Chiranjeevi: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు.. కారణం ఇదే..
చిరంజీవి సుమారు 46 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా తిరుగులేని జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. చిరు తనదైన స్టైల్లో డ్యాన్స్‌లు, నటనతో ఎప్పటికప్పుడూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో రికార్డ్ నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా చిరు మాత్రమే ఉన్నారు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‍లో ఈమేరకు ఓ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిథులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డ్ అందుకున్నారు.
చిరంజీవి ‘పునాదిరాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి, బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు.
Oscar 2025: ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎపికైన సినిమా ఇదే..
9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఆయనకు ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది.