Skip to main content

TSPSC Group 2 Exam Postpone 2024 Demand : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల‌కు నిర‌స‌న‌గా..భారీగా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-2 వాయిదా వేయాలంటూ... వేలాది మంది నిరుద్యోగులు జూలై 13వ తేదీ (శ‌నివారం) రాత్రి హైద‌రాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద ఆందోళ‌గన‌కు దిగారు.
tspsc group 2 postponed protest

ప‌రీక్ష‌లు వాయిదా వేయడం లేద‌న్న సీఎం రేవండ్ రెడ్డి వ్యాఖ్యల‌కు నిర‌స‌న‌గా భారీగా సంఖ్య‌లో రోడ్డ‌పైకి వ‌చ్చారు. దీంతో  ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద భారీగా ట్రాప్‌క్ జామ్ అయింది. అలాగే గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల సంఖ్య కూడా పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చిక్కడపల్లి చౌరస్తా నుంచి అశోక్‌నగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో బైఠాయించి నిరసనన తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌లు ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ గ్రూప్‌-2 పోస్టుల‌ను పెంచి.. ఈ ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించాలి అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. అల‌గే గ్రూప్‌-2 పోస్టుల సంఖ్య‌ 783 నుంచి 2000 వ‌ర‌కు పోస్టుల వ‌రకు పెంచాల‌ని అభ్య‌ర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్‌-3 పోస్టుల‌ను 3000 వ‌ర‌కు పెంచాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Published date : 15 Jul 2024 03:39PM

Photo Stories