Skip to main content

Biography of LK Advani: అద్వానీ చిరకాల కోరిక అదే, కానీ ఆయన స్థానంలో మోదీ..

రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ(96)కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని,ఆయన చేసిన సేవలను కొనియాడారు.

అద్వానీ స్థానంలో చక్రం తిప్పిన మోదీ
భారత రాజకీయాలపై ఎల్‌కే అద్వానీ పాత్ర మరువలేనిది.  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి వాజ్‌పేయి ప్రధాని కావడానికి పాటుపడిన రాజకీయ చతురుడు. ఏనాటికైనా ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఆయన కల. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గుజరాత్‌ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ  2014 ఎన్నికల్లో బీజేపీ ప్రచారసారథిగా పగ్గాలు చేపట్టి.. ఆ పార్టీకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారు.

ఆ తర్వాత ఆయన ప్రధానిగా ఎన్నికకావడం చకచకా జరిగిపోయింది. దశాబ్దాల రాజకీయ పార్లమెంటరీ కెరీర్‌లో హోం మంత్రి, ఉప ప్రధానమంత్రి, ప్రసార మంత్రి.. ఇలా ఎన్నో కీలక పదవులను నిర్వహించారు.

అద్వానీ జీవితంలోని కీలక ఘట్టాలు: 

నవంబర్ 8, 1927: ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో కిషన్‌చంద్, జ్ఞానీదేవి అద్వానీలకు ఎల్‌కె అద్వానీ జన్మించారు.
1936 -1942: కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్‌లో చదువుకున్నారు, మెట్రిక్యులేషన్ వరకు ప్రతి తరగతిలో మొదటి స్థానంలో నిలిచారు.
1942: 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)లో వలంటీర్‌గా చేరారు.
1942: క్విట్ ఇండియా ఉద్యమంలో దయారామ్ గిడుమల్ నేషనల్ కాలేజీ, హైదరాబాద్‌లో చేరారు.
1944: కరాచీలోని మోడల్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేశారు.
సెప్టెంబర్ 1947: విభజన సమయంలో ఆయన దిల్లీకి వచ్చారు.
1947-1951: కరాచీ శాఖకు ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా అల్వార్, భరత్‌పూర్, కోట, బుండి, ఝలావర్‌లలో పని చేశారు.
1957: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి సహాయకుడిగా పనిచేశారు. 
1958-63: దిల్లీ రాష్ట్ర జనసంఘ్ కార్యదర్శిగా నియామకం
1970: మొదటిసారి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు
1960-1967: జనసంఘ్ పొలిటికల్ జర్నల్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు.
ఫిబ్రవరి 1965: కమల అద్వానీని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రతిభ, జయంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఏప్రిల్ 1970: రాజ్యసభకు ఎంపికై.. తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు.
డిసెంబర్ 1972: భారతీయ జనసంఘ్ (BJS) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
జూన్ 1975: ఎమర్జెన్సీ సమయంలో బెంగుళూరులో అరెస్ట్ అయ్యారు. కొంతకాలం ఆయన్ను బెంగుళూరు సెంట్రల్ జైళ్లోనే ఉంచారు.
మార్చి 1977 - జూలై 1979 వరకు: జనతా ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రి పదవిని నిర్వహించారు.
1980-86: బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.
1986మే: బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1988 మార్చి: బీజేపీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.
1988: బీజేపీ ప్రభుత్వంలో హోం మంత్రి పదవిని నిర్వహించారు.
1990: సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రామరథ యాత్రకు శ్రీకారం చుట్టారు.
1997: భారతదేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్వర్ణ జయంతి రథయాత్రను ప్రారంభించారు.
అక్టోబర్ 1999-మే 2004: వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోమంత్రిగా పని చేశారు.
జూన్ 2002-మే 2004: వాజ్‌పేయి నేతృత్వంలోనే రెండేళ్ల పాటు ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు.

Published date : 03 Feb 2024 03:32PM

Photo Stories