Telangana Economy Important Bits: తెలంగాణ రాష్ట్రం రైతుబంధు పథకమును ఎప్పటి నుండి ప్రవేశపెట్టింది?
1. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్ర జీఎస్వీఏలో వ్యవసాయం–అనుబంధ రంగం 2019–20లో రుణాత్మక వృద్ధిరేటు నమోదు చేసింది.
2) తెలంగాణ రాష్ట్ర సామాజిక–ఆర్థిక ముఖ చిత్రం–2022 ప్రకారం–2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ ప్రస్తుత ధరలలో వ్యవసాయం–అనుబంధ రంగాల వృద్ధిరేటు 9.1 శాతంగా ఉంది.
ఎ) రెండూ సరికావు
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ సరైనవి
- View Answer
- సమాధానం: బి
2. 2015–16నుంచి 2021–22వరకు.. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం–అనుబంధ రంగాల వృద్ధిని సరైన సంవత్సరములతో జతపర్చండి.
సంవత్సరం వృద్దిరేటు(శాతంలో)
1. 2015–16 ఎ. 35.6
2. 2019–20 బి. –0.5
3. 2020–21 సి. 9.1
4. 2021–22 డి. 12.2
ఎ) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
బి) 1–బి, 2–సి, 3–ఎ, 4–డి
సి) 1–బి, 2–ఎ, 3–డి, 4–సి
డి) 1–బి, 2–ఎ, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం: సి
3. తెలంగాణ రాష్ట్రం రైతుబంధు పథకమును ఎప్పటి నుండి ప్రవేశపెట్టింది?
ఎ) 2018–19 వానాకాలం
బి) 2018–19 యాసంగి కాలం
సి) 2019–20 వానా కాలం
డి) 2019–20 యాసంగి కాలం
- View Answer
- సమాధానం: ఎ
4. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ సరఫరా పథకంను రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటి నుండి అమలులోకి లె చ్చారు?
ఎ) 2017 జనవరి 1
బి) 2018 జనవరి 1
సి) 2019 జనవరి1
డి) 2020 జనవరి 1
- View Answer
- సమాధానం: బి
5. నీతి ఆయోగ్ విడుదలచేసిన 2020–21 సుస్థిరాభిద్ధి లక్ష్యాల సూచికలో.. ఏ సూచికలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
ఎ) ఈఎ6
బి) ఈఎ5
సి) ఈఎ10
డి) ఈఎ7
- View Answer
- సమాధానం: డి
6. తెలంగాణ రాష్ట్రం 2018 ఆగస్ట్ 15న మొదటిసారిగా రైతుబీమా పథకంను ఏ జిల్లా లోప్రారంభించింది?
ఎ) నల్గొండ
బి) సిద్దిపేట
సి) రంగారెడ్డి
డి) రాజన్న సిరిసిల్ల
- View Answer
- సమాధానం: డి
7. 2019–పశుగణన ప్రకారం– పశుపోషణలో దేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం
ఎ) పశువుల సంఖ్యలో 7వ స్థానం
బి) గొర్రెల సంఖ్యలో 1వ స్థానం
సి) మాంసంలో 8వ స్థానం
డి) కోడిగుడ్లలో 2వ స్థానం
- View Answer
- సమాధానం: బి
8. తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత?
ఎ) 27,969 చ.కి.మీ
బి) 28,969 చ.కి.మీ
సి) 29,969 చ.కి.మీ
డి) 26,969 చ.కి.మీ
- View Answer
- సమాధానం: డి
9. తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకానికి అనుకూలమైన అన్ని నీటి వనరులలో 100 శాతము గ్రాంట్తో చేపపిల్లల పంపిణీ కార్యక్రమమైన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2019 సెప్టెంబర్ 5
బి) 2017 సెప్టెంబర్ 5
సి) 2018 సెప్టెంబర్ 5
డి) 2016 సెప్టెంబర్ 5
- View Answer
- సమాధానం: సి
10. తెలంగాణ సామాజిక–ఆర్థిక ముఖ చిత్రం–2022 ప్రకారం– ప్రస్తుత ధరలలో 2021–22లో రాష్ట్ర జీఎస్వీఏలో సరైన వ్యవసాయ–అనుబంధ ఉపరంగాల వృద్ధిరేట్లును జతపర్చండి. వ్యవసాయ–అనుబంధ ఉపరంగాలు వృద్దిరేటు (శాతంలో) 1. పంటలు ఎ) 18.2 2. పశుసంపద బి) 5.3 3. అటవీ సంపద సి) 16.6 4. మత్స్య సంపద డి) 0.2
ఎ) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
బి) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
సి) 1–డి, 2–ఎ, 3–బి, 4–సి
డి) 1–డి, 2–ఎ, 3–సి, 4–బి
- View Answer
- సమాధానం: సి