Skip to main content

TSPSC Group 2 Exam 2023 Date and Timings : గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల తేదీల‌పై.. సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించే గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌ తేదీల్లో మార్పుపై ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ వ‌చ్చింది.
TS CM KCR Speech on Group 2 Exam News in Telugu
TS CM KCR

ఆగ‌స్టు 6వ తేదీన (ఆదివారం) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన‌ ప్రకటనతో ఒక స్పష్టత వచ్చింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నది.

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. టీఎస్‌పీఎస్సీ కొన్ని నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ ఇప్పటి నుంచే కసరత్తు చేసింది. కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది.గ్రూప్‌-2 నిర్వహించనున్న కేంద్రాలకు పరీక్ష తేదీలైన ఆగస్టు 29,30 తేదీల్లో విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

☛ టీఎస్‌పీఎస్సీ Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా..

tspsc group 2 exam news telugu

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కొందరు సభ్యులు సైతం గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ‌ సీఎస్‌ శాంతికుమారితో సీఎం కేసీఆర్‌ చర్చించారు. అన్నీ పరిశీలించిన తర్వాత గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్‌-2 ఉద్యోగమే.

☛ చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

రాష్ట్రంలో గ్రూప్‌-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన విష‌యం తెల్సిందే. మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేశారు. అంటే.. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు.

☛ చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

Published date : 07 Aug 2023 03:11PM

Photo Stories