Skip to main content

Pele Achievements In Football: ఫుట్‌బాల్‌ లెజండ్‌ పీలే... గోల్స్‌.. వివాహాలు.. పిల్లల.. విశేషాలు తెలుసా

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. పెద్ద పేగు కాన్సర్‌తో బాధపడుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
Pele

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పీలే ఆట అద్భుతం. అతని ప్రదర్శన బ్రెజిల్‌కు వరం. నాలుగు ప్రపంచకప్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లు అందుకున్నాడు. రెండు కాళ్లతోనూ బంతిని నియంత్రించే అతను.. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. గాల్లో వేగంగా వచ్చే బంతిని ఛాతీతో నియంత్రించి.. అది కిందపడి పైకి లేవగానే కాలుతో సూటిగా తన్ని గోల్‌పోస్టులోకి పంపించడంలో అతని ప్రత్యేకతే వేరు. ఈ తరం అభిమానులకు పీలే ఆట గురించి అంతగా పెద్దగా తెలియదు.. కానీ, యూట్యూబ్‌లో అతని టాప్‌ గోల్స్‌ చూస్తే ఆటలో అతని మాయ అర్థమవుతోంది.

చ‌ద‌వండి: 19 ఏళ్ల‌కే ఫిఫా ఎంట్రీ... ఎంబాపె గురించి మీకు ఈ విషయాలు తెలుసా
1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్‌ను.. డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్‌పోస్టులోకి అతను పంపించిన తీరు అమోఘం. 1958 ప్రపంచకప్‌ ఫైనల్లో స్వీడన్‌ పై పెనాల్టీ ప్రదేశంలో సహచర ఆటగాడి నుంచి బంతి అందుకున్న అతను.. ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించిన వైనం అసాధారణం. చెప్పుకుంటూ పోతే ఇలాంటి గోల్స్‌ మరెన్నో. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగా బ్రెజిల్‌ ఓ వెలుగు వెలిగిందంటే అందుకు ప్రధాన కారణం పీలే.

చ‌ద‌వండి: హార్మోన్‌ లోపంతో ఇబ్బంది... ఇప్పుడు ప్రపంచకప్‌ విన్నర్‌... మెస్సీ జీవిత విశేషాలు
14 మ్యాచ్‌ల్లో 12 గోల్స్‌...
1958 ప్రపంచకప్‌లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రాణించి ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్‌లో గాయం కారణంగా ప్రభావం చూపలేకపోయాడు. 1966లో జట్టు నిరాశాజనక ప్రదర్శనతో అతను ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి సొంతం చేసుకున్నాడు. 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ప్రపంచకప్‌ల్లో 14 మ్యాచ్‌ల్లో 12 గోల్స్‌ సాధించాడు.

చ‌ద‌వండి: అమిత్‌ లోధా... ఖాఖీ వెబ్‌సిరీస్‌లోని ఈ ‘ఖాఖీ’ గురించి తెలుసా....
831 మ్యాచుల్లో 767 గోల్స్‌....
1959 ఒక్క సంవత్సరంలోనే అతడు 126 గోల్స్‌ కొట్టడం ఓ రికార్డు. మూడు ప్రపంచకప్‌లు అందుకొన్న ఏకైక ఆటగాడు పీలేనే. కెరీర్‌ మొత్తం 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్‌ చేశాడు. పీలే సుదీర్ఘ కెరీర్‌లో మ్యాచ్‌లు.. గోల్స్‌ నిష్పత్తి 0.93..... ఇది మెస్సీ, రొనాల్డో కంటే చాలా ఎక్కువ. అధికారికంగా ఆడిన 831 మ్యాచ్‌ల్లో 767 గోల్స్‌ చేశాడు. మెస్సీ, రొనాల్డో ఇన్ని గోల్స్‌ చేయడానికి దాదాపు 1,000 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.  

చ‌ద‌వండి: కథ బాగుంది.... నువ్వయితే సినిమానే వద్దు
16 ఏళ్లలోనే అంతార్జాతీయ ఎంట్రీ...
సాకర్‌ స్టార్‌ పీలే బాల్యం కడు పేదరికంలో సాగింది. చివరికి సొంతంగా ఫుట్‌బాల్‌ కూడా కొనుగోలు చేయలేని కుటుంబం అతడిది. దీంతో సాక్సులో పేపర్లు నింపి బంతిలా చేసి.. దానితోనే ఆడేవాడు. 14 ఏళ్ల వయసులోనే సీనియర్లతో ఆడే అవకాశం లభించింది. అలా రాణిస్తూ 15 ఏళ్ల వయసులో తాను ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో గోల్‌ కొట్టాడు. 16 ఏళ్ల వయసులో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో గోల్‌ కొట్టి... బ్రెజిల్‌ తరఫున అతి పిన్న వయసులో గోల్‌ కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

చ‌ద‌వండి: రిక్షావాలా కూతురు .... మిస్‌ ఇండియా రన్నరప్‌
మూడు పెళ్లిళ్లు... 7గురు పిల్లలు
1940 అక్టోబర్‌ 23న బ్రెజిల్‌లోని ట్రెస్‌ కొరాకోస్‌లో సెలెస్ట్‌ అరాంట్స్, జోవో రామోస్‌ నాసిమియాంటో దంపతులకు జన్మించాడు పీలే. అతడి అసలు పేరు ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో. చిన్నతనం నుంచే  అతన్ని పీలే అని పిలుస్తుండడంతో అతడికి ఆ పేరే స్థిరపడింది. నిజానికి పీలే అంటే అర్థం ఏంటో కూడా అతడికి తెలియదు. పీలే జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రోజ్‌మెరి, అసిరియా లెమోస్, మార్సియాలను వివాహమాడాడు. మొత్తం పీలేకు కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (చనిపోయారు), ఫ్లావియా, జోషువా, సెలెస్టె సంతానం.

Published date : 30 Dec 2022 01:49PM

Photo Stories