Hardik Pandya : భారత క్రికెట్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డ్.. హార్ధిక్ పాండ్యాకే సొంతం.. ఎందుకంటే..?
ఈ క్రమంలో హార్ధిక్.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్ కూడా కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. అతని సారధ్యంలో టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌లో (5వ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి) ఓడింది.
☛ ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈతనే..
అయితే రోహిత్ టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయ్యాక వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్ టీమిండియాను వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 3 ఓటముల తర్వాత రోహిత్ మళ్లీ పుంజుకన్నాడు. ఈసారి వరుసగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20ల్లో వరుస అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఈ రికార్డు ఇప్పటికీ హిట్‌మ్యాన్ పేరిటే ఉంది.
☛ ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధర పలికిన ఆటగాళ్లు వీరే..
రెగ్యులర్ కెప్టెన్ కాకుండానే..
పూణే వేదికగా శ్రీలంకతో జనవరి 5వ తేదీన జరుగనున్న రెండో టీ20, కెప్టెన్‌గా హార్ధిక్‌కు 7వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనూ హార్ధిక్ టీమిండియాను విజయపధంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్ వరుస విజయాల రికార్డుకు మరింత చేరువవుతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ కాకుండానే హార్ధిక్ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగనున్న రెండో టీ20లో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు లంక సైన్యం సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.