World Record: వరల్డ్ రికార్డు నమోదు చేసిన బిహార్ వాసి
Sakshi Education
బిహార్‌లోని కైమూర్ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్ సరికొత్త రికార్డ్‌ను నమోదు చేశారు.
![](/sites/default/files/images/2023/02/09/untitled-1-copy-1675938174.jpg)
165 కిలోల బరువును తన పళ్లతో పది సెకన్లపాటు పైకిలేపి ప్రపంచ రికార్డు నమోదు చేశారు. త్రిపురలోని అగర్తలాకు చెందిన నేతాజీ వరల్డ్ రికార్డ్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో ఈ అరుదైన రికార్డ్‌ను ధర్మేంద్ర కుమార్ సొంతం చేసుకున్నారు. ధర్మేంద్ర ఇప్పటివరకు 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ‘హ్యామర్ హెడ్మాన్ ఆఫ్ ఇండియా’గా ఈయన పేరుపొందారు.
Published date : 09 Feb 2023 03:52PM