Telangana Geography Bit Bank in Telugu: మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
నదీ వ్యవస్థ
1. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు జీవనదులు
2) తెలంగాణ రాష్ట్రంలో పొడవైన నది గోదావరి
3) నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, మానేరు అనే మూడు నదులు కలుస్తున్నాయి.
4) గోదావరి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తుంది.
- View Answer
- సమాధానం: 2
2. గోదావరి నది తెలంగాణలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది?
1) కాళేశ్వరం
2) భద్రాచలం
3) ఇచ్చంపల్లి
4) కందకుర్తి
- View Answer
- సమాధానం: 4
3. ఏ నదుల కలయిక వల్ల ప్రాణహిత నది ఏర్పడుతుంది?
1) పెన్‌గంగ, ప్రవర, మూల
2) వైన్‌గంగ, వార్థా, ప్రవర
3) వార్థా, పెన్‌గంగ, వైన్‌గంగా
4) వార్థా, పెన్‌గంగా, మానేరు
- View Answer
- సమాధానం: 3
4. ప్రాణహిత నది ఏ రెండు రాష్ట్రాలను వేరు చేస్తుంది?
1) తెలంగాణ, మహారాష్ట్ర
2) తెలంగాణ, ఛత్తీస్‌గఢ్
3) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana History Bitbank in Telugu: నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
5. కింది వాటిని జతపరచండి?
జాబితా-1(నదులు)
ఎ) మంజీరా నది
బి) మానేరు నది
సి) తుంగభద్ర
డి) మూసీ నది
జాబితా - 2 (జన్మస్థానాలు)
i) అనంతగిరి కొండలు
ii) వరాహపర్వతాలు
iii) సిరిసిల్ల కొండలు
iv) బాలాఘాట్ కొండలు
1) ఎ-iii, బి-iv, సి-ii, డి-i
2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
3) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
4) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో సరికానిది ఏది?
1) గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్-నిజమాబాద్ జిల్లాలను వేరుచేస్తుంది.
2) అలాగే ఈ నది మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరుచేస్తుంది
3) గోదావరి నది పాపికొండల వద్ద బైసన్ గార్జ్‌ను ఏర్పరుస్తుంది
4) గోదావరి నది బాసర వద్ద ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ప్రవహించడం వల్ల దీనిని దక్షిణ వాహిని అని పిలుస్తారు.
- View Answer
- సమాధానం: 4
7. కాళేశ్వరం వద్ద ఏయే నదులు కలుస్తున్నాయి?
1) గోదావరి, ప్రాణహిత, హరిద్ర
2) గోదావరి, ప్రాణహిత, చంద్రావతి
3) గోదావరి, ప్రాణహిత, సరస్వతి
4) గోదావరి, ప్రాణహిత, మానేరు
- View Answer
- సమాధానం: 3
8. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ఏ నదులు కలుస్తున్నాయి?
1) మంజీరా, హరిద్ర, మానేరు
2) గోదావరి, మానేరు, ప్రవర
3) మంజీరా, మానేరు, కిన్నెరసాని
4) గోదావరి, మంజీరా, హరిద్ర
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిని జతపరచండి?
జాబితా-1(నదులు)
ఎ) గోదావరి
బి) కృష్ణా
సి) శబరి
డి) డిండి నది
జాబితా - 2 (జన్మస్థానాలు)
i) మహాబలేశ్వరం
ii) త్రయంబకేశ్వరం
iii) షాబాద్ గుట్టలు
iv) సింకారం కొండలు
1) ఎ-iv, బి-i, సి-ii, డి-iii
2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
3) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
4) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana Economy Important Bits: తెలంగాణ రాష్ట్రం రైతుబంధు పథకమును ఎప్పటి నుండి ప్రవేశపెట్టింది?
10. కడెం నదిపై లేని జలపాతం ఏది?
1) చిత్రకూట్
2) గాయత్రి
3) పొచ్చెర
4) కుంతల
- View Answer
- సమాధానం: 1
11. గోదావరి నది తెలంగాణలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తోంది? (జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం)
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 3
12. కిందివాటిలో గోదావరి నది ప్రవహించే జిల్లాలు ఏవి (పునర్విభజన జిల్లాల ప్రకారం)?
ఎ) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్
బి) నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్
సి) జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది?
1) ప్రవర
2) వార్థ
3) పూర్ణ
4) మున్నేరు
- View Answer
- సమాధానం: 4
14. హరిద్ర నది ఏ జిల్లాలో జన్మిస్తుంది?
1) నిజామాబాద్
2) సంగారెడ్డి
3) కామారెడ్డి
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
చదవండి: Indian History Bitbank: సూఫీ గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు?
15. కడెం నది ఏయే జిల్లాల్లో ప్రవహిస్తుంది?
1) ఆదిలాబాద్, ఆసిఫాబాద్
2) ఆసిఫాబాద్, నిర్మల్
3) ఆదిలాబాద్, నిర్మల్
4) ఆసిఫాబాద్, మంచిర్యాల
- View Answer
- సమాధానం: 3
16. కుందాయి జలపాతం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్‌నగర్
3) భూపాలపల్లి
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో సరికానిది ఏది?
1) బోదర జలపాతం- ఆసిఫాబాద్ జిల్లా
2) గాయత్రి జలపాతం- ఆదిలాబాద్ జిల్లా
3) కుంటాల జలపాతం- నిర్మల్ జిల్లా
4) బొగత జలపాతం- ములుగు జిల్లా
- View Answer
- సమాధానం: 3
18. ప్రాణ హిత నది సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?
1) 713
2) 113
3) 613
4) 513
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో çసరికానిది ఏది?
1) శబరినది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో జన్మిస్తుంది.
2) దీనికి ఉన్న ఉపనది సీలేరు
3) దీన్ని కొలాబ్ నది అని కూడా పిలుస్తారు
4) దీని పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహరాష్ట్రలో విస్తరించి ఉంది.
- View Answer
- సమాధానం: 4
20. చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
1) ప్రాణహిత
2) గోదావరి
3) కృష్ణానది
4) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది?
1) కోయనా
2) శబరి
3) మంజీర
4) కిన్నెరసాని
- View Answer
- సమాధానం: 1
22. కిందివాటిలో సరికానిది ఏది?
1) తుంగభద్ర నది పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలో జన్మిస్తుంది.
2) ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది
3) ఇది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది
4) దీని ఉపనదులు వేదవతి, కుముద్వతి, వరద, హంద్రీ
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో సరికానిది ఏది?
1) కృష్ణానది మహరాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో జన్మిస్తుంది.
2) ఇది దక్షిణ భారతదేశంలో మూడో అతి పెద్ద నది
3) ఇది మçహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆం్ర«ధప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది.
4) ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
- View Answer
- సమాధానం: 2
24. కృష్ణాన ది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది?
1) పులిగడ్డ
2) దివిసీమ
3) హంసలదీవి
4) కోనసీమ
- View Answer
- సమాధానం: 3
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
25. కిందివాటిలో కృష్ణానదికి సంబంధించి సరైంది ఏది?
ఎ) భీమా, దిండి, మూసీ, పాలేరు, కోయనా
బి) పంచగంగ, దూద్గంగ, తుంగభద్ర, మలప్రభ
సి) మున్నేరు,ఘటప్రభ, హాలియా, పెద్దవాగు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
26. మూసీనది ఏ ప్రదేశం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది?
1) శివారెడ్డి పేట
2) వాడపల్లి
3) ఏలూరు
4) దేవరకొండ
- View Answer
- సమాధానం: 2
27. తుంగభద్ర నది మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
1) మహబూబ్‌నగర్
2) నల్గొండ
3) సూర్యాపేట
4) జోగులాంబ గద్వాల
- View Answer
- సమాధానం: 4
28. కృష్ణానది పరీవాహక ప్రాంతం మనరాష్ట్రంలో ఎక్కడ విస్తరించి ఉంది?
ఎ) మహబూబ్‌నగర్, వనపర్తి, నల్గొండ
బి) జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, సూర్యాపేట
సి) వికారాబాద్, భువనగిరి, ఖమ్మం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
29. మూసీ నదికి ఉన్న ఉపనది ఏది?
1) సకలవాణి
2) ఈసా
3) ఆలేరు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. వైరా, కట్లేర్లు నదులు ఏ నదికి ఉపనదులు?
1) డిండి
2) పాలేరు
3) మున్నేరు
4) మూసీ
- View Answer
- సమాధానం: 3
31. పాలేరు నది తెలంగాణలో ఏయే జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది?
ఎ) జనగామ, వరంగల్ అర్బన్, భూపాలపల్లి
బి) జనగామ, మహబూబాబాద్, ఖమ్మం
సి) ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) బి, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో ఏ నది షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది?
1) డిండి
2) పాలేరు
3) మూసీ
4) భీమా
- View Answer
- సమాధానం: 1
చదవండి: Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది?
33. డిండి నది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది?
1) జగ్గయ్యపేట
2) ఏలేశ్వరం
3) ఏలూరు
4) సూర్యాపేట
- View Answer
- సమాధానం: 2
34. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
1) మూసీ
2) పాలేరు
3) డిండి
4) భీమా
- View Answer
- సమాధానం: 3
35. కింది వాటిలో సరికానిది ఏది?
1) మూసీనదికి ఉన్న మరోపేరు ముచుకుంద నది
2) హిమాయత్‌సాగర్‌ను 1927లో సకలవాణి నదిపై నిర్మించారు
3) ఉస్మాన్సాగర్ను మూసీ నదిపై నిర్మించారు.
4) మూసీనది వికారాబాద్ జిల్లాలో జన్మిస్తుంది.
- View Answer
- సమాధానం: 2
36. కృష్ణానది ఉపనదుల్లో పొడవైన న ది?
1) తుంగభద్ర
2) మూసీ
3) భీమా
4) డిండి
- View Answer
- సమాధానం: 3
37. గోదావరినది ఒడ్డున లేని పుణ్యక్షేత్రం?
1) సత్యనారాయణ స్వామి ఆలయం (గూడెంగుట్ట)
2) జ్ఞాన సరస్వతి దేవాలయం (బాసర)
3) రాఘవేంద్ర స్వామి దేవాలయం
4) కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం
- View Answer
- సమాధానం: 3
మాదిరి ప్రశ్నలు
1. కింది వివరణల్లో సరైన దాన్ని తెలపండి?
ఎ) 2016-17లో తెలంగాణలో 3.6 లక్షల హెక్టార్ల అత్యధిక నికర సాగు విస్తీర్ణం నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యింది.
బి) 2016-17లో తెలంగాణలో సుమారు 47.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నికర పంట సాగు విస్తీర్ణం కింద ఉంది.
సి) అలాగే స్థూల పంటసాగు విస్తీర్ణం సుమారు 59.70లక్షల హెక్టార్లుగా ఉంది.
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
2. మన రాష్ట్రంలో 2017-18 ఆర్థిక , సామాజిక సర్వే ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంతశాతం విస్తరించి ఉన్నాయి?
1) 27.04 శాతం
2) 26.90 శాతం
3) 24.07 శాతం
4) 15.63 శాతం
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) 2016-17 సంవత్సరంలో రాష్ట్రం మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో ఆహారపంటల సాగు విస్తీర్ణం 66.4 శాతంగా ఉంది.
బి) మన రాష్ట్రంలో 2010-11 నాటికి సగటు కమత పరిమాణం 1.12 హెక్టార్లు.
సి) 2016-17 సంవత్సరంలో మన రాష్ట్రంలో వాస్తవంగా కురిసిన వర్షపాతం 905.3 మి.మి.లు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
4. 2017-18 సర్వే ప్రకారం మన రాష్ట్రం మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ మూడుపంటల సాగు సుమారు 70 శాతంగా ఉంది?
1) వరి, మొక్కజొన్న, మిర్చి
2) వరి, మిర్చి, పత్తి
3) వరి, పత్తి, మొక్కజొన్న
4) వరి, పత్తి, పసుపు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Chemistry Bit Bank for Competitive Exams: ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
5. కింది వాటిలో సరికానిది ఏది?
1) తెలంగాణ రాష్ట్రం దేశంలో పండ్లసాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉంది
2) మన రాష్ట్రం దేశంలో పసుపు సాగులో 2వ స్థానంలో ఉంది.
3) మన రాష్ట్రంలో అత్యధికంగా మల్బరీ పట్టును సాగు చేస్తున్నారు.
4) మన రాష్ట్రం దేశంలో పండ్ల ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిని జతపరచండి?
జాబితా-1
ఎ) పశుసంపద
బి) పాల ఉత్పత్తి
సి) గుడ్ల ఉత్పత్తి
డి) పందుల సంఖ్య
జాబితా - 2
i) 13వ స్థానం
ii) 10వ స్థానం
iii) 15వ స్థానం
iv) 3వ స్థానం
1) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
2) ఎ-iv, బి-ii, సి-i, డి-iii
3) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
4) ఎ-ii, బి-iv, సి-i, డి-iii
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) ఉత్తర తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం జగిత్యాలలో ఉంది.
బి) దక్షిణ తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం చింతపల్లిలో ఉంది.
సి) మధ్య తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం వరంగల్‌లో ఉంది.
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
8. కింది వాటిని జతపరచండి?
జాబితా-1
ఎ) కోమటిచెరువు
బి) కొలనుపాక జైన దేవాలయం
సి) మల్లెల తీర్థం జలపాతం
డి) కందకుర్తి త్రివేణి సంగమం
జాబితా - 2
i) నిజామాబాద్ జిల్లా
ii) నాగర్ కర్నూల్ జిల్లా
iii) యాదాద్రి భువనగిరి జిల్లా
iv) సిద్ధిపేట జిల్లా
1) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
3) ఎ-iii, బి-iv, సి-ii, డి-i
4) ఎ-iv, బి-ii, సి-iii, డి-i
- View Answer
- సమాధానం: 2