TS Assembly Speaker Gaddam Prasad Kumar : తెలంగాణ తొలి దళిత స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్.. ఈయన బ్యాక్ గ్రౌండ్ ఇదే..
గడువు ముగియడంతో ఆయన స్పీకర్ కావడం ఖాయమైంది. శాసనసభ స్పీకర్ ఎన్నిక నామినేషన్ల కోసం డిసెంబర్ 13వ తేదీన(బుధవారం)ఆఖరి రోజుకాగా.. ఒకే ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ప్రొటెం స్పీకర్ రేపు(గురువారం డిసెంబర్ 14)న శాసన సభలో స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఈయన బ్యాక్ గ్రౌండ్ ఇదే..
గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Tags
- telangana assembly speaker gaddam prasad kumar
- telangana assembly speaker gaddam ravi kumar details
- Telangana New Assembly speaker 2023
- Telangana New Assembly speaker news telugu
- TS Assembly Speaker Gaddam Prasad Kumar Details in Telugu
- TelanganaAssembly
- GaddamPrasadKumar
- CongressParty
- brs
- Majlis
- Sakshi Education Latest News