తెలంగాణ ఎకానమీ బిట్ బ్యాంక్ - 1
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను మూడు దశల్లో అధ్యయనం చేశారు. ఇందులో మూడో దశ కాలాన్ని గుర్తించండి.
1) 1980-2014
2) 1985-2014
3) 1991-2014
4) 1998-2014
- View Answer
- సమాధానం: 3
2. 1961లో తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత?
1) 286
2) 296
3) 306
4) 319
- View Answer
- సమాధానం:1
3. కింది వాటిలో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో లేని జిల్లా ఏది?
1) హైదరాబాద్
2) మెదక్
3) రంగారెడ్డి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
4. రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం 2011 -12లో తెలంగాణలో ఎంత మంది పేద ప్రజలు ఉన్నారు?
1) 25 లక్షలు
2) 35 లక్షలు
3) 45 లక్షలు
4) 51 లక్షలు
- View Answer
- సమాధానం: 2
5. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ) నివేదిక (1955) ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల వార్షిక ఆదాయం 17 కోట్ల రూపాయలు, జనాభా 1.13 కోట్లు. అయితే తలసరి ఆదాయం ఎంత?
1) రూ. 12
2) రూ. 15
3) రూ. 18
4) రూ. 29
- View Answer
- సమాధానం: 2
6. 2011-12 మానవాభివృద్ధి ర్యాంక్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) మెదక్
3) నల్లగొండ
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
7. పేదరికం అంశానికి సంబంధించి కింద పేర్కొన్న వాక్యాల్లో సరైంది ఏది?
1) తెలంగాణ రాష్ట్రంలో పేదరికం జాతీయ సగటు కంటే ఎక్కువ
2) తెలంగాణ రాష్ట్రంలో పేదరికం జాతీయ సగటు కంటే తక్కువ
3) తెలంగాణ రాష్ట్రంలో పేదరికం జాతీయ సగటుకు సమానం
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
8. 2010-15 మధ్య రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది?
1) 5.5
2) 6.6
3) 7.7
4) 8.8
- View Answer
- సమాధానం: 4
9. 2010-15 మధ్య తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం వార్షిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది?
1) 3.2
2) 4.2
3) 5.2
4) 6.2
- View Answer
- సమాధానం: 2
10. తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది పరీవాహక ప్రాంతం 68.5 శాతం ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం నీటి వనరుల కేటాయింపు ఉంది?
1) 35
2) 45
3) 50
4) 59
- View Answer
- సమాధానం: 1
11. 1951-2011 మధ్య తెలంగాణ రాష్ట్రంలో సంఖ్యాపరంగా జనాభా ఏవిధంగా ఉంది?
1) పెరిగింది
2) తగ్గింది
3) స్థిరంగా ఉంది
4) పెద్దగా మార్పులు లేవు
- View Answer
- సమాధానం: 1
12. రాష్ట్రంలో పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) మహబూబ్‌నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
13. బడ్జెట్లో ప్రస్తుత సంవత్సరంలో పునరావృత అంశాలకు సంబంధించిన పద్దును ఏ పేరుతో పిలుస్తారు?
1) రెవెన్యూ పద్దు
2) మూలధన పద్దు
3) పునరావృత పద్దు
4) ప్రభుత్వ పద్దు
- View Answer
- సమాధానం: 1
14. తక్కువ బరువుతో పుట్టే శిశువులు అత్యధికంగా ఏ జిల్లాలో నమోదవుతున్నారు?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
15. ప్రసూతి మరణాల రేటు అత్యధికంగా నమోదవుతున్న జిల్లా?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
16. 2014-15కు గాను తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2004-05 స్థిర ధరల్లో ఎంత?
1) రూ. 51,017
2) రూ. 1,03,889
3) రూ. 48,881
4) రూ. 91,017
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల పెరుగుదల కంటే, గ్రామీణ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేది?
1) భూ సంస్కరణలు
2) వ్యవసాయ సంస్కరణలు
3) గ్రామీణాభివృద్ధి
4) కౌలు సంస్కరణలు
- View Answer
- సమాధానం: 2
18. ‘లోపభూయిష్ట భూస్వామ్య విధానాలే భారతదేశ వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు కారణం’ అని అభిప్రాయపడినవారెవరు?
1) డాక్టర్ ఆర్.కె. ముఖర్జీ
2) డాక్టర్ వాల్కర్
3) హెరాల్డ్ మాన్
4) మహాత్మా గాంధీ
- View Answer
- సమాధానం: 2
19. తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’లో భాగంగా ఎన్ని చిన్న తరహా సాగునీటి వనరులను పునరుద్ధరించనుంది?
1) 46,531
2) 40,531
3) 56,500
4) 50,000
- View Answer
- సమాధానం: 1
20. 2004-05 స్థిర ధరల ప్రకారం 2014-15లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)?
1) రూ. 1,74,185 కోట్లు
2) రూ. 2,17,432 కోట్లు
3) రూ. 2,06,425 కోట్లు
4) రూ. 1,97,055 కోట్లు
- View Answer
- సమాధానం: 2
21. జీఎస్డీపీలో ఆదాయాల వాటాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అగ్రస్థానంలో ఉండగా, అట్టడుగు స్థానంలో ఉన్న జిల్లాలేవి?
1) మహబూబ్‌నగర్, నల్లగొండ
2) ఆదిలాబాద్, కరీంనగర్
3) కరీంనగర్, నిజామాబాద్
4) నిజామాబాద్, ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 4
22. 2001-2011 మధ్య తెలంగాణ జనాభా వృద్ధి రేటు ఎంత శాతం?
1) 18.8
2) 12.6
3) 14.2
4) 13.6
- View Answer
- సమాధానం: 4
23. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అక్షరాస్యతా రేటు వరసగా?
1) 58.9 శాతం, 49.5 శాతం
2) 60 శాతం, 50 శాతం
3) 49.5 శాతం, 59.9 శాతం
4) 69.5 శాతం, 50.4 శాతం
- View Answer
- సమాధానం: 1
24. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) తెలంగాణలో శ్రామికులు పనిలో పాల్గొనే రేటు.. దేశ సగటు కంటే ఎక్కువ
2) దేశ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో, వ్యవసాయేతర రంగం పనుల కల్పనలో వెనుకబడి ఉంది
3) తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ శ్రామికులు పనిలో పాల్గొనే రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ
4) రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా శాతం దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా శాతం కంటే ఎక్కువ
- View Answer
- సమాధానం: 3
25. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అటవీ సంపద, కలప వాటా ఎంత (2014-15 ధరల్లో)?
1) 0. 6 శాతం
2) 0.9 శాతం
3) 5 శాతం
4) 7.1 శాతం
- View Answer
- సమాధానం:3
26. కనీస మద్దతు ధరను ప్రకటించేది?
1) కేంద్ర ఆర్థిక శాఖ
2) కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
3) కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్
4) అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రెసైస్
- View Answer
- సమాధానం: 3
27. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క ప్రోగ్రామ్ (Swan)కు కింది వాటిలో ఏ సంస్థ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తోంది?
1) విప్రో
2) టీసీఎస్
3) మహింద్రా సత్యం
4) గూగుల్
- View Answer
- సమాధానం: 2
28. 2013-14లో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసిన కూరగాయలు ఏవి?
1) మిర్చి, ఉల్లి
2) ఉల్లి, బెండ
3) ఆలు, టమాట
4) టమాట, ఉల్లి
- View Answer
- సమాధానం: 4
29. 'T-HART' పథకానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) దీని పూర్తి రూపం: Telangana State Handicrafts and Artisans Revival with Technology program
2) సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులు, కళాకారులను ప్రోత్సహించడానికి దీన్ని తీసుకువచ్చారు
3) Arts and crafts క్లస్టర్స ఏర్పాటు చేస్తారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. తెలంగాణలో స్థూల నీటి పారుదల భూవిస్తీర్ణంలో అత్యధిక వాటా వేటికి ఉంది?
1) చెరువులు
2) కాలువలు
3) బావులు
4) నదులు
- View Answer
- సమాధానం: 3
31. జతపరచండి.
గ్రూప్-ఎ | గ్రూప్-బి |
ఎ. మదత్ మాష్ | i. స్థిరమైన కౌలు విధానం |
బి. మసురూదీ | ii. మత, సైనిక, పౌర సరఫరాలు, సేవ చేసే షరతులపై ఇచ్చే జాగీర్లు |
సి. సర్బరస్తా | iii. వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునే హక్కు పొందినవారు |
డి. పాన్‌మక్తా | iv. ఉద్యోగుల పోషణ కోసం జీతానికి అదనంగా ఇచ్చే జాగీర్లు |
ఎ | బి | సి | డి | |
1) | i | ii | iii | iv |
2) | iv | ii | i | iii |
3) | iv | ii | iii | i |
4) | i | iii | ii | iv |
- View Answer
- సమాధానం: 3