నేను కనుగొన్నాను అని అభ్యాసకుడు ఏ సిద్ధాంతం ఆధారంగా అభ్యసిస్తాడు?
ఎ) యత్నదోష అభ్యసనం
బి) కార్య సాధక నిబంధనం
సి) శాస్త్రీయ నిబంధనం
డి) అంతర్ దృష్టి అభ్యసనం
- View Answer
- Answer: డి
18. కింది వాటిలో సంకల్పిత అవధానం?
ఎ) కదిలే సర్కస్ లైట్ చూడడం
బి) బడిగంట మోగగానే చూడడం
సి) ఉపాధ్యాయుడు బోధించే పాఠం వినడం
డి) అలారం మోగిన వెంటనే చూడడం
- View Answer
- Answer: సి
19. హైస్కూల్ విద్యార్థి క్రికెట్లో ప్రతిభ చూపడం, కంప్యూటర్లో కూడా ప్రతిభ చూపడం ఏ రకమైన అభ్యసన బదలాయింపు?
ఎ) శూన్య బదలాయింపు
బి) అనుకూల బదలాయింపు
సి) ప్రతికూల బదలాయింపు
డి) ద్విపార్శ్వ బదలాయింపు
- View Answer
- Answer: ఎ
20. Zok,Tux ఒక?
ఎ) అర్థసహిత పదాలు
బి) అర్థరహిత పదాలు
సి) ద్వంద్వ సంసర్గాలు
డి) కొండ గుర్తులు
- View Answer
- Answer: బి
21. కింది వాటిలో లోపం – వైకల్యతకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తిం చండి?
ఎ) లోపం కృత్యం చేసేటప్పుడు కనిపిస్తుంది, వైకల్యత కృత్యం చేయడంలో అశక్తత
బి) లోపం అవయవాలకు సంబంధించి, వైకల్యత కృత్యం చేయడంలో అశక్తత
సి) లోపం ఉన్న పిల్లలందరూ, వైకల్యత కలిగి ఉంటారు
డి) వైకల్యత కలిగిన పిల్లలందరిలో తప్పని సరిగా లోపం కలిగి ఉండాలని లేదు
- View Answer
- Answer: బి
22. కింది వాటిలో అభ్యసన వైకల్యతకు సంబంధించి పఠన వైకల్యానికి సంబంధించినది?
ఎ) డిస్ గ్రాఫియా
బి) డిస్ లెక్సియా
సి) డిస్ ఫేసియా
డి) డిస్ కాల్యులియా
- View Answer
- Answer: బి
23. ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య విలువలను ఏ రకమైన నాయకత్వంలో పెంపొందిస్తాడు?
ఎ) నిర్దేశిత నాయకత్వం
బి) అనుజ్ఞ నాయకత్వం
సి) సహభాగి నాయకత్వం
డి) సాధనోన్ముఖ నాయకత్వం
- View Answer
- Answer: సి
24. 302ను 32 అని చదివే గణితపరమైన అసామర్థ్యం?
ఎ) డిస్ ఫేసియా
బి) డిస్ కాల్కులియా
సి) డిస్ గ్రాఫియా
డి) డిస్ లెక్సియా
- View Answer
- Answer: సి
25. ప్రాజెక్ట్ పద్ధతిలో చివరి సోపానం?
ఎ) ప్రాజెక్ట్ మూల్యాంకనం చేయడం
బి) ప్రాజెక్ట్ నివేదించడం
సి) ప్రాజెక్ట్ లక్ష్యాలు పరిశీలించడం
డి) కార్యకలాపాలు సమీక్షించడం
- View Answer
- Answer: బి
26. బ్లూప్రింట్ పరిధిలోలేని అంశం?
ఎ) విలువ
బి) లక్ష్యం
సి) ప్రశ్నలు
డి) విషయం
- View Answer
- Answer: ఎ
27. హెర్బర్ట్ రూపోందించిన బోధనా ప్రణాళి కలో వరుస క్రమం?
ఎ) సన్నాహం – సంసర్గం – ప్రదర్శనం – సాధారణీకరణం – అన్వయం – సింహావలోకనం
బి) సన్నాహం – ప్రదర్శనం – సాధార ణీకరం – సంసర్గం – అన్వయం – సింహావలోకనం
సి) సన్నాహం – ప్రదర్శనం – సంసర్గం – సాధారణీకరణం – అన్వయం – సింహావలోకనం
డి) సన్నాహం – ప్రదర్శనం – సాధారణీక రణం – అన్వయం – సంసర్గం – సింహావలోకనం
- View Answer
- Answer: సి
28. ప్రణాళిక బోధన పరిపుష్టి తర్వాత సూక్ష్మ బోధనా వలయంలో వచ్చే సోపానం?
ఎ) పునఃబోధన
బి) పునఃపరిపుష్టి
సి) పునఃప్రణాళిక
డి) సమీక్ష
- View Answer
- Answer: సి
29. అకస్మాత్తుగా జరిగే సంఘటనలు ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసి వ్యక్తి ప్రవర్తనను అంచనావేసే రికార్డు?
ఎ) కేస్‌స్టడీ రికార్డ్
బి) క్యుములేటివ్ రికార్డ్
సి) ఎనక్డోటల్ రికార్డ్
డి) ప్రాజెక్ట్ రికార్డ్
- View Answer
- Answer: సి
30. బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రధానంగా?
ఎ) జ్ఞానం–పునఃస్మరణకు సంబంధించింది
బి) జ్ఞానం గుర్తించడానికి సంబంధించింది
సి) అవగాహన–వర్గీకరణకు సంబంధించింది
డి) వినియోగం – ఊహించడానికి సంబంధించింది
- View Answer
- Answer: బి
Tags
- TET DSC Social Methodology Telugu Bitbank
- Social Studies MCQ Quiz
- Social Studies Quiz
- social studies quiz questions and answers
- social studies quiz in sakshi education
- DSC exams Bitbank
- Latest Bitbank
- TET Latest Bitbank in telugu
- DSC Latest Bitbank
- competitive exams Latest Bitbank
- Trending Quiz in Telugu
- TET Exam Bitbank in telugu
- competitive exams bitbank
- competitive exams bitbanks
- Social Methodology bitbanks
- competitive exams Quiz
- TET competitive Exam Quiz
- questions and answers
- Bitbank
- Social Methodology quiz in sakshi education
- Social Methodology Bitbank questions and answers
- Social Methodology Bit Bank syllabus and Preparation
- Social bits in Telugu