Skip to main content

Supreme Court: ఇక నుంచి తెలుగులోనూ సుప్రీం తీర్పు ప్రతులు... ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసి చదువుకోవచ్చు..!

సుప్రీం కోర్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కోర్టులో వాదనలు, ప్రతివాదనలు ఇంగ్లిషులోనే సాగుతుంటాయి. అలాగే తుది తీర్పు కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.

అయితే తీర్పులో ఏం రాసి ఉందో తెలుసుకోలేక కక్షిదారులు ఇబ్బందులు పడేవారు. ఇటువంటి ఇబ్బందులకు ఇక నుంచి చెక్‌ పడనుంది. రాజ్యాంగంలోని 22 భాషల్లో తీర్పు ప్రతులను అందుబాటులో ఉంచేందుకు సుప్రీం చర్యలు ప్రారంభించింది. 
జనవరి 26వ తేదీ నుంచి...
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించింది. షెడ్యూల్డ్‌ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని తెలిపింది. ఎలక్ట్రానిక్‌ సుప్రీంకోర్టు రిపోర్ట్స్‌(ఈ–ఎస్‌సీఆర్‌) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు.

చ‌ద‌వండి: ఆరు దాటితే అడుగు బయటపెట్టాలంటే హడల్‌..!
ఉచితంగా తీర్పుల ప్రతులు...
రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషల్లో తీర్పులను ప్రజలు ఉచితంగా పొందొచ్చు. 
అందుబాటులో 34 వేల తీర్పులు
ఈ–ఎస్‌సీఆర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 34,000 తీర్పులు పొందొచ్చు. వాటిలో ఇప్పటికే 1,268 తీర్పులు ప్రాంతీయ భాషల్లో ఉన్నాయి. తీర్పుల్లో 1091 హిందీలో, 21 ఒడియాలో, 14 మరాఠీ, 4 అస్సామీ, ఒకటి గారో, 17 కన్నడ, ఒకటి ఖాసీ, 29 మలయాళం, 3 నేపాలీ, 4 పంజాబీ, 52 తమిళం, 28 తెలుగు, 3 ఉర్దూ భాషల్లో ఉన్నాయి. జనవరి 26వ తేదీ నుంచి 13 భాషల్లో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్‌సైట్, మొబైల్‌ యాప్, నేషనల్‌ జ్యుడీషియల్‌ డాటా గ్రిడ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీదాకా వెలువరిచిన తీర్పులను న్యాయవాదులు, లా విద్యార్థులు, సాధారణ జనం అందరూ వీటిల్లో ఉచితంగా చూసుకోవచ్చు.

చ‌ద‌వండి:​​​ 180 పంపిస్తే కేవలం 40 మాత్రమే వినియోగంలో ఉన్నాయి

Published date : 28 Jan 2023 05:07PM

Photo Stories