Skip to main content

గ్రూప్-2 పేపర్-4లోని తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం అంశాలకు ఎలా సిద్ధమవాలి?

- ఎన్.విజయ్‌కుమార్, హైదరాబాద్.
Question
గ్రూప్-2 పేపర్-4లోని తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం అంశాలకు ఎలా సిద్ధమవాలి?
సెక్షన్-1లోని ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70) కోసం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు కారణాలు, దారితీసిన పరిస్థితులు. ఈ కాలంలో ముఖ్యమైన ఉద్యమాల గురించి తెలుసుకోవాలి. హైదరాబాద్‌పై పోలీస్ చర్య, ముఖ్యమైన పరిణామాలు, భూదానోద్యమ ముఖ్య పరిణామాలు- కారణమైన పరిస్థితులు, పెద్ద మనుషుల ఒప్పదం-అందులో ముఖ్యాంశాలు-తీర్మానాలు, 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన సంఘటనల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

సెక్షన్-2 గా పేర్కొన్న సమీకరణ దశ (1971-1990)కు సంబంధించి ముఖ్యమైన అంశాలు.. జై ఆంధ్ర ఉద్యమం, ఆరు సూత్రాల పథకం, తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/ పార్టీలు, ముల్కీ ఉద్యమాలు, నిబంధనలు వంటి వాటిపై అధ్యయనం చేయాలి.

సెక్షన్-3లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)కు సంబంధించి ఆయా పార్టీల ఏర్పాటు-అందుకు దారితీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు (మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటివి), వాటి పర్యవసానాలను అధ్యయనం చేయాలి.

రిఫరెన్స్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీల నివేదికలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలు.

Photo Stories