Skip to main content

నేను బీటెక్‌ మెకానికల్‌ పూర్తిచేశాను. దీని తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి చెప్పండి?

Question
నేను బీటెక్‌ మెకానికల్‌ పూర్తిచేశాను. దీని తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి చెప్పండి?
  • ఇంజనీరింగ్‌ కోర్‌ బ్రాంచ్‌ల్లో మెకానికల్‌ ఒకటి. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసినవారికి అవకాశాలకు కొదవలేదు.బోయింగ్, నాసా టాటా గ్రూప్, అశోక్‌ లేల్యాండ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జీఈ, ఫోర్డ్‌ మోటార్స్, ఎల్‌ అండ్‌ టీ, గోద్రేజ్‌ గ్రూప్‌ వంటి వాటిల్లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌తో అవకాశాలు అందుకోవచ్చు. 
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌తో ప్రభుత్వ రంగ కంపెనీల్లో, ఇస్రో, బార్క్‌ వంటి సంస్థల్లో చేరే వీలుంది. గేట్‌ స్కోరుతోపాటు ఆయా సంస్థలు నిర్వహించే నియామక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసినవారికి భారత సాయుధ దళాలు సైతం అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్‌ విడుదలయ్యే వాటిలో ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్, నేవీ ముందుంటున్నాయి. వీటి ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపితే మంచి జీతభత్యాలతో ఉన్నత కొలువు సొంతం చేసుకోవచ్చు. 
  • రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ ఇంజనీర్ల నియామకాన్ని స్టేట్‌ సర్వీస్‌ కమిషన్‌ల ద్వారా చేపడతారు. ఆయా నోటిఫికేషన్‌లకు సిద్ధమైతే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. 
  • బీటెక్‌ అభ్యర్థులు గేట్, పీజీఈసెట్‌ ద్వారా ఎంటెక్‌లో చేరొచ్చు. కొంతమంది నాన్‌ టెక్నికల్‌ విభాగంలో ఉన్నత చదువులు కోరుకుంటారు. ఇలాంటి వారు ఎంబీఏను ఎంచుకోవచ్చు. క్యాట్, మ్యాట్‌ వంటి ఎంట్రన్స్‌ల ద్వారా ఎంబీఏలో చేరొచ్చు.
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేస్తే.. కార్పొరేట్‌ రంగంలో తయారీ రంగ కంపెనీల్లో మంచి కెరీర్‌ సొంతమవుతుంది. 
  • క్రియేటివ్‌ రంగంపై ఆసక్తి ఉంటే.. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తర్వాత డిజైన్, యానిమేషన్, గేమింగ్‌ రంగంలోనూ అవకాశాలు అందుకోవచ్చు.

Photo Stories