APPSC & TSPSC : గ్రూప్ - 1&2లో ఉద్యోగం సాధించడం ఎలా?
గ్రూప్ 1 & 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లు ఏ బుక్ పడితే ఆ బుక్ చదవకూడదు. స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవాలి. అది వారిని విజయానికి చేరువ చేస్తుంది.
చవకబారు పుస్తకాలు చదవడం మానేయాలి..
ఎప్పటి నుంచో గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతూ 5, 10 మార్కులతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పొవడానికి ప్రధాన కారణం.. వారు చదివిన చవకబారు పుస్తకాలు, గైడ్స్. ముందు వాటిని చదవడం మానేయాలి.. వాటికి బదులు తెలుగు యూనివర్సిటీ చెందిన తెలుగు అకాడమీ, లేదా క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ రాసిన పుస్తకాలు చదవాలి. అంతే కానీ కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో పనిచేస్తూ ఆ అనుభవంతో రాసిన బుక్స్‌ని చదవకూడదు. చాలా మంది ఇలా చేయడం వల్లే విజయానికి దూరమయ్యారు. కాబట్టి స్టాండర్డ్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే అభ్యర్థికి ఏది చదవాలో కాదు.. ఏది బుక్ చదవకూడదో తెలియాలి. హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ ఇంటర్ పుస్తకాలు మొదట చదవండి. ఆ తర్వాత డిగ్రీ పుస్తకాలు చదవండి. ఒకవేళ ఇంట ర్‌పై అవగాహన ఉన్నట్లైతే డిగ్రీ పుస్తకాలు చదివిన సరిపోతుంది.
గ్రూప్స్.. బంగారు గని భూగోళ శాస్త్రం
కరెంట్ అఫైర్స్ కోసం..
కరెంట్ అఫైర్స్ కోసం రోజూ న్యూస్‌పేపరు కచ్చితంగా చదివి మీకు రిలేటేడ్‌గా ఉన్న అంశాలను నోట్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఇండియా రేడియో వాళ్లు రోజూ న్యూస్ బ్రాడ్ కాస్ట్ చేస్తుంటారు. అది విని అవసరమైన పాయింట్స్‌ని నోట్ చేసుకోవాలి. రాజ్యసభ టీవీలోనూ ఉపయుక్తమయ్యే వార్తలు వస్తుంటాయి. కోచింగ్ వెళ్లేముందే కనీసం బేసిక్స్ నేర్చుకోండి. ప్రతి సబ్జెక్టుకు ఎక్కువ పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివితే.. ఏ పాయింట్ ముఖ్యం, ఏదికాదో తెలుస్తుంది.
పటిష్ట వ్యూహంతో పక్కా ఫలితం
ప్రివియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి..
ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్చదవడం వల్ల పరీక్ష విధానం తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. 1996 నుంచి 2014 వరకు పరీక్ష విధానంలో చాలా మార్పులు జరిగాయి. స్టేట్ పునర్విభజన జరిగిన తర్వాత పశ్నాపత్రంలో స్టాండర్డ్ బాగా పెరిగింది. కాబట్టి 2014 తర్వాత జరిగిన పరీక్ష ప్రశ్నాపత్రాలు చదవాలి. సాధారణంగా ఆటల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వారు ఎక్కువ రాణిస్తారని తెలిసిన విషయమే. కాబట్టి ప్రిపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఎగ్జామ్ రాసే వరకు కనీసం 400 నుంచి 500 విషయాలను ప్రాక్టీస్ చేయగలిగితే విజయానికి చేరువవుతాం.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట
ఎలాంటి కోచింగ్ సెంటర్ ఎంచుకోవాలి..
స్టాండర్డ్ ఫ్యాకల్టీ, స్టాండర్డ్టెక్ట్ బుక్స్ రిఫర్ చేసి, మంచి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెట్టే ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే మంచిది. ఎందుకంటే సివిల్స్, గ్రూప్స్‌లో ఉద్యోగం కొట్టిన వాళ్లలో ఎంతో మంది ఓపెన్ యూనివర్సిటీలో చదివినవారుఉండగా, మంచి కాలేజ్‌లో చదివి కనీసం ప్రిలిమ్స్ కూడా దాటని వారూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నదాంట్లో కాకుండా, స్టూడెంట్స్ తక్కువగా ఉండి మీకేదైనా సందేహం వస్తే తీర్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి.