Skip to main content

TSPSC Group-1 Application Date Extended 2024 : శుభ‌వార్త‌.. గ్రూప్‌-1 అప్లికేషన్ గడువు పొడిగింపు.. ప‌రీక్ష తేదీలు కూడా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేర‌కు గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు గడువును పెంచారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గడువు ముగిసింది.
Telangana Public Service Commission   TSPSC Group-1 Application Date Extended 2024   Good news for Group-1 applicants

అయితే టీఎస్‌పీఎస్సీ అభ్య‌ర్థుల విన‌తుల మేర‌కు.. ఈ గ్రూప్-1 ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌డువును మార్చి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవ‌కాశం ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

2.7 లక్షలకు పైగా దరఖాస్తులు..

టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఫిబ్ర‌వ‌రి 19న తేదీన‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్ప‌టి వ‌రకు (మార్చి13వ తేదీ) 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తు గుడువు పొడిగించ‌డంతో.. అభ్య‌ర్థుల సంఖ్య పేరిగే అవ‌కాశం ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు https://www.tspsc.gov.in/ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

Published date : 15 Mar 2024 10:35AM

Photo Stories