Group 1 & 2: ప్రిపరేషన్ మొదటి రోజు నుంచే ఇలా చదివితే.. విజయం మీదే..: కె.హేమలత, గ్రూప్–1 విజేత
గ్రూప్–1, గ్రూప్–2 పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం
కె.హేమలత,గ్రూప్–1 విజేత(డిప్యూటీ కలెక్టర్) గారి సలహాలు.. సూచనలు మీకోసం..
ప్రత్యేకంగా ఈ ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి..
ఏపీ, తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించింది. గ్రూప్–1, గ్రూప్–2ల్లో తెలంగాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం, సంస్కృతి, కళలు, సాహిత్యం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ సిలబస్ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాధాన్య సమకాలీన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలంలో రూపొందిన కొత్త పథకాలు, ఇతర కార్యక్రమాలు, బడ్జెట్, సోషల్ సర్వే, ఆర్థిక సర్వే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ఆర్థిక వనరులు, పంటలు, భూ సంస్కరణలు, భూదానోద్యమం, ముఖ్యమైన వనరులు, జనాభా, సెన్సెస్, అక్షరాస్యత రేటు, ఆర్థిక వృద్ధి సర్వే వంటి అంశాలను చదవాలి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
వ్యాసాలు రాయడం కంటే..
ప్రిపరేషన్ సమయంలో ఒక అంశాన్ని ఏ విధంగా రాస్తే ఎక్కువ సమాచారం, విలువైన సమాచారం ప్రజెంట్ చేయగలమో తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని అంశాలకు ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ ఆధారంగా కూడా పరిపూర్ణమైన సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో వ్యాసాలు రాయడం కంటే చార్ట్‌ల రూపంలో ప్రజెంటే చేయడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
ప్రిపరేషన్ మొదటి రోజు నుంచే ఇలా..
గ్రూప్స్ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. సమయ పాలన. ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి పరీక్ష రోజు వరకు సమయ పాలన పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ప్రతి పేపర్‌లో ఒక్కో టాపిక్/యూనిట్ చదువుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒకరోజు ఒక యూనిట్/ టాపిక్ చదవలేకపోయినా.. తర్వాత రోజు ఒక గంట అదనంగా కేటాయించైనా సమయ పాలన గాడిలో ఉండేలా వ్యవహరించాలి. అప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయి. టైంప్లాన్ విషయంలో పొరపాట్లు లేదా కష్టమైన అంశాలను విస్మరించడం వంటి వాటి వల్ల చాలామంది కొద్ది మార్కుల తేడాతో విజయావకాశాలు చేజార్చుకుంటారు. కొత్తగా ప్రిపరేషన్ సాగించే వారందరికీ సిలబస్ కూడా కొత్తదే అని గుర్తించాలి. కాబట్టి ఇతరులతో పోల్చుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Government Jobs: గుడ్‌న్యూస్.. 30,453 ఉద్యోగాలకు అనుమతి.. ముందుగా ఈ శాఖల్లోనే పోస్టులు భర్తీ..
టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్