Double Century Players List : వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టిన వీరులు వీరే..
వీరిలో రోహిత్ శర్మ మూడుసార్లు ‘డబుల్’ సాధించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జనవరి 18వ తేదీ (బుధవారం) జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. 19 ఫోర్లు, 9 సిక్సర్లులతో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మొదటి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సాధించిన 8వ అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్‌గా.. అలాగే అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
➤ T20 World Cup Top Records : T20 వరల్డ్‌కప్‌లో టాప్ రికార్డులు ఇవే.. ఇప్పటికీ వరకు..
మొత్తం మీద అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇది పదవ డబుల్ సెంచరీ. డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ లు 8 మంది. పది వన్డే డబుల్ సెంచరీలలో 7 భారత్ బ్యాట్స్‌మన్ లే ఉన్నారు. అత్యధికంగా రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీలు సాదించాడు. అలాగే వన్డేలో అత్యదిక స్కోర్ కూడా రోహిత్ శర్మ (264) పేరు మీదనే ఉంది. వన్డేలలో మొదటి డబుల్ సెంచరీ సాదించింది మాత్రం సచిన్ టెండూల్కర్.
వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ వీరులు వీరే..
☛ సచిన్ టెండూల్కర్ : 200* vs సౌతాఫ్రికా, 2010
☛ వీరేంద్ర సెహ్వాగ్ : 219 vs వెస్టిండీస్, 2011
☛ రోహిత్ శర్మ : 265 vs శ్రీలంక, 2014
☛ ఇషాన్ కిషన్ : 210 vs బంగ్లాదేశ్, 2022
☛ రోహిత్ శర్మ : 209 vs ఆస్ట్రేలియా, 2013
☛ రోహిత్ శర్మ : 208* vs శ్రీలంక, 2017
☛ శుభమాన్ గిల్ : 208 vs న్యూజిలాండ్, 2023
☛ మార్టిన్ గప్టిల్ : 237* vs వెస్టిండీస్, 2015
☛ క్రిస్ గేల్ : 215 vs జింబాబ్వే, 2015
☛ ఫఖర్ జమాన్ : 210* vs జింబాబ్వే, 2018
➤ అత్యంత పిన్న వయసులోనే డబుల్ సెంచరీ కొట్టిన వారు వీరే..
☛ అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది.
☛ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది.
☛ వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్ (గిల్, 208), రెండో అత్యధిక స్కోరర్ (రోహిత్, 34) మధ్య మూడో అత్యధిక రన్స్ గ్యాప్ (174 పరుగులు). ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా విరాట్ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరగుల తేడా ఉంది.
☛ వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది.
☛ వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత.
☛ అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ (17) తర్వాతి స్థానం.
☛ వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది.
భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు.
గొప్ప కెప్టెన్‌గా..
గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. 2004లో శ్రీలంకపై ఆడిన 183 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ కావొచ్చు.. 2000లో న్యూజిలాండ్‌పై భాగ్యనగరంలో(హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో) సచిన్ ఆడిన 186 పరుగుల ఇన్నింగ్స్ కావొచ్చు.. గంగూలీ 183 పరుగులు కావొచ్చు.. ఇలా అప్పట్లో 180, 190 పరుగుల ఇన్నింగ్స్‌ను గొప్పగా భావించేవారు. డబుల్ సెంచరీలు చేయనప్పటికి వాటికి సమాన ప్రాధాన్యత దక్కింది.
☛ ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధర పలికిన ఆటగాళ్లు వీరే..
వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ వీరుడు..
అయితే 13 ఏళ్ల క్రితం(2009లో సౌతాఫ్రికాపై వన్డే మ్యాచ్‌లో) క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న మాస్టర్ ఈ ఫీట్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పేరు మార్మోగిపోయింది. అలా వన్డేల్లో డబుల్ సెంచరీ అనే పదానికి సచిన్ పురుడు పోస్తే.. ఆ తర్వాత టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తానేం తక్కువ తిన్నానా అన్నట్లు 2011లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు చెలరేగిన సెహ్వాగ్ 41 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 219 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్లో ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం.
మూడు డబుల్ సెంచరీ చేసిన వీరుడు ఈతనే..
ఈ లెక్కన చూసుకుంటే వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలకు పునాది వేసింది టీమిండియా ఓపెనర్లే అని చెప్పొచ్చు. ఆ తర్వాత టి20 క్రికెట్, ఐపీఎల్ లాంటి లీగ్ క్రికెట్‌లు ఎక్కువ కావడంతో ఆటగాళ్ల బ్యాటింగ్‌లో వేగం పెరిగింది. అలా వన్డేల్లోనూ బ్యాటర్లు టి20 తరహా స్టైల్లో బ్యాటింగ్ చేయడంతో ఆ తర్వాత చాలా డబుల్ సెంచరీలు వచ్చాయి. అందులో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలతో ఎవరికి సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు.
➤ Team India Players : ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈతనే..
వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదైతే..
అటుపై గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్‌లు ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదైతే అందులో టీమిండియా నుంచే ఏడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇందులో రోహిత్ శర్మవి మూడు కాగా.. సచిన్,సెహ్వాగ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ఒక్కో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. పైన చెప్పుకున్న ఏడుగురు ఆటగాళ్లు అందరూ ఓపెనర్లుగా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు. అయితే మిడిలార్డర్‌లో వచ్చి డబుల్ సెంచరీ కొట్టడం అసాధ్యమైనప్పటికి మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య లాంటి ఆటగాళ్లకు ఈ డబుల్ ఫీట్ చేసే చాన్స్ ఉంది. ఇది జరిగితే మాత్రం విశేషమే అని చెప్పుకోవచ్చు.