Skip to main content

TSPSC Group 1 Prelims Result : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుద‌ల ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వ‌హించిన‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షల విడుద‌లకు రంగం సిద్ధం అయింది.
TSPSC
tspsc group 1 prelims result 2022

ఈ మేర‌కు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఈ వారంలోపు ఎప్పుడైన విడుల‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూరైన విష‌యం తెల్సిందే. అలాగే  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల విషయంలో నెలకొన్న న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోయాయని.. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

☛ TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

150 మార్కుల్లో 5 ప్రశ్నలను తొలగించినందున..

tspsc group1 results 2022

టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది ఆన్సర్‌ ‘కీ’ కూడా టీఎస్‌పీఎస్సీ విడుదలైన విషయం తెల్సిందే. తదుపరి దశ అయిన మెయిన్‌ పరీక్షకు వీరిలో 25 వేల మంది ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్‌-1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించినందున 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించింది. 

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్


☛ 503: గ్రూప్‌–1 మొత్తం పోస్ట్‌ల సంఖ్య
☛ 3,80,081: గ్రూప్‌–1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
☛ 2,86,051: గ్రూప్‌–1 తొలిదశ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
☛ 75 శాతం: పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య.

పై గణాంకాలను పరిశీలిస్తే ఈసారి గ్రూప్‌–1కు పోటీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. వాస్తవానికి గ్రూప్‌–1, సివిల్స్‌ వంటి పరీక్షలకు 50 నుంచి 60 శాతం మధ్యలో హాజరు శాతం ఉంటుంది. కాని ఈసారి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1కు 75 శాతం హాజరు అనేది ఈ పరీక్ష పట్ల అభ్యర్థుల సీరియస్‌నెస్‌ను తెలుపుతోంది.

☛ TSPSC Group 1 Prelims Question Paper & Key 2022 PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' & కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే..

Published date : 05 Jan 2023 07:48PM

Photo Stories