TSPSC Group 1 Prelims Result 2022 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు లైన్‌క్లీయర్.. త్వరలోనే..
పరీక్ష ఫలితాల వెల్లడికి కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోందన్నారు. గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి సంబంధించిన న్యాయపరమై వివాదం హైకోర్టులో పరిష్కారమైందన్నారు.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్స్టో రీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా..
సివిల్ సర్వీసెస్ అకాడమీని ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబరు 14వ తేదీన ఈయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ దశలో ఉన్నాయి. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా తెలంగాణ సర్కార్ చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మన ఉద్యోగాలు దక్కించుకోవడానికి వీలులేకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. సీఎం కేసీఆర్ కృషితోనే ఇదంతా సాధ్యమైందని సీఎస్ అన్నారు.
చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!
రెండు వారాల్లో ఫలితాలు..?
టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలు టీఎస్‌పీఎస్సీ రెండు వారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరి ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేసింది. తుది ఆన్సర్ ‘కీ’ కూడా విడుదలైన విషయం తెలిసిందే. తదుపరి దశ అయిన మెయిన్ పరీక్షకు వీరిలో 25 వేల మంది ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం.
TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..
☛ 503: గ్రూప్–1 మొత్తం పోస్ట్‌ల సంఖ్య
☛ 3,80,081: గ్రూప్–1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
☛ 2,86,051: గ్రూప్–1 తొలిదశ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
☛ 75 శాతం: పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య.
ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈసారి గ్రూప్–1కు పోటీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. వాస్తవానికి గ్రూప్–1, సివిల్స్ వంటి పరీక్షలకు 50 నుంచి 60 శాతం మధ్యలో హాజరు శాతం ఉంటుంది. కాని ఈసారి టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1కు 75 శాతం హాజరు అనేది ఈ పరీక్ష పట్ల అభ్యర్థుల సీరియస్‌నెస్‌ను తెలుపుతోంది.
చదవండి: Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..