Government Jobs: పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైన ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్‌ను ఎలా చదవాలి..? ఏఏ బుక్స్ చదవాలి?
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మార్చి 10న అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలోనే గ్రూప్ 1,2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ నేపథ్యం ఈ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఇండియన్ పాలిటీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఎలా చదవాలి..? ఎలా చదివితే ఈజీగా గుర్తు ఉంటుంది. ఏఏ బుక్స్ చదవాలి.. మొదలైనవి మీకోసం..
☛ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర పరీక్షల్లో భారత రాజకీయ వ్యవస్థ (Indian Polity)కి సంబంధించి కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన చట్టాలు, ఆర్డినెన్స్‌లు, ప్రభుత్వ విధానాలు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రాజ్యాంగ సవరణలపై తప్పనిసరిగా దృష్టిసారించాలి. ఈ సవరణ చట్టం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించింది.
☛ ముఖ్యమైన రాజ్యాంగ అధికరణలపై పట్టు సాధించాలి. దేశంలో ముఖ్య వ్యవస్థలకు సారథ్యం వహిస్తున్న వారి పేర్లను తెలుసుకోవాలి. ఉదా: ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్. అదే విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి; సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో పనిచేస్తున్న ప్రధాన సమాచార కమిషనర్, వివిధ స్థాయీ సంఘాల (పార్లమెంట్/అసెంబ్లీ) అధ్యక్షుల పేర్లు తదితరాలను తెలుసుకోవాలి.
☛ రాజ్యాంగ పరిషత్ ఎన్నిక విధానం, ముఖ్య కమిటీల అధ్యక్షులు, పరిషత్ చివరి సమావేశం లక్ష్యాల తీర్మానం (పీఠికకు మూలం), ప్రధాన షెడ్యూళ్లు, కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ/విధాన పరిషత్‌లకు ఎన్నిక విధానం; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; కొత్త రాష్ట్రాల ఏర్పాటు, కశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి; ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సంబంధించిన జాతీయ కమిషన్లు, వాటి విధులు, ఆయా కమిషన్ల అధ్యక్షుల వివరాలను తెలుసుకోవాలి.
రిఫరెన్స్ బుక్స్ :
➤ లక్ష్మీకాంత్ పుస్తకం.
➤ బీఏ ద్వితీయ సంవత్సరం రాజనీతి శాస్త్రం.
➤ బీఏ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ పాలన.
➤ వార్తా పత్రికలు, మేగజీన్లు.