సామాజిక ఉద్యమాలు
1. సామాజిక ఉద్యమాల్లో కింది వాటిలో ఏ రకమైనవాటిని గమనించవచ్చు?
1. ప్రతిగమన లేదా ప్రతిచర్య ఉద్యమాలు(Reactionary movements)
2. సంస్కరణ ఉద్యమాలు (Reformatory movements)
3. విప్లవాత్మక ఉద్యమాలు (Revolutionary movements)
ఎ) 1, 2
బి) 2, 3
సి) 1, 3
డి) 1, 2, 3
- View Answer
- సమాధానం: డి
2. కింది వాటిలో రైతాంగ ఉద్యమాలకు కారణం?
ఎ) బ్రిటిషర్ల పాలనా విధానాలు
బి) అధిక కౌలు విధానాలు
సి) కౌలుదార్లకు రక్షణ లేకపోవడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3.1917లో బిహార్‌లో చంపారన్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
బి) మహాత్మా గాంధీ
సి) నెహ్రూ
డి) పటేల్
- View Answer
- సమాధానం: బి
4. ఖేదా (Kheda) సత్యాగ్రహానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఖేదా ఉద్యమం 1918లో గుజరాత్లో జరిగింది
బి) ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు
సి) సగటు పంట దిగుబడి 25 శాతం కంటే తగ్గితే బ్రిటిషర్లు పన్నులో మినహాయింపు ఇవ్వకపోవడం ఈ ఉద్యమానికి కారణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. 1928లో బార్డోలిలో రైతుల ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహించారు?
ఎ) మహాత్మా గాంధీ
బి) సర్దార్ వల్లభాయ్ పటేల్
సి) అంబేద్కర్
డి) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: బి
6. 1921లో ‘మోప్లా ముస్లిం కౌలుదార్ల తిరుగుబాటు’ ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) కేరళ
బి) ఒరిస్సా
సి) కర్ణాటక
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
7. తెలంగాణ రైతాంగ ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఈ ఉద్యమానికి ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకత్వం వహించింది
బి) తెలంగాణ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చిన రోజు - 1947 సెప్టెంబర్ 11
సి) ‘విజయవాడ’ను ‘స్టాలిన్గ్రాడ్’గా అభివర్ణించారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8. 1946లో ‘తెభాగా’ రైతాంగ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) బెంగాల్
బి) బిహార్
సి) మహారాష్ట్ర
డి) మద్రాస్
- View Answer
- సమాధానం: ఎ
9. ‘నక్సల్ బరీ’ అనేది ఒక..
ఎ) రాజకీయ పార్టీ పేరు
బి) ప్రాంతం పేరు
సి) సంస్థ పేరు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
10. ‘భూదానోద్యమానికి’ నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు?
ఎ) ఆచార్య వినోబా భావే
బి) రావి నారాయణ రెడ్డి
సి) పుచ్చలపల్లి సుందరయ్య
డి) బద్ధం ఎల్లారెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
11. భారతదేశంలో ‘నీలి విప్లవం’ ఏ రంగంలోని అభివృద్ధికి సంబంధించింది?
ఎ) వ్యవసాయం
బి) పట్టు పరిశ్రమ
సి) జలచరాల పెంపకం లేదా చేపల పెంపకం
డి) పాడి పరిశ్రమ
- View Answer
- సమాధానం:సి
12. తెభాగా ఉద్యమం ద్వారా పాలి కాపులు (Share croppers) డిమాండ్ చేసింది ఏమిటి?
ఎ) పంటలో మూడో వంతు తమ కోసం ఉంచుకోనివ్వాలని
బి) పంటలో నాలుగింట మూడు వంతులు తమ కోసం ఉంచుకోనివ్వాలని
సి) పంటలో మూడింట రెండు వంతులు తమ కోసం ఉంచుకోనివ్వాలని
డి) పంటలో సగ భాగం తమ కోసం ఉంచుకోనివ్వాలని
- View Answer
- సమాధానం: ఎ
13.‘నాగోబా’ గిరిజన జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది?
ఎ) నిజామాబాద్
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: బి
14.కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ‘వర్లీ’ తిరుగుబాటు మహారాష్ట్రలో జరిగింది
బి) ‘సంతాల్’ తిరుగుబాటు బిహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో జరిగింది
సి) తెలంగాణలో గోండుల తిరుగుబాటుకు ‘కొమరం భీం’ నాయకత్వం వహించారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
15.‘జల్-జంగల్-జమీన్’ ఎవరి నినాదం?
ఎ) కొమరం భీం
బి) అల్లూరి సీతారామరాజు
సి) గంట దొర
డి) కొర్ర మల్లయ్య
- View Answer
- సమాధానం: ఎ
16. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?
ఎ) భూస్వాములు
బి) ధనవంతులైన రైతులు
సి) భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, నిజాం
డి) బ్రిటిషర్లు
- View Answer
- సమాధానం: సి
17. 1953లో మొదటిసారిగా ‘వెనుకబడిన తరగతుల కమిషన్’ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?
ఎ) కాకా కాలేల్కర్
బి) బి.పి. మండల్
సి) బి.పి.ఆర్.విఠల్
డి) ఎల్.ఎం.సింఘ్వీ
- View Answer
- సమాధానం: ఎ
18. ‘బి.పి. మండల్’ కమిషన్‌ను 1978లో జనతా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ 1980లో నివేదిక సమర్పించే నాటికి ప్రధానమంత్రి ఎవరు?
ఎ) చరణ్‌సింగ్
బి) ఇందిరా గాంధీ
సి) రాజీవ్ గాంధీ
డి) పి.వి.నరసింహారావు
19. రాజ్యాంగంలోని ఆర్టికల్-340 దేనికి సంబంధించింది?
ఎ) ఎస్టీ కమిషన్
బి) ఎస్సీ కమిషన్
సి) మహిళా కమిషన్
డి) ఓబీసీ కమిషన్
- View Answer
- సమాధానం:డి
20. ‘హైదరాబాద్ అంబేద్కర్’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఎం.గోవిందరాజులు
బి) బి.ఎస్. వెంకట్రావు
సి) ఎన్.బి. గౌతమ్
డి) భాగ్యరెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: బి
21.జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
1. మహాత్మా గాంధీ | i. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య |
2. నారాయణ గురు | ii. హరిజన సేవక్ సంఘ్ |
3. బి.ఆర్. అంబేద్కర్ | iii. ఎస్.ఎన్.డి.పి. యోగం |
4. జ్యోతిరావు పూలే | iv. సత్యశోధక్ సమాజ్ |
1 | 2 | 3 | 4 | |
ఎ) | i | ii | iii | iv |
బి) | ii | iii | i | iv |
సి) | iv | iii | ii | i |
డి) | ii | iv | i | iii |
- View Answer
- సమాధానం: బి
22.‘కమ్యూనల్ అవార్డ్’ను ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1932 ఆగస్టు 4
బి) 1931 ఆగస్టు 4
సి) 1933 ఆగస్టు 4
డి) 1934 ఆగస్టు 4
- View Answer
- సమాధానం: ఎ
23. షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజక వర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు?
ఎ) భారత ప్రభుత్వ చట్టం - 1935
బి) భారత ప్రభుత్వ చట్టం - 1919
సి) భారత కౌన్సిళ్ల చట్టం - 1892
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
24. ‘దళిత పాంథర్స్’ పార్టీని ఎక్కడ ప్రారంభించారు?
ఎ) బొంబాయి
బి) గుజరాత్
సి) ఉత్తరప్రదేశ్
డి) జమ్ము-కశ్మీర్
- View Answer
- సమాధానం: ఎ
25. జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
1. నవధాన్య ఉద్యమం | i. వందనా శివ |
2. సెలైంట్ వ్యాలీ ఉద్యమం | ii. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ |
3. చిప్కో ఉద్యమం | iii. సుందర్‌లాల్ బహుగుణ |
4. నర్మదా బచావో ఆందోళన్ | iv. మేధాపాట్కర్ |
1 | 2 | 3 | 4 | |
ఎ) | i | ii | iv | iii |
బి) | i | ii | iii | iv |
సి) | iii | ii | i | iv |
డి) | ii | i | iii | iv |
- View Answer
- సమాధానం:బి
26. ‘చిప్కో’ ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఉత్తరాఖండ్ అడవుల్లోని బిష్ణోయ్ గిరిజనులు ప్రారంభించారు
బి) ‘చిప్కో’ అంటే చెట్లను ఆలింగనం చేసుకోవడం
సి) ఈ ఉద్యమ నాయకులు సుందర్‌లాల్ బహుగుణ, చండి ప్రసాద్ భట్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
27. ‘అప్పికో’ ఉద్యమం ఎక్కడ జరిగింది?
ఎ) కేరళ
బి) కర్ణాటక
సి) ఒరిస్సా
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
28. ‘తెహ్రీ డ్యామ్ ఆందోళన్’ ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) ఉత్తరాఖండ్
బి) కేరళ
సి) మహారాష్ట్ర
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: ఎ
ఎ) లార్డ్ కర్జన్
బి) వారన్ హేస్టింగ్స్
సి) విలియం బెంటింక్
డి) డఫ్రిన్
- View Answer
- సమాధానం: సి
30.1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీతో పాటు నాయకులందరూ అరెస్టైనప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) అరుణా అసఫ్ అలీ
బి) హంసా మెహతా
సి) రాజకుమారి అమృత కౌర్
డి) సుచేత కృపలానీ
- View Answer
- సమాధానం: ఎ
31.జాతీయ మహిళా కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఈ కమిషన్‌ను 1992లో ప్రారంభించారు
బి) దీనికి మొదటి అధ్యక్షురాలు - జయంతీ పట్నాయక్
సి) మహిళా కమిషన్ ప్రస్తుత అధ్యక్షురాలు - లలిత కుమార మంగళం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
32. ఐక్యరాజ్య సమితి 1975ను ఏ సంవత్సరంగా ప్రకటించింది?
ఎ) అంతర్జాతీయ మహిళా సంవత్సరం
బి) అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరం
సి) అంతర్జాతీయ కార్మిక హక్కుల సంవత్సరం
డి) పైవాటిలో ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
33. ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-2013’ లోక్‌సభలో ఆమోదం పొందిన తేది?
ఎ) 2014 ఫిబ్రవరి 20
బి) 2014 ఫిబ్రవరి 18
సి) 2014 మార్చి 1
డి) 2014 జూన్ 2
- View Answer
- సమాధానం: బి
34. ఏర్పాటు చేసిన సంవత్సరాల ప్రకారం కింది రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి.
1. నాగాలాండ్
2. హిమాచల్ ప్రదేశ్
3. సిక్కిం
4. గోవా
ఎ) 1, 2, 3, 4
బి) 3, 2, 1, 4
సి) 3, 1, 4, 2
డి) 4, 3, 2, 1
- View Answer
- సమాధానం: ఎ
35. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 2000
బి) 2001
సి) 2002
డి) 2003
- View Answer
- సమాధానం: బి
36. కింది వాటిలో జార్ఖండ్ ఉద్యమానికి కారణమైన అంశం ఏది?
1. భూమి, అటవీ అన్యాక్రాంతం (Land and Forest Alienation)
2. అసమాన అభివృద్ధి
3. నిరక్షరాస్యత
4. పృథక్కరణ (Isolation)
ఎ) 1, 2, 4
బి) 1, 2, 3
సి) 3, 4, 1
డి) 2, 3, 4
- View Answer
- సమాధానం: ఎ
37. జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
1. దళిత ఉద్యమాలు | i. నారాయణ గురు |
2. నక్సలైట్ ఉద్యమం | ii. బహుగుణ |
3. చిప్కో ఉద్యమం | iii. మజుందార్ |
4. ధర్మపరిపాలన ఉద్యమం | iv. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ |
1 | 2 | 3 | 4 | |
ఎ) | iv | iii | ii | i |
బి) | i | ii | iii | iv |
సి) | ii | i | iv | iii |
డి) | iii | i | ii | iv |
- View Answer
- సమాధానం: ఎ
38.నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని మొదట ఎవరు ప్రారంభించారు?
ఎ) బ్రాహ్మణులు
బి) నాయర్లు
సి) ఎజ్వాలు
డి) నాడార్లు
- View Answer
- సమాధానం: సి
39. బోడోలాండ్ తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) నాగాలాండ్
బి) మిజోరాం
సి) త్రిపుర
డి) అస్సాం
- View Answer
- సమాధానం: డి
40. ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది?
ఎ) 1949 డిసెంబర్ 10
బి) 1948 డిసెంబర్ 10
సి) 1950 డిసెంబర్ 10
డి) 1947 డిసెంబర్ 10
- View Answer
- సమాధానం: బి
41. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1993
బి) 1992
సి) 1990
డి) 1989
- View Answer
- సమాధానం: ఎ
42. మానవ హక్కుల పరిణామంలో ముఖ్య ఘట్టం ఏది?
ఎ) మాగ్నాకార్టా - 1215
బి) ది బిల్ ఆఫ్ రైట్స్-1689
సి) యునెటైడ్ స్టేట్స్ బిల్ ఆఫ్ రైట్స్-1789
డి) డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ది సిటిజెన్ - 1789
- View Answer
- సమాధానం:ఎ
43. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) దీని మొదటి చైర్మన్ ‘జస్టిస్ రంగనాథ్ మిశ్రా’. ప్రస్తుత చైర్మన్ ‘జస్టిస్ హెచ్.ఎల్.దత్తు’
బి) ఇది ఒక చట్టబద్ధ సంస్థ
సి) దీన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
44. ‘ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్’ను ఎప్పుడు చేశారు?
ఎ) 1955
బి) 1965
సి) 1985
డి) 1975
- View Answer
- సమాధానం: బి