Skip to main content

TSPSC Group-1: గ్రూప్‌-1 పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా..? వీటితో జర భద్రం..!

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పరీక్షలకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరింత కఠినతరం చేసింది.
Application
Application

దరఖాస్తుల నుంచి ఓఎంఆర్‌ జవాబుపత్రం దాకా.. వివరాల నమోదు, సమాధానాల గుర్తింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బబ్లింగ్‌లో ఎలాంటి తప్పిదాలు జరిగినా.. డబుల్‌ బబ్లింగ్‌ చేసినా.. ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమని ప్రకటించింది. దరఖాస్తు చేసే సమయం నుంచే అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని నమోదు చేయాలని సూచించింది.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

వీరికి మాత్ర‌మే ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం.. :
గ్రూప్‌–1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2వ తేదీ(సోమవారం) నుంచి ప్రారంభమైంది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీఆర్‌ (వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్‌–1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటీఆర్‌ నమోదు చేసుకోనివారు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 4వ తేదీ వరకు గ్రూప్‌–1 దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో గ్రూప్‌–1 దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు.. వివరాలన్నీ నింపాక కచ్చితంగా ఒకసారి ప్రివ్యూ చూసుకుని.. క్షుణ్నంగా పరిశీలించాకే సబ్మిట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

డబుల్‌ బబ్లింగ్‌తో.. ట్రబుల్‌..: 

TSPSC Group1


సాధారణంగా ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌ టికెట్‌ నంబర్, ఇతర వివరాలను పూరించడానికి, సమాధానాలను గుర్తించడానికి.. అంకెలు, అక్షరాలను వినియోగించరు. బదులుగా నిర్దేశించిన అంకెలున్న వృత్తాలను బాల్‌ పాయిం ట్‌ పెన్‌తో నింపాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కో వృత్తాన్ని మాత్రమే పూరించాలి. తప్పుగా వృత్తాలను పూరించిన వారు మళ్లీ అసలు వృత్తాన్ని కూడా నింపితే డబుల్‌ బబ్లింగ్‌ అంటారు. గతంలో గ్రూప్‌–2 నియామకాల సమయంలో డబుల్‌ బబ్లింగ్‌  తీవ్ర వివాదం రేకెత్తించింది.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

TSPSC & APPSC: గ్రూప్స్ ప‌రీక్ష‌ల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

కొందరు అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌పై డబుల్‌ బబ్లింగ్‌ చేయడం, వైట్‌నర్‌ వినియోగించడం, ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో నియామకాల ప్రక్రియ దాదాపు నాలుగేళ్లు నిలిచిపోయింది. దీంతో ఈసారి టీఎస్‌పీఎస్సీ ముందుజాగ్రత్తగా కఠిన చర్యలను ప్రకటించింది. అభ్యర్థి డబుల్‌ బబ్లింగ్‌ చేస్తే.. సదరు జవాబు పత్రాన్ని మూల్యాం కనం చేయబోమని స్పష్టం చేసింది.  సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామని, డబుల్‌ బబ్లింగ్‌ ఉన్న ఓఎంఆర్‌ షీట్లు తిరస్కరణకు గురవు తాయని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

సమస్యల పరిష్కారానికి..
గ్రూప్‌–1 దరఖాస్తుల సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య.. 040– 23542185, 040–2354 2187 నంబర్లకు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదా help@tspsc.gov.in ’కు ఈ–మెయిల్‌ చేయవచ్చు.

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

శాఖల వారీగా గ్రూప్‌-1 పోస్టుల వివరాలు.. వ‌యోప‌రిమితి ఇలా .. : 

TSPSC Group1 Posts
పోస్టు ఖాళీలు వయో పరిమితి
డిప్యూటీ కలెక్టర్‌ 42 18–44
డీఎస్పీ 91 21–31
కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ 48 18–44
రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ 4 21–31
జిల్లా పంచాయతీ అధికారి 5 18–44
జిల్లా రిజి్రస్టార్‌ 5 18–44
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌) 2 21–31
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8 18–44
అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 26 21–31
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2) 41 18–44
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సాంఘిక సంక్షేమం) 3 18–44
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) 5 18–44
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) 2 18–44
జిల్లా ఉపాధి కల్పనాధికారి 2 18–44
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) 20 18–44
అసిస్టెంట్‌ ట్రెజరర్‌(ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌) 38 18–44
అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌(స్టేట్‌ ఆడిట్‌ సరీ్వస్‌) 40 18–44
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) 121 18–44

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

TSPSC Group-1 Syllabus
సబ్జెక్ట్‌ సమయం (గంటలు) గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ) 2 1/2 150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష) 3 150

మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్‌–2 హిస్టరీకల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      
  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3 150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  
  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3 150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     
  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3 150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 
  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3 150

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

Published date : 01 Jun 2022 08:18AM

Photo Stories