వివాహం
1. వివాహం అంటే..?
ఎ) మానవ సమాజానికి ఆధారం
బి) వధూవరుల బంధువుల మధ్య సంబంధాలను నిర్వచిస్తుంది
సి) విశ్వజనీన సామాజిక సంస్థ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
2. ప్రపంచమంతటా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం?
ఎ) బహు భార్యత్వం
బి) బహు భర్తృత్వం
సి) ఏక వివాహం
డి) సమూహ వివాహం
- View Answer
- సమాధానం: సి
3. ‘దూద్ లౌటానా’ పేరుతో పిలిచే మేనరిక వివాహం ఏ తెగలో కనిపిస్తుంది?
ఎ) గోండులు
బి) సంతాల్‌లు
సి) సవరలు
డి) భిల్లులు
- View Answer
- సమాధానం: ఎ
4. వెస్టర్ మార్క్ అభిప్రాయం ప్రకారం బహుభార్యత్వానికి కారణం?
ఎ) బ్రహ్మచర్యాన్ని బలవంతంగా రుద్దడం
బి) సంతానాపేక్ష
సి) సామాజిక ప్రతిష్ట
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ఎక్కువగా నివసించే తోడాలలో ఉండే వివాహ రూపం?
ఎ) సోదర బహుభర్తృత్వం
బి) బహు వివాహం
సి) సోదరేతర బహుభర్తృత్వం
డి) సమూహ వివాహం
- View Answer
- సమాధానం: ఎ
6. ఉన్నత కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటారు? (Civils, Gr-II backlog, 2000)
ఎ) దేవర న్యాయం
బి) అనులోమ వివాహం
సి) ప్రేమ వివాహం
డి) ప్రతిలోమ వివాహం
- View Answer
- సమాధానం: డి
7. ‘మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా’ గ్రంథ రచయిత ఎవరు? (Civils)
ఎ) ఎం.ఎస్. శ్రీనివాస్
బి) కె.ఎం. కపాడియా
సి) టి.ఎన్. సుదాన్
డి) ఐ. కార్వే
- View Answer
- సమాధానం: బి
8. హిందువుల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఆచారం ఏది?(Civils)
ఎ) గోత్రేతర వివాహం
బి) సగోత్ర వివాహం
సి) గ్రామానికి బయట వివాహమాడటం
డి) సపిండ వివాహం చేసుకోవడం
- View Answer
- సమాధానం: ఎ
9. మహమ్మదీయ పెళ్లి కుమార్తెకు చెల్లించే నగదును ఏమంటారు? (Civils)
ఎ) కట్నం
బి) మెహర్
సి) కన్యాశుల్కం
డి) నష్టపరిహారం
- View Answer
- సమాధానం: బి
10. కులం అనేది ఒక ..... సమూహం.(Civils)
ఎ) బహిర్వివాహిత
బి) సంవృత
సి) అంతర్వివాహిత
డి) అనివార్య
- View Answer
- సమాధానం: సి
11. స్మృతుల్లో పేర్కొన్న విధంగా హిందువుల్లో ఎన్ని రకాల వివాహాలున్నాయి?(Civils, Gr-II backlog, 2000)
ఎ) 5
బి) 6
సి) 7
డి) 8
- View Answer
- సమాధానం: డి
12. హిందూ వివాహ చట్టం ఎప్పుడు చేశారు? (Civils, Gr-II backlog, 2000)
ఎ) 1955
బి) 1956
సి) 1954
డి) 1958
- View Answer
- సమాధానం: ఎ
13. హైందవ వారసత్వ చట్టం ఎప్పుడు చేశారు? (Civils, GDPD-2013, Gr-II backlog, 2000)
ఎ) 1955
బి) 1956
సి) 1957
డి) 1959
- View Answer
- సమాధానం: బి
14. కింది వాటిలో ఏ తెగ బహు భర్తృత్వ విధానాన్ని పాటిస్తుంది?
ఎ) తోడాలు
బి) భిల్లులు
సి) ఖాసీలు
డి) గోండులు
- View Answer
- సమాధానం: ఎ
15. భారతదేశంలో కులాంతర వివాహానికి శాసనపరమైన సదుపాయాన్ని ఏర్పరచిన తొలి చట్టం ఏది?
ఎ) హిందూ వివాహ చట్టం-1955
బి) ప్రత్యేక వివాహ చట్టం-1872
సి) హిందూ కోడ్ బిల్లు-1956
డి) అభ్యసన ప్రయోజనాల చట్టం-1930
- View Answer
- సమాధానం: బి
16. సమాజంలో కింది వాటిలో దేని కోసం నిషిద్ధం పాటిస్తారు? (Civils)
ఎ) పెద్దల పట్ల గౌరవం ప్రదర్శించడానికి
బి) మహిళల హోదా పెంచడానికి
సి) కొంతమంది బంధువుల మధ్య లైంగిక సంపర్కాన్ని నివారించడానికి
డి) విరోధుల పట్ల అయిష్టం ప్రదర్శించడానికి
- View Answer
- సమాధానం: సి
17. నిషేధాలు (Taboos) వేటితో సంబంధం కలిగి ఉంటాయి?(Civils, Gr-II backlog, 2000)
ఎ) ఆచారాలు
బి) జానపద రీతులు
సి) రీతులు
డి) ఫ్యాషన్లు
- View Answer
- సమాధానం: ఎ
18.వివాహం వల్ల కలిగే ప్రయోజనం?
ఎ) అందమైన భార్య/భర్త లభిస్తారు
బి) సమాజంలో చిన్నచూపు చూస్తారు
సి) సంతోషకర వేడుకల్లో పాల్గొంటారు
డి) చట్టపరమైన సామాజిక హక్కులు, బాధ్యతలు లభిస్తాయి
- View Answer
- సమాధానం: డి
19. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?(CDPO-2013)
ఎ) బహు భర్తృత్వం
బి) ఏక వివాహం
సి) బహు భార్యత్వం
డి) బహు వివాహం
- View Answer
- సమాధానం: బి
20. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించే స్పెషల్ మ్యారేజ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?(CDPO-2013)
ఎ) 1950
బి) 1954
సి) 1952
డి) 1951
- View Answer
- సమాధానం: బి
21. భారతదేశంలో వివాహం అనేది ఒక ....(CDPO-2013)
ఎ) సంస్కారం
బి) ఒప్పందం
సి) నమ్మకం
డి) నీతి సూత్రం
- View Answer
- సమాధానం: ఎ
22.ఒక పురుషుడు తన భార్యకు సంబంధించిన ఎక్కువ మంది అక్కాచెల్లెళ్లను వివాహమాడే పద్ధతిని ఏమంటారు?(CDPO-2013)
ఎ) దేవర న్యాయం
బి) భార్యాభగినీ న్యాయం
సి) హైపర్ గమీ
డి) భార్యాభగినీ బహుభార్యత్వం
- View Answer
- సమాధానం: డి
23. నిమ్న కులానికి చెందిన యువతి ఉన్నత కులానికి చెందిన పురుషుడిని వివాహమాడే పద్ధతిని ఏమంటారు? (Gr-II backlog, 2000)
ఎ) బహిర్‌వివాహం
బి) అనులోమ వివాహం
సి) అంతర్వివాహం
డి) ప్రతిలోమ వివాహం
- View Answer
- సమాధానం: బి
24. ఒక వ్యక్తి (పురుషుడు) ఒకరి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?(CDPO-2013)
ఎ) బహు భర్తృత్వం
బి) హైపర్ గమీ
సి) బహు భార్యత్వం
డి) పాలీగమి
- View Answer
- సమాధానం: డి
25. ఒక స్త్రీ తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?(Gr-II, 2000)
ఎ) భార్యాభగినీ న్యాయం
బి) బహు భర్తృత్వం
సి) దేవర న్యాయం
డి) ప్రేమ వివాహం
- View Answer
- సమాధానం: బి
26. వివాహం వల్ల కలిగే బంధుత్వాన్ని ఏమంటారు? (Gr-II, 2000)
ఎ) వైవాహిక బంధుత్వం
బి) ఏకరక్త బంధుత్వం
సి) పునరుత్పత్తి బంధుత్వం
డి) ఏక పత్నీత్వ బంధుత్వం
- View Answer
- సమాధానం: ఎ
27. బాల్య వివాహ నిషిద్ధ చట్టం అమోదించిన సంవత్సరం - (Gr-II, 2000)
ఎ) 1947
బి) 1955
సి) 1929
డి) 1956
- View Answer
- సమాధానం: సి
28. కింది వారిలో వితంతు పునర్వివాహ సంఘ సంస్కర్తగా ఎవరిని పేర్కొంటారు? (Gr-II, 2000)
ఎ) సరోజినీ నాయుడు
బి) రాజా రామ్మోహన్రాయ్
సి) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
డి) అనిబీసెంట్
- View Answer
- సమాధానం: బి
29. వివాహాల్లో ఒక పద్ధతైన ‘మూతా’ ఎవరిలో కనిపిస్తుంది?(Gr-II backlog, 2000)
ఎ) హిందువులు
బి) క్రైస్తవులు
సి) ముస్లింలు
డి) బౌద్ధులు
- View Answer
- సమాధానం: సి
30. పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఏమంటారు? (Civils, Gr-II backlog, 2000)
ఎ) గాంధర్వ వివాహం
బి) రాక్షస వివాహం
సి) దైవ వివాహం
డి) అసుర వివాహం
- View Answer
- సమాధానం: ఎ
31. ఒక పురుషుడు ఒకసారి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని ఏమంటారు?(Gr-II backlog, 2000)
ఎ) పాలీగమి
బి) మోనోగమి
సి) పాలియాండ్రి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
32. దేవర న్యాయ వివాహం అంటే?(Gr-II backlog, 2002)
ఎ) మేనబిడ్డల మధ్య జరిగే వివాహం
బి) సోదరి కూతురితో జరిగే వివాహం
సి) సోదరుడి కూతురితో జరిగే వివాహం
డి) భర్త మరణించిన తర్వాత అతడి సోదరుడిని వివాహం చేసుకోవడం
- View Answer
- సమాధానం: డి
33. బహు భర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం? (Gr-II backlog, 2002)
ఎ)ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహమాడటం
బి) ఒక స్త్రీ ఒక వ్యక్తినే భర్తగా కలిగి ఉండటం
సి) ఒక స్త్రీ పురుషుడితో తాత్కాలికంగా జీవనాన్ని గడపడం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
34. కొత్తగా వివాహమైన దంపతులు పెళ్లి తర్వాత పురుషుడు తన భార్య కుటుంబంతో కలిసి నివసించే పద్ధతిని ఏమంటారు? (Gr-II backlog, 2000)
ఎ) నూతన స్థానిక నివాస పద్ధతి
బి) పత్నీ స్థానిక నివాస పద్ధతి
సి) పతి స్థానిక నివాస పద్ధతి
డి) మాతుల స్థానిక నివాస పద్ధతి
- View Answer
- సమాధానం: బి
35. భారత్‌లో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సమ్మతిచ్చే నిబంధనలను మొదటిసారిగా ఏ చట్టం ద్వారా రూపొందించారు?(Gr-II backlog, 2000)
ఎ) హిందూ వివాహ చట్టం-1955
బి) విశేష వివాహ చట్టం- 1972
సి) హిందూ కోడ్ బిల్ - 1956
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
36. ఆదిమ సమాజాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఏది?
ఎ) సేవా వివాహం
బి) గాంధర్వ వివాహం
సి) అసుర వివాహం
డి) పరీక్షావధి వివాహం
- View Answer
- సమాధానం: ఎ
37. ‘సామాజిక, సాంస్కృతిక గతిశీలత’ (Social and Cultural Dynamics) గ్రంథ రచయిత ఎవరు?(Gr-II, backlog, 2000)
ఎ) పి.ఎ. సోరోకిన్
బి) జార్జి సిమ్మోల్
సి) వెలిస్ కోసర్
డి) మెల్విన్ ట్యూమన్
- View Answer
- సమాధానం: ఎ
38. కన్యాశుల్కం అంటే ఏమిటి?
ఎ) వధువు బంధువులు వరుడి బంధువులకు వివాహం సందర్భంగా చేసే చెల్లింపులు
బి) వరుడి బంధువులు వధువు బంధువులకు చేసే వివాహ చెల్లింపులు
సి) వధువు బంధువులు పురోహితుడికి చేసే చెల్లింపులు
డి) వధువు బంధువులు తమలో తాము ఇచ్చుకునే బహుమతులు
- View Answer
- సమాధానం: బి
39. కింది వాటిలో హిందూ వివాహానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏది?
ఎ) విధినిర్వహణ ధర్మం
బి) ప్రజోత్పత్తి
సి) రతి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
40. హిందూ వివాహ సంస్కారాల్లో అతి ముఖ్యమైన అంశం?
ఎ) కన్యాదానం
బి) పాణిగ్రహణం
సి) సప్తపది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
గ్రూప్-ఎ | గ్రూప్-బి |
1. బ్రహ్మ వివాహం | i. పెద్దలు నిర్ధారించి, శాస్త్రపరంగా చేసే వివాహం |
2. రాక్షస వివాహం | ii. వధువును వెతికి వెళ్లి పెళ్లి చేసుకోవడం |
3. అసుర వివాహం | iii.జీవిత భాగస్వామిని కొనుగోలు చేయడం ద్వారా వివాహం చేసుకోవడం |
4. గాంధర్వ వివాహం | iv. ఇరువురూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం |
1 | 2 | 3 | 4 |
ఎ) i | ii | iii | iv |
బి) iv | iii | ii | i |
సి) iii | iv | ii | i |
డి) iv | iii | i | ii |
- View Answer
- సమాధానం: ఎ
42. శారదా చట్టం (Child Marriage Restraint Act) కింది వాటిలో దేన్ని ఏర్పరచింది? (TSPSC-AEE, 2015)
ఎ)హిందువుల్లో వితంతు పునర్వివాహాన్ని నిషేధిస్తుంది
బి) హిందువులు విడాకులు తీసుకోవడాన్ని నిషేధిస్తుంది
సి) హిందువుల్లో వధూవరుల కనీస వివాహ వయసు నిర్ధారిస్తుంది
డి) స్త్రీలు ఉన్నత విద్య అభ్యసించడాన్ని అంగీకరిస్తుంది
- View Answer
- సమాధానం: సి
43. భారతదేశంలోని దాదాపు అన్ని ఆదిమతెగలు పాటించే వివాహ విధానం?
ఎ) బహిర్‌వివాహం
బి) బహు భార్యత్వం
సి) స్వైరితం
డి) అంతర్వివాహం
- View Answer
- సమాధానం: డి
44. ముస్లింలలో వివాహం రద్దు చేసుకోవడాన్ని ఏమంటారు?
ఎ) తల్వండి
బి) తల్వార్
సి) ఇద్దత్
డి) తలాఖ్
- View Answer
- సమాధానం: డి
45. భారతీయ క్రైస్తవ వివాహ చట్టం ఎప్పుడు చేశారు?
ఎ) 1872
బి) 1873
సి) 1874
డి) 1875
- View Answer
- సమాధానం: ఎ
46. భారత్‌లో పార్శీల వివాహం, విడాకుల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
ఎ) 1934
బి) 1939
సి) 1933
డి) 1936
- View Answer
- సమాధానం: డి
47. ఏడు డిగ్రీల (Seven Degree) వివాహ నిబంధన ఏ మతంలో కనిపిస్తుంది?
ఎ) ఇస్లాం
బి) సిక్కు మతం
సి) హిందూ మతం
డి) క్రైస్తవ మతం
- View Answer
- సమాధానం: డి
48.వివాహం అనేది .......
ఎ) ఒక రకమైన పరిచయం
బి) ఒక సమితి
సి) ఒక సంఘం
డి) సాంస్కృతిక సంశ్లిష్టత (Cultural complex)
- View Answer
- సమాధానం: డి
49. మానవ వివాహ చరిత్ర (History of Human Marriage) గ్రంథ రచయిత?
ఎ) వెస్టర్ మార్క్
బి) ఏంగెల్స్
సి) సర్ హెన్రీమెయిన్
డి) టాల్కాట్ పార్మన్స్
- View Answer
- సమాధానం: ఎ