FIFA Football awards: 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా అర్జెంటీనా కెప్టెన్‌గా మెస్సీ
గత ఏడాది ఖతర్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ ఫైనల్లో కెప్టెన్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్ చేశాడు. ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డు కోసం మెస్సీ, కిలియాన్ ఎంబాపె (ఫ్రాన్స్), కరీమ్ బెంజెమా (ఫ్రాన్స్) పోటీపడ్డారు. జాతీయ జట్ల కెప్టెన్‌లు, కోచ్‌లు, ఎంపిక చేసిన జర్నలిస్ట్‌లు, ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్యలో సభ్యత్వం ఉన్న 211 దేశాల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఓటింగ్‌లో మెస్సీకి 52 పాయింట్లు రాగా.. ఎంబాపెకు 44 పాయింట్లు, కరీమ్ బెంజెమాకు 34 పాయింట్లు వచ్చాయి. గత 14 ఏళ్లలో మెస్సీ ఏడోసారి ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డు గెల్చుకోవడం విశేషం. ఉత్తమ కోచ్‌గా అర్జెంటీనాకు ప్రపంచ టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన లియోనెల్ స్కలోని ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్‌కు చెందిన అలెక్సియా పుటెలాస్‌కు లభించింది.