TSPSC Group 1 Prelims Question Paper & Key 2022 PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' & కొశ్చన్ పేపర్ ఇదే..
అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబర్ 16వ తేదీన 1,019 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు 2,86,051 (75%) మంది దీనికి హాజరయ్యారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 2022 'కీ' కోసం క్లిక్ చేయండి
మీ ఓఎంఆర్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ షీట్‌లను అందుబాటులో ఉంచారు. టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 2022 ఓఎంఆర్ షీట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
అభ్యంతరాలను..
ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక కీని కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచారు. కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ మెయిల్, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించే ప్రసక్తి లేదని కూడా పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 2022 కొశ్చన్ పేపర్ ఇదే..