Skip to main content

TSPSC Group-1 Prelims: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా తేదీ ఇదే.. ఈ సారి సిల‌బ‌స్‌లో..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్షా తేదీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఖరారు చేసింది.
TSPSC Group 1
TSPSC Group 1 Prelims Exam

ఈ మేరకు జూన్ 14వ తేదీన (మంగళవారం) సాయంత్రం తేదీని ప్రకటించింది. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారిగా వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 

TSPSC Group 1 Prelims: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ కటాఫ్ ఇంతే..! ఎందుకంటే..?

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

గ‌డువు పెంచిన తర్వాత కూడా..

TSPSC Group 1 Applications


గతంతో పోలిస్తే గ్రూప్ వన్‌ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు.అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్‌పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తులు ఈ విధంగా..

గ్రాడ్యుయేట్లు 2,53,490
పోస్టుగ్రాడ్యుయేట్లు      1,22,826
ఇంటిగ్రేటెడ్‌(డిగ్రీ+పీజీ) 1,781
ఎంఫిల్‌ 424 
పీహెచ్‌డీ 1,681

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

తెలంగాణ‌లో శాఖల వారీగా గ్రూప్‌-1 పోస్టుల వివరాలు.. వ‌యోప‌రిమితి ఇలా .. : 

Application

పోస్టు ఖాళీలు వయో పరిమితి
డిప్యూటీ కలెక్టర్‌ 42 18–44
డీఎస్పీ 91 21–31
కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ 48 18–44
రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ 4 21–31
జిల్లా పంచాయతీ అధికారి 5 18–44
జిల్లా రిజి్రస్టార్‌ 5 18–44
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌) 2 21–31
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8 18–44
అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 26 21–31
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2) 41 18–44
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సాంఘిక సంక్షేమం) 3 18–44
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) 5 18–44
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) 2 18–44
జిల్లా ఉపాధి కల్పనాధికారి 2 18–44
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) 20 18–44
అసిస్టెంట్‌ ట్రెజరర్‌(ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌) 38 18–44
అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌(స్టేట్‌ ఆడిట్‌ సరీ్వస్‌) 40 18–44
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) 121 18–44

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

TSPSC Group-1 Syllabus

సబ్జెక్ట్‌ సమయం (గంటలు) గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ) 2 1/2 150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష) 3 150

మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్‌–2 హిస్టరీకల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      
  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3 150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  
  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3 150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     
  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3 150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 
  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3 150

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? 

Published date : 14 Jun 2022 10:02PM

Photo Stories