Skip to main content

TSPSC Groups: ఇలా గురిపెడితే.. గ్రూప్స్‌లో విజయం ఈజీనే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. ఇందులో గ్రూప్స్‌ ఉద్యోగాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.
TSPSC Groups Preparation
TSPSC Groups Exam Tips

గ్రూప్‌ 1,2,3,4 కొట్టాలని నిరుద్యోగులు గురిపెడుతుంటారు. కానీ, తీవ్ర పోటీ ఉండడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఈనేపథ్యంలో గ్రూప్స్‌ కొలువులు సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలి, శిక్షణలో పాటించే  పద్ధతులు.. మెలకువలు నేర్చుకోవడమెలా తదితర  విషయాలపై ఏసీరెడ్డి  స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జంబోజు అంజయ్యచారి సూచనలు.. సలహాలు మీకోసం..

టీఎస్‌పీఎస్సీలో నమోదు తప్పనిసరి..

TSPSC


టీఎస్‌పీఎస్సీలో నమోదు తప్పనిసరిగా  తొలుత గ్రూప్స్‌ పరీక్షలు రాయాలనుకున్నవారు  తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీ ఎస్‌సీ)లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) కొత్త  జోనల్‌ విధానానికి అనుగుణంగా చేసుకోవాలి. గ్రూప్‌–1 కి మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఉంటాయి. తర్వాత ఇంటర్వూ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో  జనరల్‌ స్టడీస్‌పై ప్రశ్నలుంటాయి. 150 మార్కులుంటాయి. ప్రిలిమ్స్‌లో ఎంపికైనవారు మెయిన్స్‌కు  అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో ఆరు పేపర్లుంటాయి. జనరల్‌ ఎస్సే, ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టి ట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్, జనరల్‌ ఇంగ్లిష్, హిస్టరీ,  జాగ్రఫీ అండ్‌ కల్చర్, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్, తెలంగాణ మూవ్‌మెంట్‌ ఫర్‌ స్టేట్‌ ఫార్మేషన్,  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్లుంటాయి. వీటిలో  మెరిట్‌ ఆధారంగా 

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్
ఇంటర్వ్యూకు ఎంపికవుతారు.  
➤ గ్రూప్‌–2లో 600 మార్కులుంటాయి. మొదటి పేపర్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ అండ్‌ జనరల్‌ స్టడీస్‌  ఉంటాయి. రెండో పేపర్‌లో ఇండియన్‌ హిస్టరీ,  పాలిటీ, సొసైటీ గురించి ఉంటుంది. మూడో  పేపర్‌లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అంశాలుంటాయి. నాల్గో పేపర్‌లో తెలంగాణ ఉద్యమ  చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన అంశాలుంటాయి. ప్రతి పేపర్‌ 150 మార్కులుంటాయి.  
➤ గ్రూప్‌– 3లో 450 మార్కులుండగా జనరల్‌  ఎబిలిటిస్‌ అండ్‌ జనరల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌.  రెండో పేపర్‌ ఇండియన్‌ హిస్టరీ, తెలంగాణది. సెక్రెటిరియల్‌ ఎబిలిటీస్, ప్రతీ పేపర్‌కు 150  మార్కులుంటాయి.  
➤ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 44 ఏళ్ల వయసు వారు అర్హులు.  

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

గురి తపనివ్వొద్దు..

Exam Plan


☛ గ్రూప్‌– 1,2,3,4 ఉద్యోగాలకు దశల వారీగా  నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి  వాటికి సంబంధించిన సిలబస్‌ను క్షుణ్ణంగా ఒక టికి రెండుసార్లు చదివి పరిశీలించి, సంబందిత  పుస్తకాలు, గత పరీక్షల పేపర్లు సమకూర్చు కోవాలి.
☛ తర్వాత కోచింగ్‌కు వెళ్తే అక్కడ ఇచ్చే శిక్షణ తీసుకోవడంతో మరింత పట్టు పెరుగుతుంది. శిక్షణలో ప్రతీ రోజు తరగతుల్లో చెపింది రోజూ  ప్రాక్టిస్‌ చేస్తూ తరవుగా చదువుతుండాలి. రోజూ పరీక్షలు నిర్వహించే కోచింగ్‌ సెంటర్‌ను ఎంచు కుంటే మంచిది.

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్
☛ శిక్షణలో కానీ, సొంతంగా చదువుకునేవారు కానీ  టాపిక్‌ వైస్‌ సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుం టూ సదరు అంశాల్లో గతంలో ఎలాంటి ప్రశ్నలు  వచ్చాయి.. ఇప్పుడు ఏ విధంగా వచ్చే అవకాశా లున్నాయని మనమే విశ్లేషణ చేసుకుంటూ ఎలా  వచ్చిన రాసేలా సన్నద్ధం కావాలి.  
☛ ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ పుస్తకాలు చద వాలి. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయి స్తూ ప్రతి అంశాన్ని లోతుగా చదవాలి. టీఎస్‌పీ ఎస్‌సీ ప్రశ్నలు అడిగే విధానం ఒకప్పటి మాదిరి  నేరుగా ప్రశ్నలుండవనే విషయాన్ని గమనించాలి. విశ్లేషణ పద్ధతిలో టాపిక్‌లో లోపలి నుంచి అడిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి  అలాగే ప్రిపేర్‌ కావాలి.  

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్
☛ పాత మాదిరి పేపర్లు రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌  చేయాలి.  
☛ ఒకసారి సదరు ఉద్యోగాలు సాధించినవారి సూచనలు తీసుకుంటే మంచింది.

టీఎస్‌పీఎస్సీ సిలబస్

Published date : 29 Mar 2022 06:54PM

Photo Stories