Skip to main content

తెలంగాణ ఎకానమీ బిట్ బ్యాంక్ - 2

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఎన్ని దశల్లో అధ్యయనం చేశారు?
    3 దశలు (1956-70; 1971-90; 1991-2014)
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు (1956లో) తెలంగాణ భూభాగంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
    9 జిల్లాలు
  • ఏపీలో భాగంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎంత శాతం భూమి సాగు కింద ఉంది?
    40 శాతం
  • కమార్ లలిత్ కమిటీని దేనికోసం నియమించారు?
    తెలంగాణలోని మిగులు నిధులపై అధ్యయనం చేయటానికి
  • కుమార్ లలిత్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం?
    1969
  • ఏ కాలపరిమితిలో జరిగిన నిధుల కేటాయింపులను కుమార్ లలిత్ కమిటీ పరిశీలించింది?
    1956, నవంబరు 1 నుంచి 1968 మార్చి 31 వరకు
  • కుమార్ లలిత్ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది?
    1969, మార్చి (2 నెలల కాలపరిమితితో)
  • ఎంత మంది ఆంధ్ర ఉద్యోగులు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు లలిత్ కమిటీ పేర్కొంది?
    4,500
  • ఇందిరాగాంధీ ఏ సూత్రంలో భాగంగా జస్టిస్ భార్గవ కమిటీని నియమించారు?
    అష్టసూత్రంలో భాగంగా
  • జస్టిస్ భార్గవ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం -
    1969, ఏప్రిల్ 22
  • జస్టిస్ భార్గవ కమిటీలో సభ్యుల సంఖ్య -
    ముగ్గురు
  • కమార్ లలిత్ కమిటీ నివేదికను పరిశీలించేందుకు నియమించిన కమిటీ -
    జస్టిస్ భార్గవ కమిటీ
  • జస్టిస్ భార్గవ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులు-
    రూ. 28.44 కోట్లు
  • జస్టిస్ కైలాస్‌నాథ్ వాంఛూ కమిటీని నియమించింది ఎవరు?
    కేంద్ర ప్రభుత్వం
  • జస్టిస్ కైలాస్‌నాథ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
    1969, మార్చి 28
  • జస్టిస్ కైలాస్‌నాథ్ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది?
    1969, సెప్టెంబరు 9
  • జస్టిస్ కైలాస్‌నాథ్ వాంఛూ కమిటీలో ఎంత మంది సభ్యులున్నారు?
    ముగ్గురు (1+2)
  • ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేసింది?
    1969 మార్చి 28
  • ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమేనని హైకోర్టు తీర్పు చెప్పిన రోజు -
    1969, ఫిబ్రవరి 20
  • ముల్కీ నిబంధనలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని చెప్పిన కమిటీ?
    వాంఛూ కమిటీ
  • భూసంస్కరణలు అమలు దిశగా భారత ప్రభుత్వ తొలి అడుగ్గా దేన్ని చెప్పుకోవచ్చు?
    మద్రాస్ ఎస్టేట్ రద్దు (1948)
  • హైదరాబాద్ రాష్ర్టంలో వ్యవసాయ సంబంధాలను ప్రభావితం చేసిన మొదటి చట్టం -
    హైదరాబాద్ జాగీర్ల రద్దు చట్టం (1949)
  • నిజాం తన సొంత ఖర్చుల కోసం కేటాయించుకున్న గ్రామాలు/భూములు -
    సర్ఫేఖాస్
  • నిజాంకు హిందూ రాజులు చెల్లించే శిస్తును ఏమంటారు?
    పేష్‌కష్
  • సాలార్‌జంగ్ క్రమబద్ధమైన సర్వే సెటిల్‌మెంట్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
    1875లో
  • హైదరాబాద్ జాగీరు వ్యవస్థ రద్దు, క్రమబద్ధీకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
    1949లో
  • హైదరాబాద్ (తెలంగాణ) కౌలు, వ్యవసాయ భూముల చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం -
    1950
  • ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతం) ఇనాంల రద్దు చట్టం చేసిన సంవత్సరం -
    1955
  • కాంగ్రెస్ పార్టీ 1948లో నియమించిన కమిటీ (భూ సంస్కరణలకు అనుగుణంగా) -
    కుమారప్ప కమిటీ
  • తెలంగాణలో భూములు కోల్పోయిన జమీందార్లకు ఎంత నష్టపరిహారం చెల్లించారు?
    రూ. 18 కోట్లు
  • ముఖ్యంగా తెలంగాణలో కౌలు విధానం ఎన్ని రూపాల్లో ఉండేది?
    3 (బెతాయి; గుల్లామక్త్యా; సర్ఫేఖాస్)
  • పంటలో నిర్దిష్ట మొత్తం కౌలుగా చెల్లించే విధానం -
    బెతాయి (పంటలో 1/4 వంతు లేదా 1/5 వంతు)
  • కౌలును నగదు రూపంలో చెల్లించే విధానం -
    సర్ఫేఖాస్ (ఎకరానికి రూ. 20 నుంచి రూ. 25)
  • కౌలుదార్ల సమస్యలను పరిష్కరించటానికి తగిన సూచనలు చేయాల్సిందిగా నిజాం నియమించిన కమిటీ -
    బరూచా కమిటీ (1937)
  • బరూచా కమిటీ కౌలుదార్లను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
    రెండు రకాలుగా ( జిరాయిత్ హక్కులు ఉన్నవారు, లేనివారు)
  • షక్మిదార్లు అంటే -
    వరుసగా 12 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కౌలుకు భూమిని సాగుచేసిన వారు ( జిరాయిత్ హక్కులు ఉన్నవారు)
  • హైదరాబాద్ కౌలు చట్టం- 1950ను అనుసరించి రక్షిత కౌలుదార్లు -
    933-1943 మధ్యకాలంలో 6 ఏళ్లు లేదా 1948 నుంచి ఆరేళ్లు కౌలుదార్లుగా ఉన్నవారు.
  • గిర్‌గ్లానీ కమిటీ నియామక ప్రధాన ఉద్దేశం -
    610 జీవో అమలును పరిశీలించటం.
  • ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ చట్టాన్ని మొదటిసారి ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు?
    ఖమ్మం జిల్లా
  • పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
    1956, ఫిబ్రవరి 20
  • ప్రమాణ కమతం నిర్ణయించేందుకు వేటిని ప్రాతిపదికగా తీసుకున్నారు?
    పంట పండే తీరు, సాగునీటి వసతి, భూమి వినియోగం
  • జయ భారతరెడ్డి కమిటీని ఏ ప్రభుత్వం నియమించింది?
    ఎన్టీఆర్ ప్రభుత్వం
  • జయ భారతరెడ్డి కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు?
    1985లో
  • జయ భారతరెడ్డి కమిటీలో ఎంత మంది సభ్యులుఉన్నారు?
    ముగ్గురు (1+2)
  • జయ భారతరెడ్డి కమిటీ నివేదిక ప్రకారం 1975 నుంచి 1985 మధ్యలో తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థానికేతర ఉద్యోగులు -
    56,962
  • జయ భారతరెడ్డి నివేదిక ప్రకారం జోన్-6లో హైదరాబాద్ తర్వాత ఏ జిల్లాలో స్థానికేతరులు అధికంగా ఉన్నారు?
    నిజామాబాద్
  • ఏ నివేదికను పరిశీలించేందుకు సుందరేశన్ కమిటీని ఏర్పాటు చేశారు?
    జయ భారతరెడ్డి కమిటీ నివేదిక
  • ఉమ్మడి ఏపీలో భూసంస్కరణల అమల్లోని లోపాలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన పథకం -
    ఇందిరా క్రాంతి పథకం
  • అసైన్డ్ భూములు అంటే?
    పేదవారికి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (1958లో) జారీ చేసిన ఏ ఉత్తర్వులు ఆసైన్డ్ భూముల విధానానికి రూపకల్పన చేశాయి?
    1406, 1407
  • కోనేరు రంగారావు కమిటీ (2006) ప్రకారం ఎవరిని భూమిలేని పేదలుగా గుర్తించాలి?
    1 ఎకరం (తరి)/ 2 ఎకరాలు (కుష్కి) కంటే తక్కువ భూమి ఉన్నవారు
  • తెలంగాణ ప్రభుత్వం 3 ఎకరాల భూపంపిణీ పథకంలో ఏ సంస్థను ప్రధాన భాగస్వామిగా చేర్చింది?
    తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్
  • 3 ఎకరాల భూపంపిణీ పథకం అమలు కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎన్ని కోట్లను విడుదల చేసింది?
    రూ.5 కోట్లు
  • కౌలుదార్ల సంస్థాగత పరపతికి దూరమై, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న వారిని గుర్తించేందుకు కోనేరు రంగారావు కమిటీ చేసిన కీలక సూచన?
    లోన్ ఎలిజిబిలిటీ కార్డు (ఎల్‌ఈసీ)
  • తెలంగాణలో అత్యధిక కౌలుదార్లు ఉన్న జిల్లా -
    రంగారెడ్డి ( 85 శాతం)
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉద్యోగాలను సర్వీస్ కమిషన్ నుంచి తొలగించాలని సూచించిన కమిటీ -
    వాంఛూ కమిటీ
  • సమైక్య రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన జీవో -
    జీవో నెం.674
  • పెద్దమనుషుల ఒప్పందంపై ఎంత మంది సంతకం చేశారు?
    ఎనిమిది మంది
  • పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ భాషను ఎన్నేళ్లు కొనసాగించాలి?
    5 సంవత్సరాలు
  • పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి నియంత్రణలో ఉండాలి?
    ప్రాంతీయ మండలి
  • జీవో నెం.674 ఏ అంశాలను నిర్దేశిస్తుంది?
    ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన నియమాలను
  • ‘ఆర్టికల్ 371-ఈ’ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు?
    32వ సవరణ
  • రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సమైక్య రాష్ట్రంలో జిల్లా, జోనల్ (నాన్-గెజిటెడ్), జోనల్ (గెజిటెడ్) ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వరుసగా -
    80%; 70%; 60%
  • జయ భారతరెడ్డి, సుందరేశన్ కమిటీల రిపోర్టును అనుసరించి ఏన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్య -
    1985, డిసెంబరు 30న 610 జోవోను విడుదల చేయటం
  • గిర్‌గ్లానీ కమిటీని ఎప్పుడు నియమించారు?
    2001, జూన్ 25
  • అష్టసూత్ర పథకాన్ని ఏ నేపథ్యంలో ప్రతిపాదించారు?
    1969 తెలంగాణ ఉద్యమం
  • రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏ పథకంలో భాగంగా స్థాపించారు?
    ఆరుసూత్రాల పథకం
  • రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాసార్హతను ఎన్నేళ్లకు కుదించారు?
    12 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు
  • 3 ఎకరాల భూపంపిణీ పథకం అమలు కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎన్ని కోట్లను విడుదల చేసింది?
    రూ.5 కోట్లు
Published date : 03 Mar 2016 06:28PM

Photo Stories