Skip to main content

TSPSC Group 1 Prelims Key 2022 PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' విడుద‌ల.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన‌ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష 'కీ' ని అక్టోబ‌ర్ 29వ తేదీ(శ‌నివారం) విడుద‌ల చేశారు. ఈ ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్స్‌ కూడా అందుబాటులో ఉంచారు.
TSPSC Group 1 Prelims Key 2022
TSPSC Group 1 Prelims Exam Key 2022

అక్టోబ‌ర్ 31వ తేదీ నుంచి న‌వంబ‌ర్‌ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించ‌నున్నారు.

మీ ఓఎంఆర్ షీట్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

TSPSC OMR Sheet

మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్‌ ఓఎంఆర్‌ షీట్‌ల‌ను అందుబాటులో ఉంచారు. టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్‌ షీట్‌ల‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్‌ డిజిటల్‌ పత్రాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ఓఎంఆర్‌ షీట్ల డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

ఎట్ట‌కేల‌కు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ కీ విడుద‌ల చేయ‌డంతో అభ్యర్థుల్లో ఉన్న‌ గందరగోళం తెర‌ప‌డ‌నున్న‌ది. ఎందుకంటే.. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేని ప‌రిస్థితి ఉండేది.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

అభ్యంతరాలు ఇలా తెలియ‌జేయాలి..

tspsc website

ప్రిలిమ్స్‌ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్‌ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక కీని కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ మెయిల్‌, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించే ప్రసక్తి లేదని కూడా పేర్కొంది. 

TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబ‌ర్ 16వ తేదీన 1,019 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు 2,86,051 (75%) మంది దీనికి హాజరయ్యారు.

Group 1 Prelims Cut Off Marks : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ 2022 కటాఫ్‌ మార్కులపై టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన‌ క్లారిటీ ఇదే..

ఒక పోస్టుకు

ప్రిలిమినరీలో అర్హత సాధించే అభ్యర్థులు మెయిన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తి ప్రకారం) మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనిలో కటాఫ్‌ మార్కుల పద్ధతి లేదు. మెరిట్‌ జాబితా ప్రకారం మెయిన్‌కు ఎంపిక చేయనున్నారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' ఇదే..

Published date : 29 Oct 2022 09:29PM
PDF

Photo Stories