TSPSC Group 2 Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఇవే.. 350 పోస్టులు మహిళలకే.. కానీ
ఈ గ్రూప్-2 రాత పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. 783 పోస్టులకు ఏకంగా 5,51,943 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. గ్రూప్-2 పరీక్షను అభ్యర్థులు ఎంతో సవాల్‌గా తీసుకోని ప్రిపేర్ అవుతున్నారు.
ఈ రెండు రోజుల్లోనే.. 4 పేపర్లకు..
మొత్తం 4 పేపర్లకు ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో పేపర్ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు కలిపి మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులుండవు. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు విడుదల అవుతాయి.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
350 పోస్టులు మహిళలకే.. కానీ
ఈ గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలకు అగ్రస్థానం దక్కిందనే చెప్పొచ్చు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా.. వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్ కేటగిరీలో లేదు. కార్మికశాఖ పరిధిలోని సహాయ కార్మికశాఖ అధికారి పోస్టులు తొమ్మిది ఉంటే.. ఇవన్నీ కూడా మహిళలకే కేటాయించారు.
➤ TSPSC గ్రూప్–1, 2,3 & 4 కి హిస్టరీ సబ్జెక్ట్‌ను ఎలా చదవాలంటే..
ఎన్నికల కమిషన్‌లో రెండు సహాయ సెక్షన్ అధికారి పోస్టులుంటే అవి రోస్టర్ ప్రకారం మహిళల కోటాలోకి వచ్చాయి. సహాయ వాణిజ్య పన్నుల అధికారి పోస్టులు 59 ఉంటే మహిళలకు దాదాపు సగం వారికే రిజర్వయ్యాయి. రెవెన్యూశాఖలో నాయబ్ తహసీల్దారు పోస్టులు 98 ఉంటే ఇందులో 53 మహిళలవే. ఇదే తరహాలో కొన్ని విభాగాల్లో సగానికిపైగా పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి.
☛ TSPSC: 1,375 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ సిలబస్ ఇదే..!