Skip to main content

Bharata Ratna: పీవీ నరసింహారావుకు భారతరత్న.. పీవీతో పాటు మ‌రో ఇద్దరికి..

తెలుగు బిడ్డ, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది.
Narasimha Rao To Receive Bharat Ratna Award  The central government has announced Bharat Ratna award to five people.

పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇప్పటికే బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు మందికి భారతరత్న పురస్కారం ప్రకటించింది. 

Bharat Ratna: ‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులు వీరే..

పీవీ ప్రస్థానం ఇదే..
పాత కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది.

తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్‌ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు.

1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

 

Published date : 09 Feb 2024 01:46PM

Photo Stories