కుటుంబం
1. కింది వాటిలో అత్యంత ప్రధానమైన సామాజిక సంస్థ ఏది?
ఎ) కుటుంబం
బి) వివాహం
సి) విద్య
డి) మతం
- View Answer
- సమాధానం: ఎ
2. ‘ఉమ్మడి కుటుంబం నశించిపోతుందనడం సరైంది కాదు’ అని పేర్కొన్నవారు?
ఎ) మెనారియా
బి) మదన్
సి) కపాడియా
డి) రామ్ అహుజా
- View Answer
- సమాధానం: సి
గమనిక: కె.ఎం. కపాడియా 1969లో గుజరాత్‌లోని నవేసరి అనే బస్తీలో 246 కుటంబాలను అధ్యయనం చేసి వాటిలో 139 (56 శాతం) సంద్రదాయబద్ధమైన సమష్టి కుటుంబాలని, మిగిలిన 107 (47 శాతం) ప్రాథమిక కుటుంబాలని తెలిపారు.
-
3. ‘ఫ్యామిలి’ అనే పదం రోమన్ పదమైన ఫేమలస్ నుంచి ఆవిర్భవించింది. ‘ఫేమలస్’ పదానికి అర్థం ఏమిటి?
ఎ) కూలీ
బి) సేవకుడు
సి) సన్యాసి
డి) వర్తకుడు
- View Answer
- సమాధానం: బి
4. The origin of family, private property and the state గ్రంథ రచయిత ఎవరు?
ఎ) కె.ఎం. కపాడియా
బి) కార్వే
సి) మోర్గాన్
డి) ఫ్రెడరిక్ ఏంగెల్స్
- View Answer
- సమాధానం: డి
5. ఉమ్మడి కుటుంబానికి మరో పేరు?
ఎ) బంధిత కుటుంబం
బి) పెద్ద కుటుంబం
సి) సంప్రదాయిక కుటుంబం
డి) అవిభాజ్య కుటుంబం
- View Answer
- సమాధానం: బి
6. కుటుంబ చక్రం దేన్ని సూచిస్తుంది?
ఎ) వధూవరుల వివాహం మొదలుకొని వారి మరణాల వరకు జరిగే వివిధ సంఘటనలు
బి) మొదటి, చివరి బిడ్డల జననం, వివాహాలు
సి) సంతాన పోషణ ప్రక్రియ, వృద్ధాప్య దశ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. కింది వాటిలో కుటుంబం విశిష్ట లక్షణం కానిది ఏది?
ఎ) ఇది సార్వజనీనమైంది
బి) ఇది చిన్న వ్యవస్థ
సి) అన్ని సమాజాల్లో ఉంటుంది
డి) ఇందులో పరస్పర సంబంధాలు ఉండవు
- View Answer
- సమాధానం: డి
8. భారతదేశంలో కుటుంబాలు ఏ వంశానుక్రమంపై ఆధారపడి ఉన్నాయి?
ఎ) మాతృ వంశానుక్రమం
బి) పితృ వంశానుక్రమం
సి) ద్వి వంశానుక్రమం
డి) ఏక వంశానుక్రమం
- View Answer
- సమాధానం: బి
9. కింగ్స్లే డేవిస్ అభిప్రాయం ప్రకారం కుటుంబం మౌలిక ప్రకార్యాలు ఏవి?
ఎ) లైంగిక, ఆర్థిక అవసరాలు తీర్చడం
బి) పునరుత్పత్తి, సాంఘికీకరణ
సి) అభిమానం, ఆహ్లాద, మతపరమైన అవసరాలు తీర్చడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
10. మెకైవర్ అభిప్రాయం ప్రకారం కుటుంబ మౌలిక లక్షణాలు ఏవి?
ఎ) విశ్వజనీనత
బి) ఉద్వేగాత్మక ఆధారం
సి) బాధ్యతలను గుర్తించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
11. కింది ఏ సంస్థలో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది?
ఎ) పాఠశాల
బి) గ్రామం
సి) కుటుంబం
డి) దేశం
- View Answer
- సమాధానం: సి
12.ఏ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు?
ఎ) వంశం
బి) అధికారం
సి) పరిమాణం
డి) కూర్పు
- View Answer
- సమాధానం: బి
13. స్త్రీ కుటుంబ అధికారిణిగా వ్యవహరించే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) పితృస్వామిక కుటుంబం
బి) ఉమ్మడి కుటుంబం
సి) దాంపత్య మూలక కుటుంబం
డి) మాతృస్వామిక కుటుంబం
- View Answer
- సమాధానం: డి
14. కింది వాటిలో దేని ఆధారంగా కుటుంబాలను పతి స్థానిక, మాతుల స్థానిక, మాతృ స్థానిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు?
ఎ) అధికార ప్రమాణం
బి) నివాస ప్రమాణం
సి) వారసత్వ ప్రమాణం
డి) జీవిత భాగస్వాముల సంఖ్య
- View Answer
- సమాధానం: బి
15. కుటుంబం ఏ రకమైన సమూహం?
ఎ) గౌణ
బి) ప్రాథమిక
సి) ద్వితీయ
డి) తృతీయ
- View Answer
- సమాధానం: బి
గమనిక: మానవ సమూహాలన్నింటిలో అతి ముఖ్యమైన ప్రాథమిక సమూహం కుటుంబం. ఇది అతి చిన్న సామాజిక సమూహం.
-
16. కుటుంబ ప్రకార్యాలను ఆవశ్యక, అనావశ్యక ప్రకార్యాలు అనే రెండు రకాలుగా వర్గీకరించినవారు?
ఎ) మెకైవర్
బి) ఆగ్బర్న
సి) లుండ్బర్గ్
డి) ఎ.ఇ. రాస్
- View Answer
- సమాధానం: ఎ
17. కుంటుంబాన్ని సమష్టి నివాసం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలున్న సామాజిక సమూహంగా వర్ణించినవారు?
ఎ) రీడ్
బి) నిమ్కాఫ్
సి) మెకైవర్
డి) డేవిస్
- View Answer
- సమాధానం: సి
గమనిక: మెకైవర్ కుటుంబ ప్రకార్యాలను కింద పేర్కొన్న 2 భాగాలుగా విభజించాడు.
ఆవశ్యక ప్రకార్యాలు:
ఎ. లైంగిక అవసరానికి లేదా మిథున వాంఛకు స్థిరమైన సంతృప్తి.
బి. పిల్లల ఉత్పత్తి, పెంపకం
సి. గృహ సదుపాయం
అనావశ్యక ప్రకార్యాలు:
ఎ. మతపరమైనవి
బి. విద్యా విషయమైనవి
సి. ఆర్థికపరమైనవి
డి. ఆరోగ్యానికి సంబంధించినవి
ఇ. వినోదానికి సంబంధించినవి
-
18. మాతృవంశీయ కుటుంబాలు ఏ సమాజంలో కనిపిస్తాయి?
ఎ) రాడార్లు
బి) ఖాసీలు
సి) భిల్లులు
డి) తోడాలు
- View Answer
- సమాధానం: బి
19.కుటుంబాల వర్గీకరణకు ప్రమాణం కాని అంశం ఏది?
ఎ) పూర్వీకుల స్థితి
బి) నిర్మీతి
సి) మతం
డి) నివాసం
- View Answer
- సమాధానం: సి
20. వివాహం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం ఏది?
ఎ) 1984
బి) 1961
సి) 1955
డి) 1971
- View Answer
- సమాధానం: ఎ
21. కింది వాటిలో సరైన జత/జతలను గుర్తించండి.
1. వివాహం: సమూహం
2. కుటుంబం : సంస్థ
3. గోత్రం: సాజాత్యం
4. తెగ : సముదాయం
ఎ) 1, 2, 3, 4
బి) 2, 3, 4
సి) 1, 2, 3
డి) 3, 4
- View Answer
- సమాధానం: బి
గమనిక:
- సామాజిక శాస్త్రం ప్రకారం వివాహం అనేది ఒక సంస్థ.
- కొన్ని రక్త సంబంధాల ఆధారంగా కొన్ని కుటుంబాలు, వంశాలతో ఏర్పడే సంస్థ గోత్రం. గోత్రం బహిర్వివాహానికి సంబంధించింది.
-
22. ‘దోపిడీ పూర్వక సమాజంలో ఆదర్శవంతమైన సాధనమే కుటుంబం’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారెవరు?
ఎ) డేవిడ్ కూపర్
బి) ఎడ్మండ్ లీచ్
సి) ఫ్రెడరిక్ ఏంగెల్స్
డి) ఆర్.డి. లయింగ్
- View Answer
- సమాధానం: సి
23. వివాహం ద్వారా ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) జన్మప్రాప్త కుటుంబం (Family of Procreation)
బి) అనుస్థాపిత కుటుంబం (Family of Orientation)
సి) కేవలం ఒక కుటుంబం
డి) వ్యష్టి కుటుంబం
- View Answer
- సమాధానం: ఎ
24. భారతదేశంలో ఏ వర్గంలో ఉమ్మడి కుటుంబం అదృశ్యమైంది?
ఎ) నగర వ్యాపారస్థులు
బి) వృత్తి నిపుణులు
సి) భూమిలేని వేతన కార్మికులు
డి) గ్రామీణ భూస్వాములు
- View Answer
- సమాధానం: సి
25. జతపరచండి.
ఎ) i-4, ii-1, iii-2, iv-3 గ్రూప్-ఎ గ్రూప్-బి i. ఐ.పి. దేశాయ్ 1) హౌస్‌హోల్డ్ డైమన్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ ఇండియా ii. ఎ.ఎం. షా 2) మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా iii. కె.ఎం. కపాడియా 3) అర్బనైజేషన్ అండ్ ఫ్యామిలీ iv. ఎం.ఎస్. గోరె 4) సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ మహువా 5) వరల్డ్ రివల్యూషన్ అండ్ ఫ్యామిలీ పాట్రన్
బి) i-4, ii-5, iii-2, iv-3
సి) i-1, ii-4, iii-5, iv-2
డి) i-3, ii-1, iii-4, iv-2
- View Answer
- సమాధానం: ఎ
26. ఒక ‘నాయర్ కుటుంబం’ను కింద పేర్కొన్న ఏ విధంగా కూడా పిలుస్తారు?
ఎ) గోటుల్
బి) నోక్నా
సి) తార్వాడ్
డి) ఇల్లయ్
- View Answer
- సమాధానం: సి
27. కింది వాటిలో ఉమ్మడి కుటుంబ లక్షణం కానిది ఏది?
ఎ) సభ్యులందరూ ఒక ఇంటిలో నివసించడం
బి) సభ్యులు ఒకరితో ఒకరు బంధువులు కానవసరం లేదు
సి) ఆస్తి మొత్తం కుటుంబానికి చెందడం
డి) కుటుంబ ఆదాయం ఒకటిగా చేర్చడం
- View Answer
- సమాధానం: బి
28. కుటుంబంలో అధికారం ఒక స్త్రీపై ఆపాదిస్తే దాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) మాతృ స్థానిక కుటుంబం
బి) మాతృ వంశీయ కుటుంబం
సి) మాతృస్వామిక కుటుంబం
డి) పితృస్వామిక కుటుంబం
- View Answer
- సమాధానం: బి
29.కింది వాటిలో ఉమ్మడి కుటుంబం క్షీణతకు కారణం కానిది -
ఎ) వ్యవసాయ ఉత్పత్తి పెరగడం
బి) పాశ్చాత్యీకరణ
సి) వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామికీకరణకు మారడం
డి) సామాజిక చట్టాలను చేయడం
- View Answer
- సమాధానం: ఎ
30. ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే నష్టం -
ఎ) వ్యక్తీవాదం
బి) సహకారం
సి) పోటీ
డి) సోమరితనం
- View Answer
- సమాధానం: డి
31. ఉమ్మడి కుటుంబ విభజనకు కారణం -
ఎ)ఉమ్మడి కుటుంబం సోమరులను తయారు చేయడం
బి) ఉమ్మడి కుటుంబం వ్యక్తీవాదాన్ని అణచివేయడం
సి) ఉమ్మడి కుటుంబంలో సభ్యుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉండటం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
32. ఆధునిక కుటుంబంలో విధులు ..
ఎ) వేగంగా అధికమవుతున్నాయి
బి) వృద్ధి చెందుతున్నాయి
సి) తగ్గుతున్నాయి
డి) రెట్టింపు అవుతున్నాయి
- View Answer
- సమాధానం: సి
33. కుటుంబం ఆవిర్భవించడానికి కారణం ఏమిటి?
ఎ) లైంగిక ప్రేరణ
బి) ఆర్థిక అవసరం
సి) సంతానోత్పత్తి ఆవశ్యకత
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
34. నూతన వధూవరులు విడిగా నివాసం ఏర్పరచుకునే పద్ధతిని ఏమంటారు?
ఎ) నూతన స్థానిక నివాసం
బి) మాతృ స్థానిక నివాసం
సి) పితృ స్థానిక నివాసం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
35. కింది వాటిలో మాతృస్వామిక కుటుంబ లక్షణం కానిది ఏది?
ఎ) మాతృవంశానుక్రమం
బి) మాతృ అధికారం
సి) పతి స్థానిక నివాసం
డి) మాతృవంశీయ ఆస్తి సంక్రమణం
- View Answer
- సమాధానం: సి
36. మాతుల స్థానిక నివాసంలో వివాహమైన జంట ఎవరితో నివసిస్తుంది?
ఎ) వధువు తల్లి సోదరుడు
బి) వరుడి తల్లి సోదరుడు
సి) వరుడి తండ్రి సోదరి
డి) వధువు సోదరుడు
- View Answer
- సమాధానం: బి
37. కింద పేర్కొన్న ఏ తెగలో మాతృ సంతతి కుటుంబం కనిపిస్తుంది?
ఎ) ముండాలు
బి) ఖాసీలు
సి) ఖారియార్లు
డి) కిసాన్లు
- View Answer
- సమాధానం:బి
38. దేని ఆధారంగా కుటుంబాన్ని ఏక పత్నీత్వ, బహు పత్నీత్వ కుటుంబంగా విభజిస్తారు?
ఎ) నివాసం
బి) వివాహం
సి) వంశపారంపర్యం
డి) ఆస్తి హక్కులు
- View Answer
- సమాధానం: బి
39. తార్వాడ్ అనే కుటుంబ నమూనా కింది ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది?
ఎ) అసోం
బి) కేరళ
సి) బిహార్
డి) ఒడిశా
- View Answer
- సమాధానం: బి
40. ఒక వ్యక్తికి వివాహమై సంతానం పొందితే ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) వైవాహిక
బి) సంయోగ
సి) అనుస్థాపిత
డి) ప్రత్యుత్పత్తి
- View Answer
- సమాధానం: డి
41. అధికారానికి విశేష ప్రాధాన్యం ఉంటూ తల్లిదండ్రులు-పిల్లల సంబంధాలపై ఆధారపడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) ఏకరక్త కుటుంబం
బి) మాతృస్వామ్య కుటుంబం
సి) వైవాహిక కుటుంబం
డి) బహిర్వివాహ కుటుంబం
- View Answer
- సమాధానం: ఎ
42. కుటుంబ వ్యవస్థకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) కుటుంబం విశ్వజనీనం
బి) కుటుంబం అన్ని సమాజాల్లో ఒకే విధంగా ఉంటుంది
సి) కుటుంబ వ్యవస్థ భిన్న సమాజాల్లో విభిన్న రీతుల్లో ఉంటుంది
డి) ఎ, బి
- View Answer
- సమాధానం:బి