T20 World Cup Top Records : T20 వరల్డ్‌కప్‌లో టాప్ రికార్డులు ఇవే.. ఇప్పటికీ వరకు..
విజయాల పరంగా ఈ రోజు అంతటి సంచలనం నమోదు కానప్పటికీ.. వ్యక్తిగత విభాగంలో ఓ రికార్డు నమోదైంది.
శ్రీలంక-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఏఈ యువ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ హ్యాట్రిక్ సాధించి ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 5వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు నమోదైన రికార్డులు ఇలా..
➤ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం వెస్టిండీస్ (2012, 2016) మాత్రమే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
➤ టోర్నీ చరిత్రలో ఆతిధ్య జట్లు కప్ గెలిచిన దాఖలాలు లేవు, అలాగే వరుసగా ఏ జట్టు రెండు సార్లు కప్ నెగ్గింది లేదు.
➤ ఇప్పటివరకు జరిగిన 8 పొట్టి ప్రపంచకప్‌లు ఆడిన ఆటగాళ్లు: రోహిత్ శర్మ, షకిబ్ అల్ హసన్
➤ అత్యధిక టీమ్ స్కోర్: 260/6 (2007లో కెన్యాపై శ్రీలంక చేసింది)
➤ అత్యల్ప స్కోర్: 39 ఆలౌట్ (2014లో నెదర్లాండ్స్)
➤ అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టు: శ్రీలంక (2009, 2012, 2014)
➤ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో)
➤ ఫాస్టెస్ట్ హండ్రెడ్: క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్ పై గేల్ 48 బంతుల్లో)
➤ అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (2) (2007, 2016)
➤ అత్యధిక హాఫ్ సెంచరీలు: విరాట్ కోహ్లి (10)
➤ అత్యధిక వ్యక్తిగత స్కోర్: బ్రెండన్ మెక్‌కల్లమ్ (123)
➤ అత్యధిక సగటు: విరాట్ కోహ్లి (76.81)
➤ అత్యధిక స్ట్రయిక్ రేట్: డారెన్ స్యామీ (164.12)
➤ అత్యధిక సిక్సర్లు: క్రిస్ గేల్ (61)
➤ అత్యధిక ఫోర్లు: మహేళ జయవర్ధనే (111)
➤ అత్యధిక పరుగులు: మహేళ జయవర్ధనే (31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు)
➤ అత్యధిక వికెట్లు: షకిబ్ అల్ హసన్ (31 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు)
➤ మోస్ట్ డిస్మిసల్: ఎంఎస్ ధోని (21 క్యాచ్ లు, 11 స్టంపింగ్స్)
➤ అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): ఏబీ డివిలియర్స్ (23)
T20 World Cup India Team : టీ-20 వరల్డ్ కప్ 2022 టీమిండియా ఇదే.. వీరికి మరోసారి మొండిచెయ్యి..
T20 World Cup New Rules : టి-20 వరల్ట్ కప్‌లో అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫస్ట్ టైమ్..
Cricket New Rules : కొత్త నిబంధన ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా..
BCCI New President : బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఈయనే.. ?
T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..