Skip to main content

Celebrity deaths : 2022లో కన్నుమూసిన ప్రముఖులు

యావత్‌ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్‌ (92); పద్మవిభూషణ్, కథక్‌ దిగ్గజం పండిట్‌ బిర్జు మహరాజ్‌ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

➤ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది.

Best Moments in India 2022 : భారత్‌లో 2022లో జరిగిన చరిత్మ్రాక మెరుపులు ఇవే..
➤ ప్రముఖ తెలుగు సినీ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న‌వంబ‌ర్ 15వ తేదీ (మంగళవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

krishnam raju

➤ కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌

➤ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెపె్టంబర్‌ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్‌ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు.  
➤ సోవియెట్‌ యూనియన్‌ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచెవ్‌ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్‌ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్‌ శాంతి బహుమానం ఆయనను వరించింది. 
➤ జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు.

➤ Issues in 2022 : భార‌త్‌లో 2022లో సంచలనం రేపిన ఘర్షనలు..

Published date : 28 Dec 2022 06:49PM

Photo Stories