Skip to main content

మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారో తెలుసుకోండిలా?

భారతదేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే.
Aadhar card link with bank account
Aadhar card link with bank account

ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఎవరి ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ చేయలేదో వెంటనే లింక్ చేసుకోవాలని ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది. ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది.  

క్షణాల్లో..
తాజాగా మరో కొత్త సర్విస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ప్రకారం పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేశారో ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ ( https://uidai.gov.in/ ) వెబ్‌సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.


ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్ :

➤ ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
➤ తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి.
➤ ఇప్పుడు మీకు కనిపించే "ఆధార్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి.
➤ ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
➤ ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి.
➤ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
➤ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి.
➤ ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.

      అందులో మీరు ఎప్పుడు బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేశారో చూపించడంతో పాటు బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టీవ్‌గా ఉందో లేదో కూడా తెలుస్తుంది. మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి కచ్చితంగా మీ ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ వివరాలు తెలుసుకోలేము.

చ‌ద‌వండి:

How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..

ATM card Alert : ఏటీఎం కార్డు పోతే...వెంట‌నే ఇలా చేయండి..!

Pancard : మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!

Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..

Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..

Driving Licence : ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే..ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండిలా..

e-Pan Card: కేవలం పది నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డు పొందండి ఎలా..?

Published date : 12 Nov 2021 04:12PM

Photo Stories