Shah Rukh Khan: టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్‌షా
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ–మేఘన్ దంపతులు, ఆస్కార్ విజేత మిచెల్ యియోహ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్ మ్యాగజీన్ తెలిపింది. ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్’స్టార్‌కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్ టాప్ 100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. టాప్ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్ పాలన నుంచి స్వేచ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి. టైమ్ 2022 జాబితాలోనూ హీరోస్ ఆఫ్ ది ఇయర్‌ను ఇరాన్ మహిళలే గెలుచుకోవడం గమనార్హం.
Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్.. ఎవరీమె..?
ఆ తర్వాత బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్‌బర్గ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్ మేగజీన్ తెలిపింది.