TSPSC Group 2 Postponed Updates : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష వాయిదాపై మా నిర్ణయం ఇదే..! పూర్తి క్లారిటీని ఆగస్టు 14న..
మిగిలిన పరీక్షల నేపథ్యంలో గ్రూప్2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును అభ్యర్థించగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్ తమ వాదనలు వినిపించింది. అయితే.. గ్రూప్-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం(ఆగష్టు 14వ తేదీ) స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. సోమవారానికి విచారణ వాయిదా వేసింది కోర్టు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | క్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అభ్యర్థుల వాదనలు ఇలా..
ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్తో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా కోరుతున్నారు. అగస్ట్ 2వ తేదీ నుంచి 30 వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని, గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షల సిలబస్ వేరు, దీంతో అన్ని పరీక్షలకు ఒకే నెలలోనే ప్రిపేర్ అయి రాయడం సాధ్యం కాదు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు.
స్కూల్,కాలేజ్‌లకు సెలవులు కూడా ఇచ్చాం..
టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకులం పరీక్షకు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్‌లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్,కాలేజ్ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు 14వ తేదీ (సోమవారం) స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం అని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో సోమవారానికి పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
☛ చదవండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్