TSPSC Group-1 Prelims 2023 Results Postponed : గ్రూప్-1 ఫలితాల విడుదల అప్పటి వరకు అపండి.. కారణం ఇదే..
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లి నిర్వహించాలన్న పిటిషన్‌పై విచారణ చేప్పట్టిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది. వాదనలు వినిపించేందుకు టీఎస్‌పీఎస్సీ సమయం కోరింది. దీంలో హైకోర్టు సోమవారం వరకు సమయం ఇచ్చి.. అప్పటివరకు ఫలితాలను వెల్లడించోద్దని ఆదేశించింది.
ఈ వారంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలతో పాటు కీ ని కూడా విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. అయితే హైకోర్టు తీర్పుతో ఈ ఫలితాల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
☛ TSPSC Group 2 Postponed : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 వాయిదా వేయాల్సిందే.. కారణం ఇదే..?