Skip to main content

పోటీపరీక్షలో్ల పాలిటీలోని గవర్నెన్స్ అంశాలను ఎలా చదవాలి? రిఫరెన్స్పుస్తకాలను సూచించండి?

- ఎస్.రామునాయుడు, గుంటూరు.
Question
పోటీపరీక్షలో్ల పాలిటీలోని గవర్నెన్స్ అంశాలను ఎలా చదవాలి? రిఫరెన్స్పుస్తకాలను సూచించండి?
  • పాలన అంటే ప్రభుత్వ పనితీరు, నిర్వహణ. ఆధునిక ప్రభుత్వాలు ప్రజలకు గరిష్ట సేవలు అందించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా వచ్చినవే సుపరిపాలన, ఇ-పరిపాలన.
  • గతంలో ప్రభుత్వం అంటే కేవలం సంప్రదాయ శాసనాలు, వాటి అమలుకు పరిమితమై ఉండేది. కానీ, ప్రజలు నేడు ప్రభుత్వం కంటే పాలన కోరుకుంటున్నారు. అయితే ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి గరిష్ట, సత్వర ప్రామాణిక సేవలను కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే అందించలేవు. వాటికి తోడు పౌర సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సంస్థల సహకారం, సామాజిక బాధ్యత కూడా అవసరం. కాబట్టి సుపరిపాలనకు అవసరమయ్యే అంశాల స్వభావాన్ని, ఆవశ్యకతను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి.
  • పాలనలో నైతిక విలువల ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాలనలో రాజకీయ జోక్యం.. ప్రభుత్వ అధికారులపై, ప్రజలకు అందించే సేవలపై ప్రభావం చూపుతుంది. అవినీతిని, ఆశ్రీత పక్షపాతాన్ని అరికట్టాలంటే ప్రజలకు వారిని ప్రశ్నించే అవకాశమివ్వాలి. అందులో భాగంగా వచ్చినవే ఈ-పౌర, సిటిజెన్ చార్టర్లు, పారదర్శకత, జవాబుదారీతనం. ఈ నేపథ్యంలో పౌర సమాజం, ప్రజావేగుల పాత్ర, ఆవశ్యకత, నిఘా సంస్థలైన లోక్‌పాల్, లోకాయుక్త, సమాచార హక్కు చట్టం, రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ నివేదికలను జాగ్రత్తగా చదివి వాటి ప్రాముఖ్యతను విశ్లేషించుకోవాలి.
  • తేలిగ్గా, సత్వరం సేవలు అందించేందుకు సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను ముఖ్యంగా ఇంటర్నెట్, వెబ్‌సైట్ ఆధారిత సేవలు, ఇ-సేవ, మీ-సేవలు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను, పరిమితులపై దృష్టిసారించాలి.
రిఫరెన్స్ పుస్తకాలు...

 1. తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోని 'భారతదేశ పాలన' పాఠ్యపుస్తకం.
 2. యోజన తదితర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు.

Photo Stories